సూర్యాస్తమయం తర్వాత అమ్మాయిలు ఇంటికి వస్తే వాళ్లు ఏం చేస్తారో తెలుసా?

ఆ దేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు, మత ఆచారాలు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఆ దేశం లో అమ్మాయిలు సూర్యాస్తమయ సమయం తర్వాత ఇంటికి వెళితే వారికి వివాహం జరిపిస్తారు. ఇండోనేషియాలో గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న సంప్రదాయం ఇది.

 

ఇండోనేషియాలో ఇలాంటి తాజా ఘటన మరొకటి చోటుచేసుకుంది. మతాంగ్ ప్రజే గ్రామంలో నివసించేటటువంటి 15 ఏళ్ల అబ్బాయి అదే గ్రామానికి చెందిన 12 సంవత్సరాల వయసున్న అమ్మాయితో ఒకరోజు డేటింగ్ చేశాడు. అయితే సూర్యాస్తమయం తర్వాత తన ఇంటికి వెళ్ళిన కూతురుని తల్లిదండ్రులు నిలదీయడంతో ఆమె అబ్బాయి ఇంట్లో ఉన్నాను అని చెప్పింది. దీంతో వారు వెంటనే ఆ అమ్మాయి, అబ్బాయ్ కి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో వారి సంప్రదాయ పద్ధతులలో వారి ఇద్దరికి బాల్య వివాహం జరిపించారు.

అయితే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోకి సంబంధించి ఇండోనేషియా రిలీజియస్ ఆఫైర్స్ ఆఫీసర్ వారి ఇరువురి పెళ్లిని అధికారకంగా ఆమోదించలేదు. ఈ ఘటనపై గ్రామ పెద్ద అయిన ఎహసాన్ స్పందిస్తూ సూర్యాస్తమయం వరకు అమ్మాయి, అబ్బాయి ఇంట్లో ఉంది కాబట్టి వారి సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. తల్లిదండ్రుల దృష్టిలో వారిద్దరు భార్యాభర్తలు కాబట్టి వారిద్దరూ కలిసి ఒకేచోట ఉంటారని చెప్పారు. ఈ సంప్రదాయాన్ని లంబాక్ దీవిలో నివసించే సశాంగ్ ప్రజలు పాటిస్తున్నారు.