Annapurna: మనదేశంలో.. స్వాతంత్రం ఉంది. కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడకూడదు. నాలుగు గోడల బయట.. మన నోటి నుంచి వచ్చే మాటలు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా అప్పుడప్పుడు తమ ఆవేశాన్ని తగ్గించుకుని ఇతరుల మాటలను వినాలి. ఇక ఈమధ్య ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నపూర్ణ… స్త్రీలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని రోడ్లపై తిరగడం అవసరమా? అని ప్రశ్నించింది. ఇక అందుకు సమాధానంగా సింగర్ చిన్మయి స్పందిస్తూ మండిపడింది. ఇక దేశాన్ని విమర్శిస్తే ఏ బోర్డు అయినా వారిపై కేసు పెట్టొచ్చు అనే సంగతి మనందరికీ తెలిసిందే. అలా చిన్మయి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. హెచ్ యు విద్యార్థి అయిన సాగర్.. చిన్మయిపై కేసు పెట్టారు.
నిజానికి అన్నపూర్ణ.. వృత్తి రీత్యా రాత్రులు బయటికి వచ్చే స్త్రీలు గురించి కాదని.. చిన్మయి అనవసరంగా ఈ రెండిటికి ముడిపెట్టి మాట్లాడారని అభిప్రాయ పడి మాట్లాడిన ప్రేక్షకులు.. మండిపడ్డారు. పూర్వకాలంలో విశాఖపట్నం మరియు విజయవాడలో సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగేవి. ఈ క్రమంలో.. విశాఖపట్నంలో నీడలేని ఆడది అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక హీరోయిన్ అక్క పాత్రలో నటిస్తున్న నటి కి దర్శకుడు కి గొడవ జరిగింది. దీంతో ఆ నటి షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోగా.. ఆ పాత్ర కోసం వెతుకుతుండగా.. అన్నపూర్ణ సెలెక్ట్ అయింది. నిజానికి అన్నపూర్ణ దర్శకుడు కి పెద్దగా నచ్చకపోయినా.. వేరే దారి లేక తీసుకున్నారు. ఇదే సమయంలో కే విశ్వనాధ్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న శారద మూవీలో ఓ చిన్న పాత్ర పోషించింది అన్నపూర్ణ. ఇక ఈ మూవీ విడుదలైన అనంతరం కూడా ఈమెకి పెద్దగా పేరు రాలేదు.
ఇదే సమయంలో.. అన్నపూర్ణ కి పాతికేళ్ల వయసు రావడంతో.. కుటుంబం ఈమెకి పెళ్లి చేద్దామని అనుకున్నారు. కానీ అన్నపూర్ణ నాటక రంగాల్లో కలిసి నటించే చలపతిరావును ప్రేమించింది. తల్లి వద్దని వాదించిన.. 1973 లో ఆయనను పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి నాటకాల్లో నటించినప్పటికీ.. అప్పటికే రెండు సినిమాల్లో నటించడం వల్ల అన్నపూర్ణ దృష్టి మొత్తం సినిమాలపైనే ఉండేది. సరిగ్గా అదే సమయంలో.. నీడలేని ఆడది సినిమా ప్రివ్యూ కోసం మద్రాస్ నుంచి పిలుపు రాగ.. వెళ్లి చూసిన అన్నపూర్ణ తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదని.. రివ్యూ అయిపోయాక తర్వాత మూవీ లో అయినా ఇంపార్టెంట్ రోల్ ఇవ్వమని దర్శకుడు వివి ప్రసాద్ ను అడిగారు. ఇంకా అనంతరం అలా అలా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అన్నపూర్ణ.
ఇక అనంతరం ఈమెకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.. ఇక దాదాపు ప్రతి సినిమాకి కమిట్మెంట్ అడగడంతో.. అప్పటికే పెళ్లయిన అన్నపూర్ణ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో.. ఉండగా.. ఒకసారి కలిసిన నిర్మాత గంగాధర్ రావుతో విషయం అంతా చెప్పింది. అందుకు తల్లి పాత్రలు చేస్తే ఈ సమస్య ఉండకపోవచ్చు అని ఆయన సలహా ఇచ్చాడు. ఆ సలహాతో ఎన్టీఆర్ నటించిన టైగర్ మూవీలో రెండో హీరోయిన్ తల్లిగా నటించింది. ఇక అనంతరం సూపర్ మ్యాన్ మూవీలో ఎన్టీఆర్ కి తల్లిగా నటించింది. చిరంజీవితో మొండిఘటం వంటి సినిమాల్లో నటించి మైమరిపించింది అన్నపూర్ణ. అలా ఆ సందర్భంలో ఓ నిర్మాత కమిట్మెంట్తో హీరోయిన్గా ఎదగలేక పోయింది అన్నపూర్ణ. ఇక వ్యక్తి ఎవరో తెలియకపోయినా ఈమెని మాత్రం లైంగికంగా చిత్రహింసలు పెట్టాడు.