Kalki: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా మూవీ షూటింగ్ కి సంబంధించిన ఫొటోలను హీరోయిన్ దిశా పటానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటలీలో జరిగిన సాంగ్ షూట్ లో ప్రభాస్, నాగ్ అశ్విన్ తో సరదాగా గడిపిన సన్నివేశాలను ఫొటోల్లో చూపారు. అయితే, సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు వార్తలొస్తుండటంతో సాంగ్ అయినా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్ లో “కల్కి” షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ టెక్నాలజీతో కూడిన కెమెరాలతో చిత్రీకరించటం జరిగింది.
ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హైబడ్జెట్ మూవీగా “కల్కి” షూటింగ్ జరుపుకుంటుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా నిర్మితమవుతుంది. భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. సూపర్ మేన్ తరహాలో స్టోరీ ఉండని ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కమలహాసన్ విలన్ పాత్ర చేయడం జరిగింది. అమితాబచ్చన్ కీలక పాత్ర పోషించారు. దీపికా పదుకొనే మరియు దిశా పటాన్ని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మే 9వ తారీకు సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని సాంగ్స్ షూట్ ఇటలీలో ప్రత్యేకంగా షూటింగ్ చేస్తున్నారు.
దీంతో అక్కడి లొకేషన్ లలో తాజాగా షూటింగ్ జరుగుతున్న సన్నివేశాలను దిశా పటాన్ని సోషల్ మీడియాలో.. ఫోటోలు వీడియోల రూపంలో విడుదల చేయడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కల్కి సినిమా వాస్తవానికి ఈ ఏడాది జనవరి 24వ తారీఖు రిలీజ్ కావాలి. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల.. సినిమా మే నెలకి వాయిదా పడింది. అయితే మే నెలలో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వర్క్ కి పెద్దపేట వేయడం జరిగిందట. సో ఆ పని కాస్త స్లోగా జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సినిమా విడుదలపై స్పష్టత ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.