Brahmamudi అక్టోబర్ 17 ఎపిసోడ్ 229: నిన్నటి ఎపిసోడ్ లో స్వప్నకి తోడు ఉండడానికి కనకాన్ని ఇంట్లోనే ఉండమని చెప్తుంది ఇందిరా దేవి. ఇక ఇంట్లో అందరూ ఒప్పుకోవడంతో కనకం కూడాదుగ్గిరాల ఫ్యామిలీలో ఉండడానికి ఓకే అంటుంది.కనకం ఇంట్లో ఉండడం అపర్ణకు ఇష్టం ఉండదు. రుద్రాణి ఎప్పుడు గొడవలు పెడదామా అని చూస్తూ ఉంటుంది. ఇక అపర్ణ పక్కన కూర్చొని భోజనం చేయడానికి రాజ్కనకాన్ని ఒప్పిస్తాడు.

ఈరోజు 229 వ ఎపిసోడ్ లో, కనకం అందరితో పాటు కలిసి భోజనం చేస్తూ ఉంటుంది ఇక ఇందిరా దేవి కనకం ఎక్కడ పడుకుంటుంది అని అంటుంది. ఎక్కడ పడుకుంటుంది స్వప్న గదిలోనే పడుకుంటుంది స్వప్న ని చూసుకోవడానికి కదా వచ్చింది. కాబట్టి అక్కడే పడుకుంటుంది అంటుంది రుద్రాణి. అక్కడ రాహుల్ పడుకుంటాడు కదా ఎలాగూ,శ్రీమంతం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి స్వప్న ఉన్న రోజులు వాళ్ళిద్దర్నీ ఒకే గదిలో పడుకొని ఇవ్వు అని అంటుంది ఇందిరాదేవి.అందరూ జంటలు జంటలుగా ఉన్నారు కాబట్టి కిచెన్ మాత్రమే ఖాళీగా ఉంది అని వెటకారంగా అంటుంది రుద్రాణి. వెంటనే ఇందిరా దేవినువ్వే మంచి ఐడియా ఇచ్చావు నీ గదిలోనే పడుకో నువ్వు అని అంటుంది. ఇక అందరూ తలా ఓ మాట రుద్రాణిని అంటారు ఇక చేసేదేం లేక రుద్రాని కూడా సైలెంట్ అవుతుంది.
Nuvvu Nenu Prema: అపాయంలో అరవింద.. పద్మావతి మీద నింద.. పద్మావతి ఏం చేయనుంది?

అప్పు బాధ.. ఓదార్చిన పెద్దమ్మ..
ఇక అప్పు తన పెద్దమ్మ అన్నపూర్ణ భుజం మీద తలవాల్చి మెట్ల మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే పెద్దమ్మ అన్నపూర్ణ ఏంటి అని అంటుంది. నాకు తెలియకుండానే నేను వాడిని ఇష్టపడడం మొదలుపెట్టాను కానీ నిజం చెప్తున్నాను పెద్దమ్మ నేను ఎప్పుడూ వాడిని ప్రేమించాలి అని అనుకోలేదు అలాంటి ఉద్దేశం కూడా నాకు ఎప్పుడూ లేదు అయినా ఇదంతా ఎలా జరిగిందో నాకు అసలు తెలియడం లేదు ఇప్పుడు వాడి దూరం అవుతుంటే నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తుంది అప్పు. మనసు ఎప్పుడూ అలానే మోసం చేస్తుంది అప్పు కళ్ళకు నిజం తెలిసేలోపే మనల్ని అగ్నిగుండంలో పడేస్తుంది చివరికి ఇలా బాదే మిగులుతుంది అని పెద్దమ్మ అంటుంది నేనంటే సరే పెద్దమ్మ ఏం పట్టనట్టు తిరుగుతుంటాను వాడు కవితలు రాస్తాడు నిద్రలేస్తే మనసు హృదయము అని ఏవేవో చెప్తూ ఉంటాడు అలాంటప్పుడు వాడికి నా ప్రేమ ఎందుకు అర్థం కాలేదు నేను అర్థం చేసుకోవడానికి నాకే నా మనసు చెప్పింది అర్థం కాలేదు కానీ వాడు కవి కాబట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు కదా ఎందుకు అలా కాలేదు అంటుంది వెంటనే పెద్దమ్మ ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ అపు మాత్రం వాడు అందరివాడు లాగా మాత్రం ఉండడు పెద్దమ్మ నన్ను నన్నుగా చూస్తే అర్థం చేసుకుంటాడు అని అనుకున్నాను అందుకే అందరి ముందు నటించానట్టుగా వాడి ముందు నటించలేదు ఎప్పుడు నేను ఎట్లా ఉన్నాను అట్లానే ఉన్నాను.

ప్యాంటు షర్ట్ లోనే తిరుగుతూ వాడి ముందుస్నేహంగా ఉన్నాను కానీ వాడు మాత్రం ఈరోజు అదే ప్యాంటు షర్టు మీద కామెంట్ చేస్తున్నాడు నేను ఇలా ఉండడానికి నాకు తప్పని అనిపించలేదు కాబట్టే ఉన్నాను అని ఏడుస్తూ ఉంటుంది అప్పు తన బాధను అంతా తన ప్రేమఓడిపోయినందుకు బాధపడుతూ ఉంటుంది.అప్పు ఏడుస్తుంటే వాళ్ళ పెద్దమ్మ ఎందుకు అప్పు బాధపడతావు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటాడు అని అంటుంది. కానీ లేదు పెద్దమ్మ ఎన్ని మాటలు అన్నాడో తెలుసా నన్ను నేను చీర కట్టుకోవడానికి పనికిరాని అన్నాడు నా మనసు ఒక బండరాయి అన్నాడు ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు అన్నాడు. నన్ను అన్ని మాటలు అన్న తర్వాత ఇంకా అర్థం చేసుకుంటాడు అని ఎలా అనుకుంటాను పెద్దమ్మ అని అంటుంది. ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి కూడా సిద్ధపడిపోయాడు అని అంటుంది.

రాజ్ అంతరాత్మ..
ఇక రాజ్ తన గదిలో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే పక్కనే బెడ్ మీద రాజ్ అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది. ఒక లవ్ సింబల్ బెలూన్ తీసుకొని రాజ్ బెడ్ మీద అంతరాత్మ వస్తాడు నీ మనసులో ఏమున్నదో నాకు తెలుసు అని అంటాడు అంతరాత్మ, ఏముంది అనిరాజ్ అంటాడు వెంటనే హే డూడ్ నీ మనసులో కళావతి మీద ప్రేమ మొదలైంది కోపం తగ్గిపోయింది నిత్యం గమనిస్తూనే ఉన్నాను.అలా ఏం లేదు అంటాడు రాజ్ ఎందుకు బుకాయిస్తున్నాడు నాకు అంతా తెలుసు నేను నీ అంతరాత్మను నా దగ్గర అబద్ధం చెప్పకు అని అంటాడు ప్రేమా లేదు ఏమీ లేదు మూడు నెలలు గడిస్తే తన దారి తంది నా దారి నాది అని అంటాడు. దాంతో అంతరాత్మ తెచ్చుకున్న బెలూన్ పేలి అంతరాత్మ కూడా మాయమైపోతాడు.

రుద్రానీ తో కనకం తిప్పలు..
ఇక కనకం కింద పడుకోవాలి అని రుద్రాణి అనుకుంటుంది తన గదిలోకి రాగానే చాపా దిండు పక్కన వేస్తుంది.కనకం రుద్రానికి ఒక జలక్కిస్తుంది. ఏంటి చాపాదిండు కిందేశారు మీరు గాని కింద పడుకునే అలవాటు ఉందా ఏంటి అంటుంది వెంటనే రుద్రాణి కనకమన్న మాటలకు షాక్ అవుతుంది ఇక చేసేదేం లేక రుద్రాణి అటు తిరిగి పడుకుంటూ ఇది నాకు కాదు నీకే అని అంటుంది అయితే కనుక దాన్ని తీసి మడిచి పక్కన పెట్టి రుద్రాణి పక్కనే పడుకుంటుంది. వెంటనే కృష్ణమూర్తికి ఫోన్ చేస్తుంది కనుకమ్,ఫోన్లో పెద్దపెద్దగా మాట్లాడుతుంటుంది రుద్రానికి చెవులు మూసుకున్నా కానీ వినిపిస్తూ ఉంటుంది.కృష్ణమూర్తి తో ఫ్రిజ్లో ఇడ్లీ పిండి ఉంది రేపు పొద్దున్నే టిఫిన్ వేసుకోండి ఇంటి ముందు ముగ్గు వేయమని మీ అక్కయ్యతో చెప్పండి అని ఇలా ఇంట్లో చేయాల్సిన పనులన్నీ కృష్ణమూర్తికి అప్పచెప్తు ఉంటుంది కనుకమ్ రుద్రాణి అవన్నీ వినలేక చెవులు మూసుకుంటుంది.కనకం ఇక్కడ ఏసీ ఉందండి నాకు ఏసీ పడదు కానీ ఏం చేస్తాను అలవాటు చేసుకుంటారు ఏంటి అని అంటుంది ఆ మాట రుద్రాణి చెవి వినపడుతుంది వెంటనే కనుకమ్ కి ఇబ్బంది పెట్టాలని ఏసీ ఫుల్లుగా పెట్టి దుప్పటి నిండా కప్పుకుని పడుకుంటుంది. కనకానికి బాగా చలివేస్తుంది గదిలో నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకుంటుంది. కానీ ఎక్కడికి వెళ్లి పడుకోవాలి అని ఆలోచించి ఇక చేసేదేం లేక అక్కడే బీరువాలో ఉన్న రుద్రాణి చీరలు అన్ని తీసి ఒకదాని మీద ఒకటి వేసుకొని పడుకుంటుంది కనుకమ్. రుద్రాణి ఏసీ ఫుల్లుగా పెడితే ఇకనుంచి వెళ్ళిపోతుందిలే అనుకుంటుంది కానీ కనకం రుద్రానీ కే జలక్కిస్తుంది.
Trinayani October 16th ఎపిసోడ్ 1059: వేడి పెనం పడి మొఖం కాలిపోయిన వల్లభ…పాముగా ఉలోచి మాయలు!

