Krishna mukunda murari: నిన్నటి ఎపిసోడ్ లో, ముకుందదాచిపెట్టిన నిజాన్ని అందరి ముందు తెలిసేలా చేయాలి అని కృష్ణ మధుకర్ సహాయం తీసుకుంటుంది. ఇక మురారి కనిపించట్లేదని రేవతి కంగారుపడుతుంది. భవాని దేవికి నిజం చెప్పాలని ముకుందా అనుకుంటుంది.
ఈరోజు 288 వ ఎపిసోడ్ లో ఫేక్ కమాండర్ కోసం ఒకవైపు మధుకర్ వెతుకుతూ ఉంటాడు మరోవైపు మురారి తన క్యాబిన్లో ఆలోచిస్తూ ఉంటాడు. మురారి ఫ్రెండు మురారి దగ్గరికి వచ్చి ఎంతసేపని ఇలా కూర్చుంటావు జరిగిన నిజాన్ని చెప్పేసేయ్ అని అంటాడు. నీ మనసులో ఉన్న మాటని కృష్ణకి నువ్వు ఈరోజు చెప్పేస్తే అంతా సర్దుకుంటుంది అని అంటాడు నీకు ఎలాగూ మీ అమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు కృష్ణకు నిజం చెప్తేనే మంచిదనిపిస్తుంది అంటాడు. మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తుంది కానీ నా టెన్షన్ అంతా ముకుంద గురించే, తను ఎక్కడ బయటపడి కృష్ణకి నిజం చెప్తుందో అని నాకన్నారంతా అని అంటాడు మురారి తన ఫ్రెండు తో, దానికన్నా ముందేనువ్వే ఇప్పుడే ఇక్కడే కృష్ణ కి కాల్ చేసి నిజం చెప్పు అని అంటాడు. ఇప్పుడు కాదు మంచి టైం చూసుకొని చెప్తాను అని అంటాడు మురారి.

ఫేక్ కమాండర్ ని ఇంటికి పట్టుకొచ్చిన మధుకర్..
ఇక కృష్ణ ఆదర్శ రాడ్ అన్న విషయాన్ని ముకుంద చెప్పడం గుర్తు చేసుకుని, ఎలాగైనా నిజాన్ని బయట పెట్టాలి అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ముకుందా నా ఫోన్ నువ్వు గాని ఏమైనా లిఫ్ట్ చేసావా అని అంటుంది. నీ ఫోన్ తో నాకేం పని నా ఫోన్లో ఫుల్లుగా చార్జింగ్ ఉంది అని అంటుంది. అంటే ఈ ఇంట్లో నన్ను ఎదిరించే ధైర్యం నీకు తప్ప ఎవరికి లేదు కదా అని అన్నట్టుగా అంటుంది ముకుంద. అయినా నా మురారి నా మనసులో ఉన్నంత వరకు ఎవరు ఏమి చేసినా నేను పట్టించుకోను అని అంటుంది ముకుందా
ఎందుకు ముకుందా తొందర పడతావు కాసేపు ఆగు అన్ని విషయాలు నీకే అర్థమవుతాయి అంటుంది కృష్ణ.ఫేక్ కమాండర్ ఆచూకీ కోసం మధుకర్ అందరినీ అడిగి ఎలాగోలా అతని అడ్రస్ పట్టుకొని బైక్ మీద అతని ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. ముకుందా మేడం చాలా మంచివారు సార్ నాకు గంటకి 15000 ఇచ్చారు అని అంటాడు. నేను ఇంకో ఐదు వేలు ఇస్తాను. ఇప్పుడు చెప్పు ఎవరు మంచి వాళ్ళు అంటాడు మధుకర్. ఆవిడ కన్నా మీరే మంచివాళ్లండి ఎందుకంటే ఆవిడ కోప్పడుతూ ఉండేది డబ్బులు అయితే ఇచ్చేది కానీ, హనీ ఫేక్ కమాండర్ చెప్తాడు ఇక ఇంట్లోకి తీసుకువెళ్తాడు మధుకర్.

మేడం చెప్పమంటేనే ఇదంతా చేశాను..
ఇక మధుకర్ ఫేక్ కమాండర్ ని తీసుకొని వెళ్లి కృష్ణ అని పిలుస్తాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ వస్తారు భవానీ దేవితో పాటు ఇంట్లో వాళ్లంతా అక్కడికి చేరుకుంటారు. ఫేక్ కమాండర్ ని చూసి ముకుందా కంగారు పడుతుంది అనుకున్నదంతా అయింది అని భయపడుతూ ఉంటుంది. ఫేక్ కమాండర్ వెళ్లి భవానీ దేవి కాల మీద పడి క్షమించండి అమ్మ నేను తప్పు చేశాను అని అంటాడు. వెంటనే భవానీ దేవి ఏంటి కృష్ణ ఇదంతా అని అంటుంది. ఆదర్శ రాడు అన్నది అబద్ధం, యుద్ధమే ఇష్టం ఇంటికన్నా అని చెప్పింది కూడా అబద్ధమే, చెప్పండి సార్ అని అంటుంది కమాండర్ వైపు చూసి కృష్ణ. అవును మేడం ఈ మేడం గారు చెప్పమంటేనే ఇదంతా చేశాను ఆవిడ నాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించింది అని నిజాన్ని చెప్పేస్తాడు ఫేక్ కమాండర్. రేవతి ఏంటి కృష్ణ ఈయన చెప్పేది అని అంటుంది. అవునత్తయ్య మీ పెద్ద కోడలు ఆడిన నాటకం ఇదంతా అని అంటుంది. అవును మేడమ్ మేడమ్ చెప్పిందంతా నిజం ఈమె ఆడమంటేనే ఈ నాటకం ఆడాను నేను చిన్నాచితకా వేషాలు వేసుకునే వాడిని, ఇక ఏసీబీ సారు ఇక్కడికి వస్తారు ఆయనతో నేను చెప్పమన్నది చెప్పు అని ఈ మేడం గారు చెప్పారు అదే చెప్పాను అమ్మ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫేక్ కమాండర్.

భవానీ దేవి కోపం..
ఇక ఆయన చెప్పింది అంతా విని ముకుంద దగ్గరికి భవానీ దేవి వస్తుంది. ఇక ముకుంద టెన్షన్ పడుతూ ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే భవాని దేవి లాగి ముకుంద చెంప మీద ఒక గట్టిగా ఒకటి ఇస్తుంది. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ముకుంద కూడా ఒకసారి గా భయంతో ఓనికి పోతుంది.ఇక వెంటనే ఎందుకు అలా నాటకం ఆడావు అని భవాని దేవి గట్టిగా నిలదీస్తుంది ఆదర్శ అంటే నాకు ఇష్టం లేదు అని ముకుంద గట్టిగా అరిచి చెప్తుంది మరి అలా ఇష్టం లేనప్పుడు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అంటుంది భవాని దేవి. ఈ విషయం అప్పుడే చెబుదామనుకున్నాను కానీ నా గొంతు నొక్కేశారు అని ముకుందా ఆవేదనగా చెబుతుంది. నా మనసు చంపుకున్న నా ప్రేమ బతికి ఉందని అనుకోని ముకుందా అంటుంది దాంతో అంతా షాక్ అవుతారు. ఇక కృష్ణ టెన్షన్ పడుతుంది ముకుందా తన ప్రేమ విషయం కూడా భవాని దేవికి చెప్పడానికి ఫిక్స్ అయిందని అర్థమవుతుంది కృష్ణ కి, ప్రేమెంటీ చంపుకోవడమేంటి అంటుంది భవానీ దేవి సీరియస్ గా,రేవతి వైపు చూస్తుంది భవాని దేవి ఏం మాట్లాడుతుంది ముకుందా అని అంటుంది.

వీళ్లు కూడా మిమ్మల్ని మోసం చేశారు..
ఇక భవానీ దేవి రేవతి వైపు చూసి అలా మాట్లాడగానే రేవతి కంగారు పడుతుంది ఇప్పుడు ముకుంద తన ప్రేమ విషయం అక్కయ్యకి చెప్పడానికి ఫిక్స్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. రేవతి ఏం మాట్లాడుతుంది ముకుందా పెళ్లయ్యాక ప్రేమ ఏంటి ఆ ప్రేమ బతికుండడమేంటి ఆ ప్రేమ కోసం ఇక్కడికి రావడం ఏంటి అని అంటుంది భవాని దేవి. వీళ్ళ నాన్నకి కాల్ చేసి ఈ చండాలన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్పు అంటుంది భవాని దేవి.ఆ మాటకి ముకుంద కి కోపం వస్తుంది అత్తయ్య మీరు నన్ను అసహ్యించుకుంటున్నారు కానీ నేను పవిత్రంగా ఇక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను ముందు నేను చెప్పేది విని మీరు అర్థం చేసుకుంటారు అపార్థం చేసుకుంటారు మీ ఇష్టం. కానీ నేను చెప్పేది ఒకసారి మీరు వినాలి అని అంటుంది. నువ్వేం చెప్తావు నీకన్నా చిన్నదైనా కృష్ణ చూడు ఈ ఇంటిని బాధ్యతగా ఎలా ముందుకు తీసుకు వెళ్తుందో తనని చూసి బుద్ధి తెచ్చుకోవాలి నువ్వు అని అంటుంది భవాని దేవి. నేను కృష్ణ గురించి మీతో ఒక విషయం చెప్పాలి,ఏం చెప్తుందో అని ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు.అగ్రిమెంట్ పెళ్లి..

ఇక రేవతి కృష్ణ ఊహించినట్టుగానే ముకుందా తన ప్రేమ విషయం చెబుతుంది.మీరు అనుకుంటున్నాట్టు వీళ్లే మంచి వాళ్ళు కాదు. ఈ కృష్ణ ఈ ఇంట్లో వాళ్ళు అంతా మిమ్మల్ని మోసం చేస్తున్నారు.మిమ్మల్ని చాలా ఈజీగా మోసం చేయొచ్చు అత్తయ్య ఈ కృష్ణ ని చూసి మీరు నేర్చుకోమన్నారు కదా ఈ కృష్ణ ఏం చేసిందో తెలుసా అగ్రిమెంటు చేసుకొని భార్యగా ఈ ఇంటికి వచ్చి కాపురం చేయడానికి మొదలుపెట్టింది. ఈ విషయం ఈ పెద్దావిడ రేవతి అత్తయ్య కూడా తెలుసు తెలిసి కూడా వాళ్ళిద్దరిని ఒకే గదిలో పెట్టి ఈవిడ చాలా మురిసిపోయింది ఆమెతోపాటు ఇంటి గౌరవం గురించి మాట్లాడుతున్నారా ఇప్పుడేమౌతుంది మీ పరువు ఈ చండాలని చూడలేక నేనే దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి నేను ప్రేమించిన వాడు ఒకవైపు పెళ్లి చేసుకోవాలనుకున్న వాడు మరొకవైపు, నేను ప్రేమించిన వాడే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నా ముందే తిరుగుతూ ఉంటే నా గుండె కోత ఎలా ఉంటుంది అత్తయ్య అని అంటుంది ముకుందా, దీంతో రేవతికి జరిగిన గతం అంతా ఒకసారి కళ్ళముందు తిరుగుతుంది. ముకుంద చెప్పింది వాళ్ళ నాన్న చెప్పింది అంతా సింక్ అవుతుంది. వెంటనే భవానీ దేవి ఇంట్లో వాళ్ళందరి మీద కోపంతో వాళ్ళు చేసిన మోసాన్ని తట్టుకోలేక కింద పడబోతు ఉంటుంది అప్పుడే అందరూ వచ్చి భవాని దేవిని పట్టుకో పోతారు కానీ మీరు ఎవరు నన్ను టచ్ చేయొద్దు దూరంగా వెళ్లండి అని ఇంట్లో వాళ్ళందరి మీద కోప్పడుతుంది భవాని దేవి. ముకుంద ఇంకాస్త ముందుకు వెళ్లి నేను మురారిని ప్రేమించాను మురారి కూడా నన్ను ప్రేమించాడు కానీ కుటుంబం పరువు గౌరవం అంటూ ఆదర్శం నన్ను పెళ్లికి ఒప్పించాడు. ఎప్పటికైనా ఈ విషయం మీతో చెప్పి మేము ఒకటవుదాం అనుకున్నాము అని కుండ బద్దలు కొడుతుంది ముకుంద. ముకుంద చెప్పిన మాటలకు భవానీ దేవితో పాటు ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు.

రేపటి ఎపిసోడ్ లో కృష్ణా మురారి కార్ లో వెళ్తూ నేను ఎప్పటినుంచో నా మనసులో ఒక విషయం దాచి పెట్టుకున్నాను ఏసీబీ సార్ ఇప్పుడు ఆ విషయం మీకు చెప్పేయాలనుకుంటున్నాను అని ఐ లవ్ యు అని చెప్తుంది. ఆ మాట పూర్తి అవ్వగానే వెనుక నుంచి ఒక లారీ వచ్చి మురారి కృష్ణ ప్రయాణిస్తున్న కారుని బలంగా ఢీకొడుతుంది. వెంటనే కారులో ఉన్న కృష్ణా మురారి రక్తంతో కారు నుంచి బయటపడతారు. కృష్ణ తలకి బాగా దెబ్బలు తగులుతాయి మురారి ముఖాన్ని అసలు చూపించరు. ఇద్దరూ చావు బతుకుల మధ్య ఉంటారు అప్పుడే అక్కడికి అంబులెన్స్ వస్తుంది దాంట్లో నుంచి కొత్తగా ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. చూడాలి అసలు ఆ ఎంట్రీ ఇచ్చింది విలనా లేక వీళ్ళకి మంచి చేయడానికి వచ్చాడా…రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..