NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

3 పార్టీల కూట‌మిలో క‌ల్లోలం.. ఏం జ‌రుగుతోంది…!

ఏపీలో విజ‌యం ద‌క్కించుకుని వైసీపీకి చెక్ పెట్టాల‌నే ఏకైక ఉద్దేశంతో చేతులు క‌లిపిన బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన కూట‌మిలో మ‌రోసారి క‌ల్లోలం రేగిందా? ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేని కార‌ణంగా.. ఈ ద‌ఫా నేత‌ల సూచ‌న‌ల మేరకు నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం మార్పులు-చేర్పుల దిశ‌గా నాయ‌కులు దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. దీంతో మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఇవీ చ‌ర్చ‌లో ఉన్న మార్పులు..

+ పొత్తులో భాగంగా నర్సాపురం లోక్‌సభను బిజెపి తీసుకుంది. అయితే ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ అయితే వైసిపి సులువుగా గెలుస్తుందన్న అభిప్రాయానికి కూటమి పార్టీలు వచ్చాయి. దీంతో ఈ సీటును టిడిపి తీసుకుని బిజెపికి ఏలూరు లోక్‌సభ సీటును ఇచ్చేందుకు నిర్ణయం జరిగినట్లు తెలిసింది. టిడిపి తరపున సిట్టింగ్‌ ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు.

+ గజపతి నగరం అభ్యర్ధిగా కొండపల్లి శ్రీనివాస్‌ను, శ్రీకాకుళం అభ్యర్ధిగా గోండు శంకర్‌, పైలా ప్రసాద్‌ను మాడుగులకు, కొలికపూడి శ్రీనివాస్‌ తిరువూరుకు, మడకశిర ఎంఈ సునీల్‌ కుమార్‌ను, తంబళ్లపల్లికి జయచంద్రారెడ్డిని, ఆదిమూలం కొనేటిని సత్యవేడుకు, సొంగ రోషన్‌ను చింతలపూడి అభ్యర్ధులుగా టిడిపి తన అభ్యర్ధులుగా ప్రకటించింది. వీరిలో కొంతమందిపై వ్యతిరేకత ఉండగా, మరికొన్ని చోట్ల ప్రత్యర్థులు బలంగా ఉన్నారని తేలినట్లు సమాచారం, దీంతో వీరిని మార్చే పనిలో టిడిపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

+ పాతపట్నం అభ్యర్థిగా కలమట వెంకట రమణ, శ్రీకాకుళం అభ్యర్ధిగా గుండా లక్ష్మీదేవి, మాడుగుల రామానాయుడు, మడకశిర నుంచి పార్టీ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు ఎంఎస్‌ రాజును, చింతలపూడి నుంచి కెఎస్‌ జవహర్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరువూరు నుంచి వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి పేరు తెరపైకి వస్తోంది. ఆయన వైసిపి నుంచి బయటకు వచ్చారు.

+ బిజెపి కూడా అనపర్తి అభ్యర్ధిగా ప్రకటించిన శివకృష్ణరాజును మార్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సొంత గ్రామం రంగపురం నుంచి సర్పంచ్‌గా పోటీ చేస్తే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో శివకృష్ణరాజును మార్చాలనే నిర్ణయం తీసుకుంది. అనపర్తి టిడిపి ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒత్తిడి తీసుకొచ్చిన్నట్లు సమాచారం. పార్టీ మారే ప్రసక్తే లేదని రామకృష్ణారెడ్డి చెప్పిన్నట్లు తెలిసింది. దీంతో ఈ సీటును టిడిపికి అప్పగించి మరో సీటును తీసుకోవాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

+ జమ్మలమడుగు శాసనసభ అభ్యర్థిగా చపిడిరాళ్ల ఆదినారాయణ రెడ్డిని బిజెపి ప్రకటించింది. కడప లోక్‌సభ టిడిపి అభ్యర్థిగా ఆయన సోదరుని కుమారుడు చపిడిరాళ్ల భూపేష్‌ రెడ్డిని టిడిపి ప్రకటించింది. తమ పార్టీలు ఒప్పుకుంటే కడప లోక్‌సభ నుంచి తాను పోటీ చేస్తానని, జమ్మలమడుగు నుంచి భూపేష్‌ పోటీ చేస్తారని ఇటీవల ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఇరుపార్టీలు దృష్టి పెట్టాయి. మార్పు ఖాయ‌మ‌ని స‌మాచారం.

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N