Brahmamudi 16 ఆగస్ట్ 176 ఎపిసోడ్:తనని క్రింద పడేయడానికి రాజ్ నూనె పోసిన సంఘటన ని మొబైల్ ఫోన్ తో వీడియో తీస్తుంది కావ్య. అది రాజ్ కి చూపించి, ఆమ్మో క్రింద పడి నా తలకి దెబ్బ తగిలి ఉంటే నేను కోమాలోకి వెళ్లేదానిని కదా అని అంటుంది కావ్య. అప్పుడు రాజ్ ఆపు, నేను అంత దూరం ఆలోచించలేదు, కాళ్ళు జారీ క్రిందపడితే మీ పుట్టింటికి వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటావని అలా చేశాను అని అంటాడు రాజ్.

రాజ్ కి వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేసిన కావ్య:
అప్పుడు కావ్య ఈ వీడియో ని తాతయ్య కి చూపించాలని అనుకుంటున్నాను అని అంటుంది కావ్య. అంత పని చెయ్యకు, ఈ వీడియో డిలీట్ చెయ్యాలంటే ఎంత కావాలో చెప్పు ఇస్తాను అని అంటాడు రాజ్. డబ్బుతో నన్ను కొనలేరు అని అంటుంది కావ్య. మరి ఏమి చెయ్యాలి అని రాజ్ అడగగా, చెప్తాను కానీ ఇప్పుడే కాదు, నాకు అవసరాలు చాలా ఉంటాయి కదా, అవి తీర్చిన తర్వాత డిలీట్ చేస్తాను అంటుంది కావ్య. అప్పుడు రాజ్ అంటే ఇది అడ్డం పెట్టుకొని ఈమె నాతో ఆడుకుంటుందా, ఇలా దొరికిపోయానే అని మనసులో అనుకుంటాడు రాజ్.

కళ్యాణ్ తన అనామిక ని కనిపెట్టాడా..?:
మరోపక్క కళ్యాణ్ అప్పు తో కలిసి తనకి ఉత్తరం రాసిన అమ్మాయిని ని వెతికే ప్రయత్నం లో ఉంటాడు. రోడ్డు మీద ఆగినప్పుడు ఒక కిరానా కొట్టు అతని ఫోన్ కి కాల్ చేసి కళ్యాణ్ తో మాట్లాడుతుంది. తన ఫోన్ నెంబర్ కనుక్కోమని చెప్తుంది, అప్పుడు కళ్యాణ్ తనకి తెలిసిన ఫోన్ నెంబర్ ని ఆధారంగా చేసుకొని అడ్రెస్స్ కనుక్కొని పిచ్చేశ్వర రావు ఇంటి అడ్రెస్స్ కి వెళ్తాడు. అక్కడకి వెళ్లిన తర్వాత అతను ఒక సైకియార్టిస్ట్ అని తెలుస్తుంది. నీకు ఆత్రం అనే జబ్బు ఉందని ఆ అమ్మాయి చెప్పింది అంటూ చెప్తాడు పిచ్చేశ్వరరావు. అప్పుడు తనకి ఆ అమ్మాయి ఇచ్చిన ఒక చిట్టీ ని ఇస్తాడు పిచ్చేశ్వరరావు. ఆ చిట్టి లో ఆ అమ్మాయి ఎందుకు అంత ఆత్రం పడుతున్నావు. నువ్వు ఏమి చేస్తే నేను నీకు ఉత్తరం రాసానో, అదే చెయ్యి ఫోన్ నెంబర్ ఇస్తాను అని అంటుంది అనామిక అనే ఆ గుర్తు తెలియని అభిమాని.

ఇంకా గర్భం దాల్చలేదని ఉక్రోషం తో రగిలిపోయిన స్వప్న:
అప్పుడు కళ్యాణ్ అంటే నేను మళ్ళీ కవిత రాయాలి అన్నమాట అని అర్థం చేసుకుంటాడు. మరోపక్క కావ్య తన పుట్టింటికి వెళ్లి పని చేసేందుకు అనుమతిని ఇచ్చిన సీతారామయ్య కి కృతఙ్ఞతలు తెలిపి ఆయన ఆశీర్వాదం తీసుకొని బయలుదేరబోతు, ఆటో ని బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు సీతారామయ్య ఇన్ని కార్లు ఉండగా నువ్వు ఆటో లో వెళ్లడం ఏమిటి, నిన్ను రాజ్ డ్రాప్ చేస్తాడు, ఈరోజే కాదు ప్రతీరోజు వాడే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్తాడు. అప్పుడు రాజ్ కావ్య ని ఎక్కించుకొని బయలుదేరుతాడు. ఇక స్వప్న తనకి గర్భం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకొని, ఇంకా రాకపొయ్యేసరికి తన స్నేహితురాలికి ఫోన్ చేసి అడుగుతుంది.

అప్పుడు ఆమె స్నేహితురాలు మీరిద్దరూ కలిసి కేవలం రెండు రోజులు మాత్రమే అయ్యింది, అప్పుడే నువ్వు గర్భం దాల్చిన విషయం ఎలా తెలుస్తుంది అని అంటుంది. కొన్ని రోజులు ఆగితే కానీ ఈ విషయం తెలియదు, పెళ్ళై చాలాకాలం అయిన వాళ్లకి సంతానం కలగని సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు స్వప్న కళ్యాణ్ కి పిల్లలు కనే యోగ్యత లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని కంగారు పడుతుంది.