Brahmamudi అక్టోబర్ 18 ఎపిసోడ్ 230: నిన్నటి ఎపిసోడ్ లో, రాజ్ లోపల ఉన్న అంతరాత్మ నువ్వు కావ్యని ప్రేమిస్తున్నావు అని అంటుంది. కానీ రాజ్ ఒప్పుకోడు. అందుకే ఆమెని కోపడ్డం మానేసి ప్రేమించడం మొదలు పెట్టావు అని అంతరాత్మ చెబుతుంది. అప్పు కళ్యాన్ ని ప్రేమిస్తూ తన బాధను వాళ్ళ అత్త తో బయటకు చెప్పుకుంటుంది. రాజ్ కావ్య కోసం తనను బయటకు తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు.

ఈరోజు 230 vఎపిసోడ్ లో,కావ్య కిల్లి తినాలనిపిస్తుంది అని చెప్తే రాజ్ దొంగతనంగా కావ్యని బయటికి తీసుకువెళ్తాడు. మెల్లగా కావ్య రాజ్ ఇంట్లో నుంచి వస్తూ ఉంటారు. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా జాగ్రత్తగా ఎవరూ చూడకుండా బయటికి వెళ్లాలి అని అనుకుంటారు. కావ్య డ్రెస్ లో రావడం చూసి రాజ్ ఏంటి డ్రెస్ వేసుకున్నావు చీరిప్పేసావు అని అంటాడు. చి చి ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది కావ్య. అదే డ్రెస్ మార్చావ్ ఏంటి అని అంటాడు. బైక్ మీద వెళ్దాం అన్నారు కదా అందుకని అని అంటుంది కావ్య. సరే పద అని ఇద్దరు మెల్లిగా డోర్ తీసుకొని బయటికి వెళ్తారు.

రాజ్ కావ్య షికారు..
ఇక రాజ్ కావ్య ఇద్దరు బయటికి వచ్చి బండి సౌండ్ అవుతుందని స్టార్ట్ చేయకుండా మెల్లిగా ముందుకి నడుపుతూ ఉంటాడు. ఇలానే కిల్లి కొట్టు దాకా నడిపిస్తారా అని అంటుంది కావ్య. లేదు సౌండ్ అయితే ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు నువ్వు పదా ముందు అని అంటాడు. గేటు దగ్గరికి వెళ్లిన తర్వాత కావ్య ఎక్కించుకొని బండి స్టార్ట్ చేస్తాడు రాజ్. బైక్ మీద రాసిన గట్టిగా హగ్ చేసుకుని కూర్చుంటుంది కావ్య. ఏంటిది అని అంటాడు రాజ్. నాకు కింద పడిపోతానేమోనని భయంగా ఉంది అందుకనే మిమ్మల్ని పట్టుకున్నాను అని అంటుంది. అయినా నాకు ఎప్పటినుంచో కల మీతో ఇలా బయటికి రావాలని ఇన్నాళ్లకు అది నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని గట్టిగా హగ్ చేసుకుంటుంది రాజ్ ని,ఇక రాజ్ తో బండిమీద అలా వెళ్తూ కావ్య ప్రతిసారి రాజుని చూసుకుంటూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావ్ అని అంటాడు. ఏం లేదులే పదండి అని అంటుంది.ఇలా మెల్లిగా నలిపి నలిపితే మనం పాల ప్యాకెట్లు వచ్చే వాడితో పాటు రావాల్సి ఉంటుంది. కాస్త ఫాస్ట్ గా ఫోన్ చేయండి బండిని అని అంటుంది.

పాన్ షాప్ లో దొంగలు..
షాపులన్నీ మూసేసి ఉండడం చూసి రాజ్ సిటీ అప్పుడే ఎంత బాగుపడిపోయింది ఎవరు లేని కూడా లేరు అందరూ షాపులు మూసేసి వెళ్లిపోయారు అని అంటూ ఉంటాడు. ఎక్కడా కిల్లి కొట్టు కనిపించదు. మధ్యలో ఒకచోట ఆగగానే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని మీకు క్వార్టర్ కావాలా సార్ అని అడుగుతాడు. నీ బొంద రా అని అంటాడు రాజ్.అదేంటి ఆయన ఏదో అడుగుతున్నాడు కదా తీసుకోండి అని అంటుంది ఏం తీసుకోవాలి అంటాడు రాజు క్వాటర్ అంట తీసుకోండి అని అంటుంది అదే మన వాటర్ బాటిల్ అనుకున్నావా అని అంటాడు రాజ్. అంటే మీరు నిజంగానే తాగారా అని అంటుంది కావ్య నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అని అంటాడు రాజ్. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా పెరిగారా ముద్దపప్పు లాగా అని అంటుంది కావ్య. మీకు రోజు ఇంటికి తాగచ్చే తన్నే మొగుడే కావాలా ఏంటి అని కావ్యతో అంటూ బండి స్టార్ట్ చేసి ఒక కిల్లి కొట్టు ముందు ఆపుతాడు. అక్కడే కిళ్లీ కొట్లో ఉండేవాడు బయటికి వెళ్లడంతో రాజు కావ్య ఇద్దరు షట్టర్ ఓపెన్ చేసుకొని దొంగలాగా లోపలికి వెళ్తారు. ఏమండీ మనం ఇట్లా లోపలికి వెళ్తే దొంగలనుకుంటారేమో అని అంటుంది కావ్య. నీకు కిల్లి కావాలా వద్దా అని అంటాడు నాకిల్లి కావాలి అని అంటుంది అయితే నోరు మూసుకొని నా వెనకాల రా అని అంటాడు. షట్టర్ ఎందుకు వేశావే అని అంటాడు కావ్య తో రాజ్. ఏం లేదండి మనం దొంగతనం చేస్తున్న విషయం బయట వాళ్లకు తెలియకూడదు కదా అని అంటుంది.

మసాలా కిళ్ళికట్టిన కావ్య..
ఇక ఇద్దరూ లోపలికి వెళ్లి ఇప్పుడు నీకు ఒక మంచి పాన్ నేను రెడీ చేసి ఇస్తాను అని కావ్య కోసం రాజ్ తమలపాకులు తీస్తూ ఉంటాడు మీకు కిల్లి కట్టడం కూడా వచ్చా అని అంటుంది ఏముంది ఇక్కడున్న స్వీట్స్ అన్ని ఆకు మీద వేసి ఇస్తే అదే కిల్లి అని అంటాడు రాజ్. సరే ఏదో ఒకటి ఇవ్వండి అని అంటుంది రాజ్ కావ్య కోసం కిళ్ళి కట్టి ఇస్తాడు. కిల్లి షాపు అతను అప్పుడే అక్కడికి వస్తాడు లోపల ఎవరో దొంగలు పడ్డారు అని అనుకుంటాడు వెంటనే పోలీసులకు కాల్ చేస్తాడు. ఆ పోలీస్ కూడా ఆల్రెడీ వాళ్ల భార్యతో ఫ్రస్టేషన్లో ఉంటాడు. కిల్లి షాపు వ్యక్తి ఫోన్ చేసి సార్ నాకు షాప్ లో దొంగలు పడ్డారు మీరు వెంటనే రండి వాళ్ళని పట్టుకుందాము ఒక ఆడ దొంగ ఒక ముఖ దొంగ పడ్డారండి అని అంటాడు. సరే వస్తున్నాను నీ షాప్ అడ్రస్ ఎక్కడో చెప్పు అంటే చౌరస్తా దగ్గర అని అంటాడు సరే అని పోలీసులు చౌరస్తా వైపు వెళ్తారు. ఇక మన కావ్య రాజులు ఇద్దరూ లోపల ఆడి పాడుతూ ఉంటారు. నాకోసం మీరు కిల్లి కట్టించారు కదా నేను ఇప్పుడు మీకోసం ఒక మసాలా కిళ్ళి కట్టిస్తాను అంటుంది రాజ్ సరే అంటాడు. కావ్యకు కిల్లి కట్టేటప్పుడు ఇది జరదా అంటారు దీన్ని మాత్రం వాడకూడదు ఇది వేసుకుంటే మత్తులో నీకు నేల భూమి ఏకం అయిపోతుంది అని రాజు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి కావాలనే కావ్య రాజ్ కిల్లీలో జరదా వేసి కలిపి నోట్లో పెడుతుంది అది తింటూ రాజ్ ఏంటి ఏదో తేడాగా ఉంది అని అంటాడు మీది ఉక్కు బాడీ కదా ఏం కాదులేండి తినండి అని అంటుంది. సరే అని రాజ్ తింటూ మత్తు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటాడు కావ్య కూడా డాన్స్ చేస్తూ ఉంటుంది బయట ఉన్న షాపు ఓనరు వీళ్ళు చేసే అల్లరితో బాగా కోపం వస్తుంది.

పోలీసులు ముందు దొంగల్లా రాజ్ కావ్య..
ఇక వీళ్ళు షాప్ లో ఉండగానే పోలీసులు వస్తారు. షాపు ఓపెన్ చేసి చూసేసరికి ఇద్దరు లోపలే ఉంటారు. పోలీసులు చూసి కంగారులో రాజ్ పాటలు ఆపేస్తాడు. ఇద్దరు బయటకు రండి లేదంటే షూట్ చేస్తాను అని అంటాడు పోలీస్. ఇద్దరూ బయటికి వచ్చి ఉంటారు. ఏంటి మీ ఇద్దరూ దొంగతనం చేయడానికి వచ్చారా అని అంటాడు పోలీస్, లేదు సార్ అని అంటాడు రాజ్ అనే మాటలు పోలీసులకు అర్థం కాదు ఎందుకంటే రాజ్ అప్పటికే జరదా వేసిన కిల్లి తిని ఉంటాడు కాబట్టి నాలిక మంద పడుతుంది. ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు అంటాడు పోలీస్ వెంటనే కావ్య మేము దొంగలం కాదు అని అంటున్నారు అని అంటుంది. అమ్మో నాలిక మందపడే అంత కిల్లిలు తిన్నారా అని ఓనర్ అంటాడు. రాజ్ ఏదో చెప్పబోతుంటే పోలీసు వీళ్ళు చెప్పే మాటలు నాకు అర్థం కావట్లేదు గాని ఆ నాలిక మందం పోవడానికి ఏదో ఒకటి చేయరా అని ఓనర్ తో అంటాడు. వెంటనే ఓనర్ లోపలికి వెళ్లి వాటర్ తీసుకొచ్చి రాజు ఇచ్చి ఇవి తాగండి అని అంటాడు. ఇక రాజ్ గొంతు సరి చేసుకొని మేమిద్దరం దొంగలం కాదండి అని అంటాడు. మరి మీరు ఒకటి రెండు మూడు అని డబ్బులు లెక్క పెట్టడం నేను విన్నాను అంటాడు ఓనర్. మేము లెక్క పెట్టింది డబ్బులు కాదండి తమలపాకులు అని అంటాడు రాజ్. వెంటనే కావ్య అసలు మేము ఎవరో తెలుసా అని అంటుంది పోలీసులతో వద్దే మన గురించి చెప్పద్దు ఇంట్లో తెలిస్తే పరువు పోతుంది అని రాజ్ అనడంతో కావ్య సరే అంటుంది. వెంటనే రాజు మేమిద్దరం భార్యాభర్తలం అని అంటాడు. కావ్య అవునండి మేమిద్దరం భార్యాభర్తలం నాకు కిల్లి తినాలనిపిస్తే మా వారు పాన్ షాప్ దగ్గరికి తీసుకువచ్చారు ఇక్కడ షట్టర్ వేసి ఉంది లోపలికి వెళ్లి తిన్నాము. అంతే మ్యూజిక్ బాగుంది కదా అని చెప్పి డాన్స్ వేసాము మమ్మల్ని వదిలేయండి అని కావ్య అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో,మైఖేల్కి బెయిల్ వచ్చేందుకు లాయర్ తో మాట్లాడుతూ ఉంటాడు రాహుల్, ఎంత ఖర్చైనా పర్లేదు బెయిల్ రావాలి అని అంటాడు. ఇక డబ్బుల కోసం ఇంట్లో ఉన్న నగలను ఒక బ్యాగ్ లో వేసుకుని బయటికి తీసుకు వెళ్తూ ఉంటాడు అప్పుడే రాహుల్ చేతిలో బ్యాగు చూసి, రాజ్ ఏంట్రా అది అని అంటాడు. వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం ఇంట్లో సభ్యులందరూ రాహుల్ ని చూస్తూ ఉంటారు. ఇక రుద్రాణి రాహుల్ చేతిలో బ్యాగ్ కూడా చూసి అనుమానంగా చూస్తూ ఉంటుంది. రాజ్ నిన్నే కదరా అడుగుతుంది చేతిలో బ్యాగ్ ఏంటి అంటాడు. రాహుల్ ఏమి చెప్పబోయే సరికి ప్రకాశం ఇవి కొత్త డిజైన్స్ అనుకుంటా అని అంటాడు. ఆ అవును అంటాడు రాహుల్. అయితే చూపించు అని ప్రకాశం చేతిలో ఉన్న బ్యాగులు లాక్కుంటాడు పొరపాటున బ్యాగ్ లో ఉన్న నగలు అన్ని కింద పడిపోతాయి అది చూసి అందరూ షాక్ అవుతారు. వెంటనే రాజ్ ఎక్కడికి నగలన్నీ తీసుకువెళ్తున్నావు అని రాహుల్ నిలదీస్తాడు కుటుంబ సభ్యులు ముందు. ఇక రుద్రని షాక్ అవుతుంది.