NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

Ram Gopal Varma: టాలీవుడ్ లో వివాస్పద దర్శకుడు అనగానే గుర్తుకు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఎన్నో సెన్సేషనల్ హిట్ మూవీస్ తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు చూసిన చూడకపోయినా, హిట్ అయినా అవ్వ‌క‌పోయినా తనకు నచ్చినట్లుగానే సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు తెలుగు హిందీ భాషల్లో స్టార్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతూ ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన ఇప్పుడు వివాదాలకు వివాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా మారారు. అటువంటి రామ్ గోపాల్ వర్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1962న‌ తూర్పుగోదారి జిల్లాలో రామ్ గోపాల్ వ‌ర్మ జ‌న్మించారు. ఆయ‌న త‌ల్లిదండ్రులు సూర్యమ్మ-కృష్ణంరాజు. సికింద్రాబాదులోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠ‌శాల విద్య‌ను అభ్య‌సించిన‌ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. విజయవాడ నగరంలోని సిధ్ధార్థ కళాశాలలో ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారు. అయితే కాలేజీ రోజుల నుంచే వ‌ర్మ‌కు సినిమాల‌పై ఎన‌లేని మ‌క్కువ ఏర్ప‌డింది. కాలేజ్ డేస్‌లో భాష‌తో సంబంధం లేకుండా విడుద‌లైన ప్ర‌తి సినిమాను చూసేవారు. ఈ క్ర‌మంలోనే డైరెక్ట‌ర్ కావాల‌ని ఆయ‌న ఆశ‌ప‌డ్డారు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు కూడా చేశారు.

కానీ ఎటువంటి అనుభ‌వం లేక‌పోవ‌డం వ‌ల్ల చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ద‌ర్శ‌కుడిగా ఎవ్వ‌రూ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇంజినీరింగ్ పూర్తి అయ్యాక త‌న తాత సాయంతో హైదరాబాద్‌లోని కృష్ణ ఒబెరాయ్ హోటల్‌కి సైట్ ఇంజనీర్‌గా వ‌ర్మ ఉద్యోగం సంపాదించాడు. అప్ప‌ట్లో అత‌ని నెల జీతం రూ. 800. అవి ఏమాత్రం సరిపోవడంతో కొంత డబ్బు సంపాదించడానికి నైజీరియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నైజీరియాలో జాబ్‌ చేస్తే నెలకు నాలుగు వేలు వస్తాయని ఫ్రెండ్‌ ద్వారా తెలుసుకున్న వ‌ర్మ‌.. అక్కడికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.

మ‌రో మూడు రోజుల్లో ప్ర‌యాణం.. ఇంత‌లోనే అనుకోకుండా హైదరాబాద్‌లోని వీడియో రెంటల్ లైబ్రరీని సందర్శించారు. ఆ టైమ్‌లోనే వ‌ర్మ‌కు ఓ ఆలోచ‌న వ‌చ్చింది. ఎక్క‌డికో వెళ్లి జాబ్ చేసే బ‌దులు.. ఇక్క‌డే సినిమాల వీడియో క్యాసెట్ల షాప్ పెట్టుకుంటే బెట‌ర్ అని వ‌ర్మ డిసైడ్ అయ్యాడు. నైజీరియా ప్ర‌యాణాన్ని క్యాన్సిల్ చేశారు. ఎంతో క‌ష్ట‌ప‌డి అమీర్‌ పేటలో రెండు వందల సినిమాల వీడియో క్యాసెట్లతో షాప్ ఓపెన్ చేశాడు. అనూహ్యంగా రోజుకి వంద క్యాసెట్లు అమ్ముడు అయ్యేయ‌ట‌.

అప్ప‌ట్లోనే సినిమా వీడియో క్యాసెట్లు అమ్ముతూ నెల‌కు రూ. 25 వేల వ‌ర‌కు వ‌ర్మ సంపాదించేవాడు. ఇక మెల్ల‌మెల్ల‌గా వ‌ర్మ షాప్‌కి సినిమా వాళ్లు రావడం కూడా ప్రారంభ‌మైంది. సినిమా వాళ్ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకున్న వ‌ర్మ‌.. ఓరోజు అక్కినేని వెంకట్‌ని కలిశారు. ఆయ‌న ద్వారా నాగార్జున వ‌ద్ద‌కు వెల్లి శివ స్టోరీ నెరేట్ చేశారు. డైరెక్ష‌న్‌లో ఎటువంటి అనుభ‌వం లేక‌పోయినా కూడా క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో నాగార్జున వ‌ర్మ‌కు ఛాన్స్ ఇచ్చారు. అలా వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో 1989లో వ‌చ్చిన శివ చిత్రం ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. అప్ప‌ట్లో ఓ మూవీ ఒక ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత రామ్ గోపాల్ వ‌ర్మ కొన్నాళ్లు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, హిందీ భాష‌ల్లో అగ్ర ద‌ర్శ‌కుడిగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌ర్మ తెర‌కెక్కించాడు. 2006 నుంచి వ‌ర్మ గ్రాఫ్ క్ర‌మంగా ప‌డిపోయింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న మ‌ళ్లీ త‌న పూర్వ వైభ‌వాన్ని అందుకోలేక‌పోయారు.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N