OTT: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా నటించిన మూవీ ” తేదీ బాతో మే ఏసా ఉల్టా జియా ” బాక్స్ ఆఫీస్ వద్ద నుంచి వసూళ్లను రాబడుతుంది. ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. ఇక మిక్స్డ్ రివ్యూలే వచ్చిన.. వసూళ్లను మాత్రం ఈ మూవీ బాగానే రాబడుతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి అమిత్ జోషి, ఆరాధన షో దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో రెంట్ లేకుండా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తాజాగా అడుగు పెట్టింది.
హిందీ ఆడియోలో మాత్రమే ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. డబ్బింగ్ వర్షన్లను తీసుకొచ్చేది లేనిది ప్రైమ్ వీడియోలో క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. కొన్ని రోజుల కిందటే ఈ మూవీ రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇక ఇప్పుడు రెంట్ లేకుండా అందుబాటులోకి వచ్చింది. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా ఈ మూవీని చూడవచ్చు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల అనంతరం ఈ మూవీ రెంట్ లేకుండా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. సైన్స్ ఫిక్షన్, లవ్ కామెడీ మూవీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓటిటిలో సైతం ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతుంది.
ఈ సినిమాకి సుమారు రూ. 133 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. కబీర్ సింగ్ అనంతరం షాహిద్ కపూర్ కెరీర్లో ఇది రెండో అతిపెద్ద హిట్గా నిలిచింది. మిశ్రమ స్పందనలు వచ్చిన… వసూళ్లు పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. అదేవిధంగా వరుస ఫ్లాప్ లతో ఉన్న కృతి సనన్ ఖాతాలో ప్రస్తుతం ఓ సూపర్ హిట్ పడిందనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ధర్మేంద్ర, టెంపుల్ కపాడియా, రాకేశ్ బేడీ , అనుభా ఫతేపూరియా, రాజేష్ కుమార్, రాశూల్ టాండన్, బ్రిజ్ భూషణ్ శుక్లా ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి అమిత్ జోష్, ఆరాధన షో డైరెక్టర్ డైరెక్ట్ చేయగా.. సుమారు ఏడుగురు సంగీతం అందించారు. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం రిలీజ్ అవుతున్న మూవీస్ కి ఎక్కువ శాతం సబ్స్క్రిప్షన్ అవసరం ఉండడం లేదు.
ఇది మధ్యతరగతి కుటుంబాలకి మంచిదనే చెప్పొచ్చు. గతంలో ఓటీటీల హడావిడి ఎక్కువ అయిపోవడంతో సబ్స్క్రిప్షన్ ధరలు కూడా భారీగా పెంచేశారు. ఇక ప్రస్తుతం ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా సినిమాలు వాచ్ చేయవచ్చు అని సంగతి తెలిసి చాలా మంది కృషి అవుతున్నారు. కొన్ని సినిమాలు ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఇక అటువంటి సినిమాలలో ఈ మూవీ కూడా ఒకటి. మరి ఈ మూవీ ఓటిటి లో ఏ విధమైన టాక్ దక్కించుకుంటుందో చూడాలి.