Shashi Madhanam Web Series: రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ ” శశిమథనం ” స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఈటీవీ విన్ ద్వారా ఈ వెబ్ సిరీస్ ఓటిటి ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను ఈటీవీ పోస్ట్ చేసింది. ఈ సిరీస్లో పవన్ సిద్దు, సోనియా సింగ్ జంటగా నటిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సిద్దు జోవియల్ గా కనిపిస్తోన్నండగా, సోనియా కోపంగా దర్శనమిచ్చింది. వారిద్దరి చుట్టూ పాచికలు, ప్లే కార్డ్స్, బాల్స్ తో పాటు ఓ పాతకాలం రేడియో కనిపిస్తుంది. ఈ సిరీస్ లో శశి క్యారెక్టర్ లో సోనియాసింగ్, మధన్ పాత్రలో పవన్ సిద్ధూ కనిపించబోతున్నారు. ఓ జంట మధ్య అపోహాలు, అలకలతో దర్శకుడు వినోద్ గాలి ఈ సిరీస్ ను రూపొందించారు.
ఈ సమ్మర్ లోనే ఈ సిరీస్ రిలీజ్ కాబోతున్నట్లు ఈటీవీ విన్ ఓటిటి తెలిపింది. సంజీత్ ఎర్రమిల్లి మ్యూజిక్ అందిస్తున్న ఈ సిరీస్ కు రెహాన్ షేక్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. పవన్ సిద్దు మరియు సోనియా సింగ్ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా పుకార్లు షికారులు చేస్తున్నాయి. పవన్ ను తాను ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా పరుమార్లు హింట్ ఇచ్చింది సోనియా సింగ్. పవన్ సిద్దు మరియు సోనియాసింగ్ కలిసి టింగ్లీష్ గర్ల్ ఫ్రెండ్, డెస్టినీ డేట్ , యూఆర్మై ఫేవరెట్ మిస్టేక్, వీకెండ్ పెళ్లి చూపులతో పాటు పలు షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ తో తమ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. ఇక మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సిరీస్ రాబోతున్నాయి.
విరూపాక్షలో తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది సోనియా సింగ్. ప్రస్తుతం సోనియా సింగ్ కి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఇక వీరిద్దరూ రిల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా కపుల్స్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక వీరిద్దరూ నటించిన శశిమథనం రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. మొదటిగా వీరిద్దరూ యూట్యూబ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరి జోడి కి తెరపై మంచి గుర్తింపు రావడంతో వీరితో పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను తెరకెక్కించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డైరెక్టర్స్.
యమలీల సీరియల్ తో సోనియా సింగ్ యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సాయి దుర్గ తేజ్ మూవీ విరూపాక్షా లో కూడా ఓ కీలక పాత్ర పోషించి ప్రతి ఒక్కరినీ మైమరిపించింది. ఈ ముద్దుగుమ్మ తొలి అడుగుతోనే ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం తెలుగులో ఓ నాలుగు చిన్న సినిమాల్లో సోనియా సింగ్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ సిద్ధూ కూడా షార్ట్ ఫిలిమ్స్ తో మంచి బిజీగా ఉన్నాడు. ఇక వీరి కాంబినేషన్లో వస్తున్న శశిమథనం మూవీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.