Razakar OTT Release: బాబీ సింహ, బోల్డ్ బ్యూటీ అనసూయ, వేదిక ప్రధాన పాత్రలో పోషించిన రాజాకార్ మూవీ మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. స్వాతంత్రానికి ముందు నిజాం ప్రభువు ఉండగా తెలంగాణలో రాజాకర్లు సాగించిన హింస ఖండాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు యాట సత్యనారాయణ ఈ మూవీను రూపొందించాడు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటిటిలోకి రానున్నట్లు తాజాగా సమాచారం అందుతుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటిటి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 26న లేదా మే మూడున ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓటిటి రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది.
దేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం ఇండియాలో విలీనం చేసేందుకు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒప్పుకోడు. నిజాం ప్రభువు అడ్డంగా రాజాకార్ చీఫ్ ఖాసిం రిజ్వీ హైదరాబాద్ ను తుర్కిస్థాన్ గా మార్చే ప్రయత్నాలు చేస్తాడు. మతమార్పిడులకు పాల్పడడంతో పాటు ఉర్దూ మాట్లాడని వారిని కఠినంగా శిక్షిస్తారు. చాలా మందిని అంతమందించారు. రాజాకార్ కుట్రలను కొంతమంది పోరాట యోధులు ఎలా ఎదిరించి తమ ప్రాణాలను త్యాగం చేస్తారు? హైదరాబాద్‌ను భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా విలీనం చేశాడు? ఖాసీం రిజ్వీ జీవితం ఎలా ముగిసింది? అనే అంశంతో ఈ మూవీ రూపొందింది. తెలంగాణ విముక్తి పోరాటంలో వెలుగులోకి రాని పరకాల జెండా ఉద్యమం, బైరాన్ పల్లి నరమేథం లాంటి సంఘటనను ఈ మూవీలో చూపించారు.
తెలంగాణకు స్వేచ్చ కల్పించడం కోసం నారాయణరెడ్డి, ఐలమ్మ, రాజన్న వంటి వారు చేసిన అనుమాన పోరాటాన్ని దర్శకుడు స్పష్టంగా ఈ మూవీలో చూపించాడు. ఈ మూవీలో ఇంద్రజ, ప్రేమ, అనుష్క త్రిపాటి, మకరంద్, రాజ్ అర్జున్ ముఖ్య పాత్రలతో మెప్పించారు. అనసూయ, బాబీ సింహ, రాజ్ అర్జున్, రాజ్ సఫ్రు తమ యాక్టింగ్ తో మెప్పించారు. భీమ్స్ సిసి రోలియో అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా కి బాగుందనే పేరొచ్చిన కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేకపోయింది. ఓ వర్గం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ మూవీ సాగిందనే చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటిటిలోకి రాబోతుంది.
థియేటర్లలో మిక్సర్ టాప్ సంపాదించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ప్రస్తుత కాలంలో కొన్ని సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ అనంతరం ఓటీటీలలో సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీల హడావుడి పెరగడంతో సినిమాలకి ఓటీటీల రెస్పాన్స్ ఏ మెయిన్ గా మారింది. థియేటర్లలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకున్న ఓటిటిలో మంచి రెస్పాన్స్ దక్కించుకోకపోతే ఆ మూవీని అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. అలా కొన్ని సినిమాలు థియేటర్లలో భారీ అపజయాలుగా మిగిలి ఓటీటీలలో మంచి విజయం అయ్యాయి. అలా ఈ మూవీ కూడా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి.