NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ నేత‌కు జ‌న‌సేన టికెట్‌.. మ‌ళ్లీ మంట‌లే.. !

టీడీపీ నుంచి రెండు రోజుల కింద‌టే పార్టీ మారి.. జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్న సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఉప స‌భాప‌తి మండ‌లి బుద్ద‌ప్ర‌సాద్ కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ టికెట్ కేటాయించారు. వాస్త‌వానికి ఇక్క‌డ జ‌న‌సేన‌కు విక్కుర్తి వేణుగోపాల్ స‌హా మ‌రో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు ఉన్నారు. అయితే.. వీరిలో ఒక‌రిని ఎంపిక చేస్తామ‌ని ఆది నుంచి చెబుతూ వ‌చ్చిన ప‌వ‌న్.. చివ‌ర‌కు టీడీపీ నుంచి మండ‌లిని తీసుకుని.. ఆయ‌న‌కు తాజాగా టికెట్ ప్ర‌క‌టించారు.

అయితే.. ఈ ప్ర‌యోగాలు జ‌న‌సేన‌లో ఇటీవ‌ల కామ‌న్ అయ్యాయి. టీడీపీ నుంచి అప్ప‌టిక‌ప్పుడు జ‌న‌సేన‌లో చేర్చుకున్న పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులుకు భీమ‌వ‌రం టికెట్ ఇచ్చారు. అస‌లు ఏ పార్టీలోనూ లేని.. కొణ‌తా ల రామ‌కృష్ణ‌కు అన‌కాప‌ల్లి టికెట్ కేటాయించారు. వైసీపీ నుంచి ఎన్నిక‌ల షెడ్యూల్ త‌ర్వాత వ‌చ్చిన చేరిన ఆర‌ణి శ్రీనివాసులుకు.. తిరుప‌తి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. దీంతో జ‌న‌సేన శ్రేణులు ర‌గిలిపోతున్నాయి. తీసుకున్న‌ది 21 సీట్లు. అవి కూడా జ‌న‌సేన‌లో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన‌వారికి ఇవ్వ‌కుండా ఇలా చేయ‌డం ఏంట‌నేదివారి ప్ర‌శ్న‌.

అయితే.. తాను తీసుకున్న నిర్ణ‌య‌మే ఫైన‌ల్‌… త‌న‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌డానికి వీల్లేద‌న్న‌ది జ‌న‌సేన అధినే త మాట‌. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో జ‌న‌సేన కునారిల్లిపోతుండ‌డం గ‌మ‌నార్హం. అభ్య ర్థుల్లో స‌త్తా ఉంటే గెలిచే అవ‌కాశం ఉంటుంది. లేక‌పోతే.. కేడ‌ర్‌పై మాత్రం ఆధార‌ప‌డ్డారా.. ఎక్క‌డా వారి స‌హ కారం మచ్చుకు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన గురించి ఏ ఇద్ద‌రు మాట్లాడుకు న్నా.. అది కూడా టీడీపీనే! అనే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి ఒక పార్టీ నుంచి అభ్య‌ర్థి పార్టీ ని వ‌దిలేయ‌డానికి అర్ధం ఉంది. కానీ.. పొత్తులో ఉన్న టీడీపీ నుంచి నాయ‌కుల‌ను తీసుకుని, వారికే టికెట్లు ఇస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ జెండాలు మోసిన వారు.. ఖ‌ర్చె పెట్టిన వారు.. ప‌వ‌న్ కోసం.. వీరాభిమానం ప్ర‌ద‌ర్శించిన వారు ఏం కావాలి? రేపు వీరిలో ఎవ‌రైనా ఓడిపోతే.. మ‌ళ్లీ ప‌వ‌న్‌కు జై కొడ‌తారా? క‌నీసం ప‌వ‌న్ మొహం కూడా చూస్తార‌నే గ్యారెంటీ లేదు. అంతిమంగా ప‌వ‌న్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణ‌యాలు.. ప్ర‌జా కోర్టులో ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటాయో చూడాలి.

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N