NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

Jagadhatri Today Episode April 16 2024 Episode 206 highlights

Jagadhatri April 16 2024 Episode 206: అమ్మ ఇవి నావి కావు మా సార్వి అని యామిని అంటుంది. మీ సార్ వీటితో ఏం చేస్తాడు అని జగదాత్రి అంటుంది. మా సార్ తెలిసిన వాళ్ళకి దుబాయ్ పంపించాలంట జగదాత్రి అందుకే నాకిచ్చడు అని యామిని అంటుంది. నువ్వు దుబాయ్ కి ఎలా పంపిస్తావు అని కౌశికి అడుగుతుంది. వేరే వాళ్ళు వెళ్తున్నారు నేను వెళ్లి వాళ్లని కలిసి పంపించాలి అని యామిని అంటుంది. యామిని ఇది దేనికి వాడతారు అంట అని జగదాత్రి అడుగుతుంది. బాడీ పెయిన్ కి వాడతారంట అని యామిని చెబుతుంది. ఇప్పుడు నాకు కూడా ఏదో తప్పు జరుగుతుంద నిపిస్తుంది జగదాత్రి అని కేదార్ అంటాడు. మనం ఆ టాబ్లెట్ ని ఇక్కడ జరిగే మోసాన్ని కనిపెట్టాలి అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 16  2024 Episode 206 highlights
Jagadhatri Today Episode April 16 2024 Episode 206 highlights

చెప్పింది గుర్తుంది కదా ఎవరు అడ్డొచ్చినా కాల్చి పడేయండి అని మీనన్ వాళ్ల మనుషులకి చెబుతాడు. అలాగే సార్ అని వాళ్ళు జగదాత్రి ఎప్పుడు బయటికి వస్తుందా కాల్ చేద్దామని చూస్తూ ఉంటారు. మీనన్ మెట్లు దిగుతూ చిన్న స్మైల్ ఇస్తాడు. ఆ నవ్వు వెనక ఏం దాచావు కనిపెడతాను మా జీవితంలోకి ఎలా వచ్చావో తెలుసుకుంటాను అని జగదాత్రి అంటుంది. నువ్వు ఎంత ఆలోచించినా నన్ను కనిపెట్టలేవు జెడి అని మీనన్ అనుకుంటాడు. ఏం చేయాలనుకుంటున్నావో తెలుసుకుంటాను అని కేదార్ అనుకుంటాడు. ఈరోజు నీ చావు తప్పదు జగదాత్రి అని యువరాజ్ అనుకుంటాడు. నలుగురు ఎవరికి వాళ్లే మాట్లాడుకుంటున్నారు ఏంటి అని సుధాకర్ అంటాడు. ఏమీ లేదు మామయ్య గారు వచ్చి కూర్చోండి అని జగదాత్రి అందరికీ భోజనం వడ్డిస్తుంది. ఎలాగైనా సరే జగదాత్రి మాస్క్ పెట్టేలా చేయాలి అని యువరాజ్ అనుకుంటాడు. జగదాత్రి నీకు మనుషుల్ని చంపడం బాగా అలవాటు అనుకుంటా అని మీనన్ అంటాడు. అది ఎదుటి వాళ్ళను బట్టి ఉంటుంది మీలాంటి వాళ్లు ఉన్నప్పుడు నా పని నేను కరెక్ట్ గా చేయకపోతే ఎలా నాకు తర్వాత మాట వచ్చేస్తుంది అని జగదాత్రి అంటుంది. అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని నిషిక అడుగుతుంది. అవును జగదాత్రి నువ్వు మనుషులని చంపడం ఏంటి అని కౌశికి అడుగుతుంది. ఏంటి జగదాత్రి మీరిద్దరూ మాట్లాడుకుని మళ్ళీ నవ్వుకుంటున్నారు అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode April 16  2024 Episode 206 highlights
Jagadhatri Today Episode April 16 2024 Episode 206 highlights