రాజ్ కావ్యా షికారు..
బెడ్ రూమ్ లోనికి వస్తుంది కావ్య కానీ ఆమె వచ్చిన సంగతి కూడా పట్టించుకోకుండా పనిలో మునిగిపోతాడు రాజు తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని కావ్య అనుకుంటుంది కావాలనే ఆటపట్టించాలి అనుకుంటుంది. ఇక కావ్య అనే మాటలకు రాజ్ నేను నిన్ను పట్టించుకోకపోతే మీ అమ్మకు సపోర్ట్ ఎందుకు చేస్తాను అని అంటాడు. అయినా నాకెందుకో మీ మీద అనుమానంగానే ఉందండి మీరు నన్ను ఇంకా పండించుకోవట్లేదు అని అంటుంది.అయితే నీ అనుమానం తీరాలంటే నేనేం చేయాలో చెప్పు అంటాడు రాజ్.వెంటనే రాజ్ బెడ్ మీదకి వచ్చి కూర్చుంటుంది కావ్య వెంటనే రాజ్ కంగారు పడతాడు.ఇక రాజ్ తో కావ్య నిద్రపోయేముందు నాకు కోరిక ఉందండి అని అంటుంది. ఏంటో చెప్పు అంటాడు రాజ్ నాకు కిల్లి తినాలనిపిస్తుంది అని అంటుంది దాంట్లో ఆన్లైన్లో వెతుకుతాడు రాజ్.కానీ అప్పటికే చాలా టైం అవడంతో షాపులు ఏవి సర్వీస్ లో ఉండవు దీంతో మనం బండిమీద వెళ్తున్నాం ఈరోజు నీకు ఎలాగైనా పాన్ తినిపిస్తాను కదా అంటాడు రాజ్. సరే అని ఇద్దరు కలిసి బండిమీద వెళ్లడానికి ఇంట్లో ఎవరూ చూడకుండా కిందకి వస్తారు. ఫోన్ తీసుకోమంటారా అంటుంది కావ్య అక్కర్లేదు మనం ఇక్కడే పక్కన ఉన్న గల్లీకి వెళ్లి వస్తాము ఆ మాత్రం దానికి ఫోన్ ఎందుకు రా అని అంటాడు. సరే అని కావ్య బండిమీద వెళ్లడానికి డ్రెస్ వేసుకొని వస్తుంది. కావిని డ్రెస్ లో చూసి, రాజ్ ఏంటిది అంటాడు బండి మీద వెళ్లాలన్నారు కదా అందుకని అంటుంది సరే అని ఎవరికి తెలియకుండా ఇద్దరు బయటికి వెళ్తారు.
రేపటి ఎపిసోడ్ లో ఒక మూసేసి ఉన్న పాన్ షాప్ ముందు ఆగి రాజ్ దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు ఇక కావ్య లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక ఇద్దరు దొంగతనం చేస్తారు రాజ్ కిల్లి కావ్యకి చుట్టి ఇస్తాడు. కావ్య కూడా రాజుకి ఒక కిల్లి చుట్టి ఇస్తుంది ఇద్దరూ కలిసి డాన్స్ వేస్తూ ఉంటారు. కావ్య చాలా సంతోషపడుతుంది.. చూడాలి రేపటి ఎపిసోడ్ లో ఇంట్లో వాళ్లకి వీళ్ళు దొంగతనంగా బయటికి వెళ్ళిన విషయం తెలుస్తుందో లేదో