సర్వభూపాల వాహనంలో ఉభయదేవరులతో స్వామి !

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు శ‌ని‌వారం ఉద‌యం 7.00 గంట‌లకు ‌రథోత్స‌వం బదులుగా శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు.

సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు. ఈ స్వామి వాహనసేవ చూసినవారికి సర్వదోషాలు పోయి స్వామి అనుగ్రహం లభిస్తుంది.