NewsOrbit
దైవం

 స్త్రీల గురించి వేదాలు చెబుతున్న సీక్రెట్ లు !

 స్త్రీల గురించి వేదాలు చెబుతున్న సీక్రెట్ లు !

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు.  అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.

 స్త్రీల గురించి వేదాలు చెబుతున్న సీక్రెట్ లు !

స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి – యజుర్వేదం 10.03

స్త్రీలు మంచి కీర్తి గడించాలి – అధర్వణ వేదం 14.1.20

స్త్రీలు కూడా  పండితులవ్వాలి – అధర్వణ వేదం 11.5.18 (స్త్రీలు  కూడా విద్యాబోధన చేయడం  అవసరమని చెప్తోంది)

స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి – అధర్వణ వేదం 14.2.74

స్త్రీలు సంపదలతో  ఎప్పుడూసుఖంగా ఉండాలి – అధర్వణవేదం 7.47.2

స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులుగా, తెలివిగలవారిగా ఉండాలి – అధర్వణ వేదం 7.47.1

పరిపాలన కు సంబందించిన విషయలలో మరియు . పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో కూడా స్త్రీలు పాల్గొనాలి – అధర్వణవేదం 7.38.4

దేశ పరిపాలన, మరియు సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలలో  పాలు పంచుకుని స్త్రీలు ముందుండి నడిపించాలి-  ఋగ్వేదం 10.85.46

ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

ఆస్తిహక్కు

పిత్రార్జితం అంటే తండ్రి కూడబెట్టిన ఆస్తి లో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- ఋగ్వేదం 3.31.1

కుటుంబం

సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20

స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించేది గా,శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- అధర్వణవేదం 11.1.17 (స్త్రీకి   స్త్రీ స్త్రీ  కి సంపాదన ఉన్నప్పుడే ఆమె తన కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)

నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- అధర్వణవేదం 7.46.3

ఉద్యోగాల్లో

స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2

స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి-యజుర్వేదం 16.44(ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం.

స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా!

(శ్రీ రామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే శ్రీ రాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చినపుడు అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).

కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి-
ఋగ్వేదం 10.85.26

విద్యా విషయాల్లో

ఓ స్త్రీలారా! పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాక!  మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాక! మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను-ఋగ్వేదం 10-191-3

వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్ప బడింది. ఒక్క మన  హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ మనకుస్త్రీదేవతలుఉన్నట్టుగా కనబడరు.అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్య సందేశం ఇచ్చినట్టుగా లేదు.

వివాహం -విద్యాభ్యాసం

ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు – అధర్వణవేదం 14-1-64

మొత్తం మీద వేదాలలో స్త్రీకి మంచిస్థానమే ఉందని చెప్పాలి.

Related posts

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju