NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Yatra 2 OTT Streaming: గప్చిప్ గా ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ పొలిటికల్ బయోపిక్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Yatra 2 OTT Streaming: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత గాధ ఆధారంగా రూపొందిన మూవీనే ” యాత్ర 2 “. ఈ మూవీ మొదటి భాగం 2019లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2 రిలీజ్ అయింది. ఈ మూవీ ఓటిటి లోకి తాజాగా వచ్చేసింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ పై ముందస్తు అనౌన్స్మెంట్ ఏమి ఇవ్వలేదు. గప్చిప్ గా శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. ఈ పొలిటికల్ డ్రామా మూవీలో వైయస్ జగన్ పాత్రను తమిళ్ నటుడు జీవా పోషించాడు.

Yatra 2 OTT Streaming updates
Yatra 2 OTT Streaming updates

తమిళం మెగాస్టార్ ముమ్మట్టి ఓ కీలక పాత్రలో కనిపించాడు. యాత్ర 2 మూవీకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించాడు. 2019లో విడుదలైన యాత్ర మూవీకి సీక్వెల్ గా యాత్ర 2 వచ్చింది. యాత్ర మూవీ వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ప్రధాన ఘటనల ఆధారంగా రూపొందగా యాత్ర 2 వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఫిబ్రవరి 8 2024 లో విడుదలైంది. ప్రస్తుతం జగన్ సీఎంగా ఉండటం, యాత్ర సక్సెస్ గా నిలిచిన నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ జగన్ గురించి మీడియాలో ఉన్న, ప్రజలకు తెలిసిన కథనే చెప్పడంతో ఈ పొలిటికల్ డ్రామా పెద్దగా కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.

తాజాగా థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల అనంతరం ఈ పొలిటికల్ డ్రామా ఓటీటీలోకి వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జగన్ జీవితం ఎటువంటి మలుపులు తిరిగిందని అంశంతో ఈ మూవీని రూపొందించాడు మహి వి రాఘవ్. వైయస్సార్ మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పార్టీ అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు. రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక కన్నుమూసిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడం కోసం జగన్ చేసిన ఓదార్పు యాత్రలను ప్రోగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది.

Yatra 2 OTT Streaming updates
Yatra 2 OTT Streaming updates

దీంతో ప్రోగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్ వైయస్సార్ పార్టీని ఏర్పాటు చేసి ఎలా ప్రజల అభిమానాన్ని పొందాడు? జగన్ రాజకీయ ఎదుగుదలకు అడ్డుకోవడానికి ప్రోగ్రెస్ పార్టీతో పాటు ప్రతి పక్షాలు అతడిని అవినీతి కేసుల్లో ఎలా ఇరికించారు? వాటిని జగన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. జగన్ పాత్రలో జీవ అద్భుతమైన నటన ప్రతి ఒక్కరిని మెప్పించింది. పలు సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన జీవ యాత్ర 2 మూవీ తోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ పొలిటికల్ బయోపిక్ లో చంద్రబాబు క్యారెక్టర్ లో మహేష్ మంజ్రేకర్, వైయస్ భారతిగా కేతకి నారాయణన్ కనిపించారు. ఇక ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది. థియేటర్లలో నిర్మాతలకు నష్టాలను మిగిల్చిన ఈ మూవీ ఓటిటి ప్లాట్ఫారంస్ లో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu