NewsOrbit
Entertainment News Telugu Cinema రివ్యూలు సినిమా

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

తెలుగు వాడు అయినా కూడా అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకునే హ‌ర్షివ్ కార్తీక్‌కు సినిమా రంగం అంటే పిచ్చి. సినిమాల్లో హీరో అవ్వాల‌ని.. తెరమీద మెరిసిపోవాల‌ని.. డైరెక్ట‌ర్ అవ్వాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తూనే వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలోనే తానే ర‌చ‌యిత‌గా.. నిర్మాత‌గా.. హీరోగా.. అటు మెగాఫోన్ ప‌ట్టేసి డైరెక్ట‌ర్‌గా మారిపోయి తెర‌కెక్కించిన సినిమా బ‌హుముఖం. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

TL Review: Versatile
TL Review: Versatile

క‌థ‌:
త‌న్వీర్ ( హ‌ర్షివ్ కార్తీక్ ) అమెరికాలో స్థిర‌ప‌డ్డ తెలుగు ఫ్యామిలీ కుర్రాడు. వాళ్ల అమ్మ‌కు యాక్టింగ్ అంటే ఇష్టం.. ఆమె యాక్ట‌ర్ కాలేక‌పోతుంది. అయితే త‌న త‌ల్లి క‌న్న క‌ల‌లు నిజం చేసేందుకు త‌న్వీర్ యాక్ట‌ర్ అవ్వాల‌ని ఇండ‌స్ట్రీలో ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఛాన్సులు రావు. ఓ సారి అనుకోని కేసులో ఇరుక్కుని జైలు శిక్ష కూడా అనుభ‌వించి వ‌స్తాడు. ఆ త‌ర్వాత ఓ సైకో పాత్ర అడిష‌న్‌కు వెళ్లి చేయ‌లేక విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతాడు. ఎలాగైనా ఆ పాత్ర చేయాల‌న్న క‌సితో నిజంగానే సైకోలా మారిపోయి హ‌త్య‌లు చేస్తుంటాడు ? అస‌లు త‌న్వీర్ ఎందుకు హ‌త్య‌లు చేయ‌డం మొద‌లు పెట్టాడు ? అత‌డు న‌టుడు అయ్యాడా ? త‌న త‌ల్లి కోరిక నెర‌వేర్చాడా ? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ :
సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకునే హ‌ర్షివ్ కు సినిమా మీద ఏ స్థాయిలో ఇంట్ర‌స్ట్‌, పిచ్చి, ఫ్యాష‌న్ ఉన్నాయో ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది. బ‌హుముఖ పాత్ర‌లు చేస్తూ సినిమాను ప్ర‌జెంట్ చేసిన తీరుకు నిజంగానే హ్యాట్సాఫ్ చెప్పాలి. అత‌డే సినిమాకు ర‌చ‌యిత‌, హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు కావ‌డంతో మంచి ప‌ట్టుతో సినిమా తీశాడు. సినిమా ఎక్కువ భాగం అమెరికాలోనే షూట్ చేశారు. దీంతో విజువ‌ల్స్‌లో గ్రాండియ‌ర్ లుక్ మ‌న‌కు క‌నిపిస్తుంది. స్క్రీన్ ప్లే బాగున్నా కొన్ని చోట్ల సాగ‌దీసిన‌ట్టు.. స్లో అయిన‌ట్టు ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవుతాడు.

TL Review: Versatile
TL Review: Versatile

న‌టీనుట‌ల పెర్పామెన్స్ :
న‌టీన‌టుల ప‌రంగా సినిమా అంతా హర్షివ్ కార్తీక్ మెయిన్ లీడ్ తీసుకుని త‌న భుజాల మీద వేసుకుని న‌డిపిస్తాడు. హీరోయిన్ స్వ‌ర్ణిమా సింగ్ కొన్ని సీన్ల‌కే ప‌రిమితం అయినా… అమెరిక‌న్ న‌టి మరియా మార్టినోవా మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులంతా అమెరికా వాళ్లే కావ‌డంతో పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మై న్యాయం చేశారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే..
ఈ సినిమాకు అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ల్యూక్ ఫ్లెచర్ విజువల్స్ చాలా బాగున్నాయి. కథకి తగ్గట్టు అమెరికాని బాగా చూపించారు. శ్రీ చరణ్ పాకాల తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. తల్లి కలని తీర్చడానికి కొడుకు ఏం చేశాడు అనే సింపుల్ కథ అయినా కొత్తగా చూపించడానికి హర్షివ్ కార్తీక్ ట్రై చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువ‌లు ఓకే. క‌థ‌కు త‌గిన‌ట్టుగా ఉన్నాయి.

TL Review: Versatile
TL Review: Versatile

ఫైన‌ల్‌గా..
బహుముఖం నటన అంటే పిచ్చి ఉన్న ఓ అబ్బాయి తల్లి కలని నిజం చేయడానికి నటుడిగా మారాలనుకునే క్రమంలో సైకోలా మారితే ఎలా ఉంటుంది అనే థ్రిల్లింగ్ అంశం తో తెరకెక్కించారు.

రేటింగ్ : 2.75/5

Related posts

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N