Pushpa 2 The Rule Teaser: ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమా “పుష్ప 2”. 2021వ ఏడాది “పుష్ప” విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పేరు ప్రపంచ స్థాయిలో మారుమోగింది. అంతేకాకుండా ఈ సినిమాకి తెలుగు ఇండస్ట్రీలో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకున్న హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. స్టోరీ పరంగా పాటల పరంగా అన్ని రకాలుగా “పుష్ప” అందరినీ అలరించడం జరిగింది. హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా గాని 100 కోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
సినిమాలో తగ్గేదేలే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ కాబోతున్నట్లు విడుదల తేదీ ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఏప్రిల్ 5వ తారీఖు.. హీరోయిన్ రష్మిక పుట్టినరోజు కావటంతో “పుష్ప 2″లో ఆమెకు సంబంధించిన ఫోటో విడుదల చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 8వ తారీకు అల్లు అర్జున్ జన్మదినోత్సవం. దీంతో ఆరోజు “పుష్ప” సెకండ్ పార్ట్ టీజర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో టీజర్ కి సంబంధించి కౌంట్ డౌన్ అంటూ.. మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో “పుష్ప-2” మాస్ జాతర మరో రెండు రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ కౌంట్ డౌన్ పోస్టర్ నీ విడుదల చేశారు. త్రిశూలంతో ఉన్న ఆ ఫొటో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఇక ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా “పుష్ప-2” టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ బన్నీ ఫ్యాన్స్ పూనకాలెత్తేలా ఉండనుందని మేకర్స్ హింట్స్ ఇస్తున్నారు.