OTT Releases: ప్రతి వారం థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వారానికి 20 సినిమాలు దాకా రిలీజ్ అవుతుంటే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించ గలుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో థియేటర్లలో కాకుండా ఓటిటిలో చూసేందుకు ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకే థియేటర్లలో బ్లాక్బస్టర్ హిట్స్ అయిన సినిమాల ఓటిటి రిలీజ్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే తాజాగా ఒకరోజు ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను విడుదల చేశారు. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రేమలు:
మలయాళం సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ ఎన్నో సినిమాలు తెలుగులో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ మధ్యకాలంలో మాలీవుడ్ నుంచి ఎక్కువగా వినిపించిన సినిమా పేరు ప్రేమలు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ మూవీ మలయాళం చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ మార్చ్ 8న తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. ఇక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఏప్రిల్ 12వ తేదీన ఏకంగా రెండు ఓటీటీలో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ మూవీ మలయాళం, తమిళ్, హిందీ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ కాగా తెలుగు వర్షన్ మాత్రం ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది.
2. గామి:
విశ్వక్సేన్ ఆరు సంవత్సరాల పాటు కష్టపడి నటించిన మూవీ గామి. ఈ మూవీ మహాశివరాత్రి నాడు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. అలాంటి గామి మూవీ ప్రముఖ ఓటీటీ సమస్త జీ5 లో ఏప్రిల్ 12 అనగా నేడు స్ట్రీమింగ్ కు వచ్చింది. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకు నరేష్ సుకుమారం సంగీతం అందించాడు.
3. ఓం బీమ్ బుష్:
బ్రోచెవారెవరురా మూవీ కాంబినేషన్ అయిన శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి నవ్వులతో మ్యాజిక్ చేసిన సినిమానే ఓం భీమ్ బుష్. హారర్ అండ్ కామెడీ జోనర్లలో ఈ మూవీ తెరకెక్కింది. మార్చ్ 22న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ మూవీ నేడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి లోకి వచ్చేసింది.
ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు కావడంతో ప్రతి ఒక్కరూ ఈ మూవీస్ ను చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకోవడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టాయి ఈ మూడు సినిమాలు. ఇక ఈ మూడు కూడా ఒకే రోజు ఓటీటీలోకి రావడం విశేషం. ఒకేరోజు మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటిటిలోకి రావడంతో ఏ సినిమాని చూడాలో తెలియక ఆడియన్స్ తికమక పడుతున్నారు. మొత్తానికి అయితే ఈ వీక్ సినీ ప్రియులకు మంచి మజా ఇచ్చే సినిమాలు రిలీజ్ అయ్యాయి.