NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Heart Attack Treatment: హార్ట్ అటాక్ మరణాల తగ్గించేందుకు జగన్ సర్కార్ ప్రత్యేక దృష్టి .. గోల్డెన్ అవర్ లో రూ.40వేల విలువైన ఇంజక్షన్ ఉచితంగా..

Advertisements
Share

Heart Attack Treatment: ఒకప్పుడు గుండె పోటు 50 సంవత్సరాల పైబడి వారిలో వచ్చేది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా పెద్దలు, పిల్లలు, యువత గుండె పోటుకు గురి అవ్వడం అందరినీ ఆందోళనకు గురి చేస్తొంది. ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే యువకుడు హార్ట్ అటాక్ కారణంగా మృతి చెందాడని తెలిస్తే ఇంత చిన్న వయస్సులో ఏమిటి అని వృద్దులు ఆశ్చర్యపోవాల్సి వస్తొంది. హార్ట్ అటాక్ కారణంగా కొందరు నిద్రలోనే ప్రాణాలు కోల్పోతుండగా, మరి కొందరు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ.. పాటలు పాడుతూ.. వ్యాయామం చేస్తూ.. వాకింగ్ చేస్తూ కుప్పుకూలిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత ఈ కేసులు మరింత పెరిగినట్లుగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు.

Advertisements

ఇటీవల బాగా పెరుగుతున్న హార్ట్ అటాక్ మరణాలను చెక్ పెట్టేందుకు ఏపీలోని జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రజారోగ్య రంగంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హార్ట్ అటాక్ గురైన వారికి అత్యంత కీలకమైన మొదటి గంటలోనే అత్యవసర ప్రాధమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే స్టెమి (STEMI)  ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక చికిత్స అందించనున్నారు. రూ.40వేల విలువైన స్పెషల్ ఇంజక్షన్ల ను కూడా అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం స్టెమి కార్యక్రమాన్ని చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 94 పోస్టులు మంజూరు చేసింది.

Advertisements

అంతే కాకుండా గ్రామ స్థాయిలో సిబ్బంది, వైద్యులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలు కూడా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రూ.120 కోట్లు వెచ్చించి క్యాథ్ లాబ్స్ నిర్మాణం చేసింది. వచ్చే నెల 29 నుండి పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. గుండె పోటుకు గురైన వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్ కు తరలిస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది రోగికి అత్యవసర ప్రాధమిక చికిత్స అందిస్తారు. అనంతరం రోగిని క్యాథ్స్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా టీచింగ్ హాస్పటల్ కు రిఫర్ చేస్తారు. స్టెమి ప్రాజెక్టు సేవలను వచ్చే ఏడాది జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు జగన్ సర్కార్ అడుగులు వేస్తొంది.

Road Accident: ఆటోను ఢీకొన్న లారీ .. ఆటో నుజ్జునుజ్జు .. ఐదుగురు దుర్మరణం


Share
Advertisements

Related posts

AP Police : పంచాయతీ కీ మేం రెడీ

Comrade CHE

Megastar Chiranjeevi: సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు..జగన్‌తో భేటీ అనంతరం సినీ ప్రముఖులు ఏమన్నారంటే..?

somaraju sharma

బిగ్ బాస్ 4: నామినేషన్స్ మొదలుకాక ముందే ఎలిమినేట్ అయిపోయేది ఎవరో తెలిసిపోయింది!

sowmya