NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మంగ‌ళ‌గిరిలో వైసీపీ న‌యా ప్లాన్.. నారా లోకేష్‌కు గెలుపు డౌట్‌…?

కీల‌క‌మైన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పెట్టుకున్న టార్గెట్‌.. టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారాలోకేష్‌ను ఓడించ‌డ‌మే. ఇదే వ్యూహంతో ఇక్క‌డ అభ్య‌ర్థిని కూడా వైసీపీ ఎంపిక చేసింది. రెండు బ‌ల‌మైన కుటుంబాలకు చెందిన(మురుగుడు-కాండ్రు) మ‌హిళా అభ్య‌ర్థి మురుగుడు లావ‌ణ్య‌ను ఇక్క‌డ బ‌రిలో నిలిపింది. దీంతో ఈ రెండు కుటుంబాల వారు.. కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. మ‌హిళా సెంటిమెంటును చూపిస్తున్నారు.

దీనికితోడు.. కాండ్రు క‌మ‌ల‌, మురుగుడు హ‌నుమంత‌రావు.. గ‌తంలో ఎమ్మెల్యేలుగా ఉన్న స‌మ‌యంలో చేసిన అభివృద్ధిని ప‌దే ప‌దే వివ‌రిస్తున్నారు. దీనికి తోడు బీసీ ఓటు బ్యాంకును అస్త్రంగా చేసుకున్నారు. ఫ‌లితంగా రాష్ట్ర వ్యాప్తంగ ఎన్నిక‌ల‌కు ముందు ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పిన నారా లోకేష్ మంగ‌ళ‌గిరికే ప‌రిమితం అయ్యేలా చాలా వ్యూహం ర‌చించారు. అదే ఇప్పుడు జ‌రుగుతోంది. అయితే.. ఇది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే.

మ‌రోవైపు.. వైసీపీ ప‌రోక్ష రాజ‌కీయాల‌కు తెర‌దీసింది. మంగ‌ళ‌గిరి నుంచి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న ప్ర‌ముఖ న్యాయ‌వాది జ‌గ శ్ర‌వ‌ణ్‌ను ప్రోత్స‌హించింది. ఈయ‌న త‌న సొంత పార్టీ జైభీం రావ్ పార్టీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు. వాస్త‌వానికి ఆయ‌న ఆదిలో తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని లెక్క‌లు వేసుకున్నారు. నారా లోకేష్‌కు అడ్డుప‌డ‌బోన‌ని కూడా.. ఆరు మాసాల ముందు చెప్పారు.కానీ, త‌ర్వాత‌.. అనూహ్యంగా ప్లేట్ మార్చేసి.. ఇప్పుడు మంగ‌ళ‌గిరిలోనే పోటీ ప‌డుతున్నారు.

అంతేకాదు.. వైసీపీ ని విమ‌ర్శించ‌డం మానేసి.. కేవ‌లం టీడీపీని, నారా లోకేష్‌ను కేంద్రంగా చేసుకుని నిత్యం సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నారా లోకేష్ ఏం చేశార‌ని ఓటేయాలంటూ.. ప్ర‌శ్నిస్తున్నారు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని త‌న‌వైపు తిప్పుకొన్నారు. వైసీపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు. దీంతో టీడీపీ ఆలోచ‌న‌గా ఉన్న వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు ఎక్క‌డా చీల‌కుండా.. జ‌గ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు. దీంతో నారా లోకేష్ చుట్టూ పెద్ద ప‌ద్మ‌వ్యూహ‌మే ఏర్ప‌డింది. మ‌రి ఆయ‌న ఈ వ్యూహాన్ని ఛేదించుకుని బ‌య‌ట‌ప‌డ‌గ‌లరా? లేదా? అనేది చూడాలి.

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju