Nagarjuna: మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో మొత్తం ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఏడుగురి సంగతేమో గానీ.. ఒకేలాంటి మనుషుల్ని మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాము. ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకపోయినా కొందరు అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉంటుంటారు. ఇంకొందరు సేమ్ టు సేమ్ కాకపోయినా దగ్గరి పోలికలను కలిగి ఉంటారు. పాకిస్థాన్ కు చెందిన జైన్ అక్మల్ ఖాన్ అలియాస్ షికారీ మాస్ కూడా ఓ కోవకే చెందుతాడు.
టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మథుడు నాగార్జున పోలికలతో ఉన్న జైన్ అక్మల్ ఖాన్ ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారాడు. 2019 నుంచి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటోన్న జైన్ అక్మల్ ఖాన్ కు ఒకానొక సందర్భంలో టాలీవుడ్ హీరో నాగార్జునలా ఉన్నావని ఎవరో చెప్పారట. దాంతో జైన్ అక్మల్ ఖాన్ నాగార్జున గురించి గూగుల్ ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత నాగార్జునలా మేకప్ వేసుకుని ఆయనలా హావభావాలు పలికిస్తూ యూటూబ్ లో షార్ట్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు.
ఆపై యూట్యూబ్ లో ఫుడ్ వ్లాగర్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఈ వ్యక్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాగార్జున పోలికలను కలిగి ఉండటం తనకు చాలా బాగా కలిసొచ్చిందని.. ఆయన పోలికల వల్లే తాను తొందరగా ఫేమస్ అయ్యానని జైన్ అక్మల్ ఖాన్ తెలిపాడు. అలాగే యూట్యూబ్ లో ఫుడ్ వీడియోలు చేసుకుంటూ నెలకు రూ. 4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నారని కూడా జైన్ అక్మల్ ఖాన్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. అదృష్టమంటే జైన్ అక్మల్ ఖాన్‌దే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.