Roses Season 2 OTT: ఉగాది సందర్భంగా ఆహా ఓటిటి కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను వరుస పెట్టి అనౌన్స్ చేస్తుంది. ఎట్లిచ్చినాం అనే క్యాప్షన్ తో సినిమాలు మరియు సిరీస్ లకు సంబంధించిన పోస్టర్లను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. డిఫరెంట్ జోనర్ లో రాబోతున్న ఓ సిరీస్ ను తాజాగా ప్రకటించింది. ఆ సిరీస్ నే రోజెస్ 2. పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన త్రీ రోజెస్ వెబ్ సిరీస్ కు సీజన్ 2 రాబోతుంది. డైరెక్టర్ మారుతి క్రియేటర్ గా వ్యవహరించిన ఈ సిరీస్ కు రవి నంబూరి దర్శకత్వం వహించారు. బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జాన్వి, రీతు, ఇందు అనే ముగ్గురు ప్రధాన స్నేహితుర్లా కథలతో ఈ సిరీస్ తెరకెక్కింది. సీజన్ 2 లో కూడా పాయల్ రాజ్పుత్, ఈషా రెబ్బ తో పాటు పూర్ణ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ ముగ్గురు పబ్లో మందు తాగుతున్న పోస్టర్ను ఆహా ఓటిటి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు కూడా సీజన్ 2 లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తిరువీర్, బిగ్బాస్ బ్యూటీ దీప్తి సతి ప్రధాన పాత్రలో నటించిన సిన్ వెబ్ సిరీస్ కు సీజన్ 2 వచ్చేస్తుంది. సీజన్ 2 పోస్టర్ను మంగళవారం రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ఓటిటి పేర్కొంది.
అపార్ట్మెంట్ కల్చర్ బ్యాక్ డ్రాప్ లో యువజన కథతో హరివిల్లు పేరుతో ఓ మూవీ ని తెరకెక్కించినట్లు ఆహా ఓటిటి వెల్లడించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆహా ఒరిజినల్ మూవీలో హీరోయిన్లు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. ఇలా పలు వెబ్ సిరీస్ ని నేడు ఉగాది సందర్భంగా ప్రకటించింది ఆహా. ఇక పాయల్ రాజ్ పుత్ మంగళవారం సినిమాతో భారీ విజయం సంపాదించుకోగా ప్రస్తుతం రోజెస్ సీజన్ 3 తో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సిరీస్ యొక్క స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే వెల్లడించనుంది ఆహా. మంగళవారం సినిమాలో బోల్డ్ లుక్ లో కనిపించిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో కూడా అటువంటి పాత్రలోనే కనిపించనున్నట్లు తెలుస్తుంది.
ఒకప్పుడు ఆర్ఎక్స్ 100 వంటి సినిమాలతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక స్లో అయింది. ఈ క్రమంలోనే చిన్న పాత్రలో అయినా అడ్జస్ట్ అయి నటిస్తుంది. ఇక ఇప్పుడు ఈమె నటిస్తున్నాం రోజెస్ 3 కనుక సూపర్ హిట్ టాక్ అందుకుంటే ఇకనుంచి పాయల్ ఎక్కువగా వెబ్ సిరీస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత కాలంలో సినిమాల కంటే వెబ్ సిరీస్ కే ఎక్కువ ఆదరణ దక్కుతుంది. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకుని పాయల్ వెబ్ సిరీస్ తో దూసుకుపోతుందో లేదా ఈ వెబ్ సిరీస్ తో వచ్చిన సక్సెస్ను సినిమాల్లో చాటుకుంటుందో చూడాలి.