మీలాంటి గొప్ప వాళ్లకు అన్నం పెట్టి చంపేస్తానని చెప్తున్నాను అత్తయ్య గారు అని జగదాత్రి అంటుంది. ఆయన అన్నది నీకు అర్థం అయినప్పుడు సక్రమంగా సమాధానం చెప్పొచ్చుగా అని రాగిణి అంటుంది. మీది తమిళనాడు అనుకుంటా అని సుధాకర్ అంటాడు. అవును అని మీనన్ అంటాడు. తమిళ్లో జగదాత్రి మీనన్ తో మాట్లాడుతుంది. మీరు మాట్లాడటం తమిళం అని అర్థమైంది కానీ ఏం మాట్లాడారో అర్థం కాలేదు అని కాచి అంటుంది. సార్కు అర్థమయ్యే ఉంటుంది అని కేదార్ అంటాడు. అర్థమైంది అని మీనన్ అంటాడు. అయితే తిరిగి సమాధానం చెప్పలేదు ఏంటి అని జగదాత్రి అంటుంది. నేను పుట్టింది తమిళనాడులో అయినా పెరిగి పెద్దవాడిని అయి బిజినెస్ చేస్తోంది ఇక్కడే కాబట్టి తెలుగు బాగా మాట్లాడుతాను అని మీనన్ అంటాడు. ఆయన సంగతి పక్కన పెట్టు నీకు తమిళ్ ఎలా వచ్చు అని రాగిణి అడుగుతుంది.

Jagadhatri Today Episode April 16  2024 Episode 206 highlights
Jagadhatri Today Episode April 16 2024 Episode 206 highlights

ఇది కోచింగ్ కి వెళ్ళినప్పుడు కూడా తమిళ్లోనే మాటలు వినిపించేవి అని నిషిక అంటుంది. నువ్వు తమిళ్ బాగా మాట్లాడావు ఎక్కడ నేర్చుకున్నావ్ జగదాత్రి అని కౌశికి అడుగుతుంది. మా కోచ్ తమిళ్ అక్కడే నేర్చుకున్నాను అని జగదాత్రి చెబుతుంది. జగదాత్రి సాంబార్ లోకి అప్పడాలు బాగుంటాయి కొంచెం తీసుకురావా ప్లీజ్ అని యువర్ రాజ్ అంటాడు. రెండు నిమిషాల్లో తీసుకొస్తాను అంటూ జగదాత్రి వెళ్లి కిచెన్ లో వెతుకుతూ ఉండగా ఏమైంది జగదాత్రి అని యువరాజ్ అంటాడు. అప్పడాలు కనిపించడం లేదు అని జగదాత్రి చెబుతుంది. స్టోర్ రూమ్ లో ఉంటాయి తీసుకురా అని చెప్పి అందులో మిరపకాయలు వేసి వెళ్ళిపోతాడు. జగదాత్రి వచ్చి చూసి మిరపకాయలు ఎలా పడ్డాయి అని తీసి పక్కన పెట్టి అప్పడాలు వేయించి తీసుకువస్తుంది. జగదాత్రి దగ్గుతూ ఉండగా ఏమైంది జగదాత్రి అని కౌశికి అడుగుతుంది. ఏమీ లేదు వదిన వంట గదిలో పొగ వచ్చింది అందుకే దగ్గు వస్తుంది అని జగదాత్రి చెబుతుంది.

Jagadhatri Today Episode April 16  2024 Episode 206 highlights
Jagadhatri Today Episode April 16 2024 Episode 206 highlights

జగదాత్రి దగ్గుతూ వడ్డిస్తే ఎలా ఈ మాస్క్ పెట్టుకో అని యువరాజ్ మాస్క్ ఇస్తాడు. తగ్గిపోతుందిలే అని జగదాత్రి అంటుంది. తగ్గిపోయేదాకా అయినా పెట్టుకో జగదాత్రి అని యువరాజ్ మాస్క్ ఇవ్వడంతో జగదాత్రి మాస్క్ పెట్టుకుంటుంది. అది చూసిన మీనన్ జగదాత్రి అని గుర్తు పట్టేస్తాడు. దొరికావు జగదాత్రి ఆలియాస్ జెడి అని మీనన్ అంటాడు. ఏంటే నువ్వు పోలీస్ ఆయన చెప్పింది నిజమా అని రాగిణి అంటుంది. ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసావా అని కౌశికి అంటూ ఉండగా మీనన్ చిటిక వేయగానే దేవా కేదార్ని షూట్ చేస్తాడు.కేదర్ లే కేదార్ అని జగదాత్రి ఏడుస్తూ ఉండగా కుర్చీలో కూర్చుని వాడు చనిపోయి చాలాసేపు అయింది నువ్వు కూడా పైకి వెళ్లి ఏడువు అని మీనన్ జగదాత్రి ని కూడా షూట్ చేసేస్తాడు. యువరాజ్ ఇంతలో కళ్ళు తెరుచుకొని ఇదంతా కళ కళ్ళ ముందు జరిగితే ఇంకెంత బాగుంటుందో అని యువరాజ్ మాస్క్ ఇవ్వబోతు ఉండగా ఎలక కనపడగానే జగదాత్రి పరిగెత్తి కెళ్ళి కేదార్ ని హగ్ చేసుకుంటుంది. ఆ సంఘటన చూసి అందరూ షాక్ అవుతారు. ధాత్రి ఏం కాదు అని కేదార్ అనడంతో కళ్ళు తెరిచి చూసి టక్కున లేస్తుంది. సారీ ఎలకంటే నాకు చచ్చేంత భయం అని జగదాత్రి అంటుంది. సర్లే ఈ మాస్క్ పెట్టుకో అని యువరాజ్ అంటాడు. వద్దులే దగ్గు తగ్గిపోయింది గా అని మీనన్ అంటాడు. అదేంటి బాయ్ వద్దంటావ్ అని యువరాజ్ అంటాడు. అండర్ గ్రౌండ్ పోలీసులు అంటే చావు కూడా భయపడరు అలాంటిది ఈ అమ్మాయి ఎలకను చూసి ఇంత భయపడింది అంటే తను పోలీస్ కాదు ఈ ఇంట్లో ఎవరైనా పోలీస్ అవ్వచ్చు కానీ ఆ అమ్మాయి మాత్రం కాదు అని మీనన్ అంటాడు. కట్ చేస్తే, అందరు భోజనం చేసేస్తారు.

Jagadhatri Today Episode April 16  2024 Episode 206 highlights
Jagadhatri Today Episode April 16 2024 Episode 206 highlights

జగదాత్రి వీళ్ళందరూ చెప్తుంటే తక్కువ అనుకున్నాను నువ్వు చేసి పెట్టే వంట చూస్తే తక్కువగా పొగుడుతున్నారు నిన్ను ఎంత పొగిడినా తక్కువే అని మీనన్ అంటాడు. మీనన్ కారు ఎక్కుతూ చి చి ఇలాంటి ప్రజా నాయకులు ఉండడం వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది అని అంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని కౌశికి అడుగుతుంది. ఇంకెవరు మినిస్టర్ హరినాథ్ గురించి అని మీనన్ అంటాడు. అతను చేసే మోసాలు కుట్రలు గురించి మా టీం అంతా వెతుకుతున్న ఇంకా కొన్ని రోజులు ఆగితే అతని జైలు పాలు చేస్తాం అని కౌశికి అంటుంది. అవునా ఇప్పుడే నాకు ఒక  వీడియో వచ్చింది చూడండి అని మీనన్ వాళ్లకి వీడియో చూపెడతాడు. చి చి వాడు చేసే దుర్మార్గాలు ఏ ఛానల్ లో రావని వాడు రెచ్చిపోతున్నాడు అని సుధాకర్ అంటాడు. ఈ న్యూస్ ఏ ఛానల్లో రావట్లేదు కదా పిలయ్య గారు అని నిషిక అడుగుతుంది. ఇంకా రాలేదమ్మా ఎలాగో అందరి ఛానల్ లో వస్తుంది కదా అని మీనన్ అంటాడు. సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఆ వీడియో ప్రసారం మా ఛానల్ లో మొదటిసారి చేస్తాం అని ఇషిక అడుగుతుంది. ఈ న్యూస్ ఎలాగు రేపు మనకు అన్ని ఛానల్ లో వచ్చేదే కానీ మీలాంటి మంచి వాళ్ళ ఛానల్ లో వస్తుంది అంటే తప్పకుండా ఇస్తాను అని మీనన్ అంటాడు. నిష్కా ఒక నిమిషం ఆగు అని సుధాకర్ అంటాడు

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella