Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో, భవానీ దేవికి నిజం తెలియడంతోకృష్ణని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తుంది.ఇంట్లో అందరూ తనని మోసం చేసినందుకుభవానీ దేవి ఇంట్లో అందరి మీద కోపంగా ఉంటుంది.భవాని దేవి ఎవరిమాటా వినకుండా రూమ్ లోకి వెళ్ళిపోతుంది.కృష్ణ ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్తుంది.

ఈరోజు 290 వ ఎపిసోడ్ లో, కృష్ణ హాస్పిటల్ లో ఒంటరిగా కూర్చుని మురారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.ఇంట్లో జరిగిన గొడవరికి తెలియదు.అప్పుడే మురారి నుంచి ఒక లెటర్ కృష్ణ కి వస్తుంది.మురారి తన మనసులో మాటని ఒక లెటర్ రూపంలో రాసి కృష్ణ హాస్పిటల్ కి పంపిస్తాడు.వాట్ బాయ్ వచ్చి మీకోసం మురారి సార్ ఒక లెటర్ పంపించారు అని ఇస్తాడు.నాకోసం లెటర్ రావడం ఏంటి అని కృష్ణ లెటర్ తీసుకొని ఎవరు పంపించారు అని చూస్తే దానిమీద మురారి పేరు ఉంటుంది.ఏసిపి సార్ కి విషయం తెలియదు కదా అయినా లెటర్ ఎందుకు పంపించారు అని ఓపెన్ చేసి చూస్తుంది.
Nuvvu Nenu Prema: అపాయంలో అరవింద.. పద్మావతి మీద నింద.. పద్మావతి ఏం చేయనుంది?

మురారి మనసులో మాట..
ఇక ఎప్పటినుంచో మురారి కృష్ణకు చెప్పాలనుకుని విషయాన్ని లెటర్ ద్వారా పంపిస్తాడు.ఇప్పుడు నేను చెప్తున్న మాట ఇంకెప్పుడూ చెప్పాలని అనుకున్నాను,నీ మనసులో ఎలాంటి భావనందో తెలియకుండా నేను చెప్పడం బాగోదని ఆగాను, ఈ మాటలు నీ ఎదురుగా ఉండి చెప్తే నువ్వు వద్దు అంటే నేను తట్టుకోలేను అసలు నేను ఇంటికి రాకపోవడానికి కారణం కూడ ఇందులో చెప్తున్నాను నీ దగ్గర నేను ఒక విషయం దాచాను నేను ఇంటికి రాకపోవడానికి కారణం ముకుందా, ముకుందని నేను అంతకుముందు ప్రేమించాను. కానీ ముకుంద ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంది నీతో కలవకుండా చేయాలని తను చూస్తుంది అందుకే మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోదాము, అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరికీ పెళ్లి అయ్యే జరిగింది. నా మనసంతా ఇప్పుడు నువ్వే నిండిపోయావు కృష్ణ ఐ లవ్ యు కృష్ణ అని రాసి ఉంటుంది. ముకుందని అంతకుముందు ప్రేమించాను కానీ ఇప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాను నా మనసులో నీకు మాత్రమే స్థానం ఉంది అని ఆ లెటర్లో ఉంటుంది. వెంటనే కృష్ణ ఆనందంతో ఆ లెటర్ ని ఒకటికి రెండు సార్లు చదువుకుంటుంది. వెంటనే కృష్ణ ఏసిపి సార్ మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అంటుంది. ఈమాట కోసం ఇప్పుడు దాకా ఎదురు చూశాను అని అనుకుంటుంది. వెంటనే ఆనందంతోఈ లెటర్ నాకు పంపించడం చాలా మంచి పని చేశారు ఇప్పుడు నాకు అర్థమైంది మీరు నన్ను ఎంత బాగా ప్రేమిస్తున్నారు అనిఈ విషయం వెంటనే రేవతి అత్తకి చెప్పాలి అని మళ్లీ తిరిగి ఇంటికి వెళుతుంది.

రేవతి ఆనందం..
ఇక కృష్ణ మురారి లెటర్ రాసిన విషయాన్ని రేవతికి చెప్పడానికి ఇంటికి వస్తుంది.అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని పరిగెత్తుకుంటూ వచ్చి రేవతిని హగ్ చేసుకుంటుంది కృష్ణ.ఏంటి కృష్ణ ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది రేవతి.అత్తయ్య నేనిప్పుడు పట్టలేని ఆనందంలో ఉన్నాను అని అంటుంది రేవతికేం అర్థం కాదు ఇంట్లో అసలే గొడవ జరిగింది ఇప్పుడు ఇదేంటి ఇంత సంతోషంగా ఉంది అని అనుకుంటుంది.ఇక అయినా బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది ఏదో జరిగింది అని రేవతి అడిగే లోపు ఈ లెటర్ చదవండి అని అంటుంది. ఆ లెటర్ రేవతి కూడా చదువుతుంది అందులో మురారి తనని ప్రేమిస్తున్నట్టు రాసి ఉండడం దాంతోపాటు ఇంట్లో నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్దాము అని రాయడం రేవతి కూడా చదువుతుంది. వెంటనే రేవతి కూడా సంతోషిస్తుంది.ఇప్పుడే ఎసిపి సారు ఒక చోటికి రమ్మన్నారు వెళ్తున్నాను అని అంటుంది ఇలానే వెళ్తావా ఏడుపు ముఖం వేసుకొని బాగా రెడీ అయి వెళ్ళు అని అంటుంది.ఇక సరే అని కృష్ణ రేవతికు ఒక్కదానికే చెప్పి ఇంట్లో నుంచి మళ్లీ వెళ్ళిపోతుంది.

ముకుంద అయోమయం..
ఇక ముకుందాతను జరిగిన పనికి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంట్లో బాగా గొడవ జరిగింది కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది నా ప్రేమ విషయం భవాని అతనికి తెలిసిపోయింది అని అన్ని విషయాలు గురించి ఆలోచించుకొని,ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది నేను చెప్పాలనుకున్న చెప్పేశాను జరగాల్సింది జరిగింది అని ఆలోచిస్తూ ఉండగా అటు నుంచి రేవతి వెళ్తూ ఉండడానికి గమనించి ముకుందా ఏమిటి ఈవిడ కోడలు వెళ్లిపోయినందుకు బాధపడుతూ ఉండాలి కానీ సంతోషంలో నవ్వుతుంది ఏంటి అని అనుకుంటుంది. వెంటనేఅత్తయ్య అని పిలుస్తుంది రేవతి కూడా అట్లానే ముకుంద ఎదురుగా వెళ్లి నిలబడుతుంది ఏమిటి అని అంటుంది ఏంటి మీ కోడలు ఇంట్లోంచి వెళ్లిపోయింది కదా మీరు బాధగా ఉండాలి కదా ఏంటి ఇలా ఉన్నారు ఆర్ యు ఆల్ రైట్ అని అంటుంది.అవును అయితే ఏంటి నీకు ఇంట్లో జరిగిన గొడవ మాత్రమే తెలుసు ముకుందా నాకు బయట జరిగేవి కూడా తెలుసు అని అంటుంది దాంతో ముకుందకు ఏమీ అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేవతి.ముకుంద ఆలోచనలో పడి అయోమయంలో ఉంటుంది.

రేవతి భయం..
రేవతి ముకుంద కి అలా సమాధానం చెప్పి,దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే మధుకర్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటి పెద్దమ్మ అని అడుగుతాడు. కృష్ణ ఇప్పుడే వచ్చి వెళ్ళింది. మురారిని కలవడానికి వెళ్ళింది తను ఎక్కడున్నాడో కృష్ణకు తెలిసిపోయింది వాళ్ళిద్దరూ దూరంగా వెళ్లాలి అనుకుంటున్నారు నేను కూడా ఇంట్లో జరిగినవేవీ మురారి కి చెప్పలేదు అందుకే దేవుడికి దండం పెట్టుకున్నాను వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కానీ సంతోషంగా ఉండాలి అని అంటుంది అప్పుడే దేవుడి ఎదుట ఉన్న దీపాలు ఆరిపోతాయి వెంటనే రేవతికి భయం వేస్తుంది. ఇదేంటి నేను దండం పెట్టుకుంటుంటే ఇలా అయిపోయాయి అని అంటుంది. ఏం కాదులే పెద్దమ్మ భయపడకండి అని అంటాడు మధు కానీ రేవతి మాత్రం మనసులో కంగారుపడుతూ ఉంటుంది. ఈ ముకుంద భారం నుంచి వాళ్ళ దూరంగా వెళుతున్నారు అనుకుంటే దేవుడు ఏంటి ఇట్లా చేశాడు ఇప్పుడు ఎలాగో అని మనసులో అనుకుంటూ ఏమి కాకుండా చూడు అని దండం పెట్టుకొని వెళ్తుంది రేవతి.
Nuvvu Nenu Prema: అపాయంలో అరవింద.. పద్మావతి మీద నింద.. పద్మావతి ఏం చేయనుంది?

ప్రభాకర్ ని అవమానించిన ముకుంద..
ఇక కృష్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని భవానీ దేవి ఆలోచిస్తూ ఉంటుంది జరిగిందంతా గుర్తుచేసుకొని బాధపడుతూ అసలు మురారి అక్కడికి వెళ్ళాడు నన్ను ఇంత మోసం చేస్తాడు. ముకుందని ప్రేమించి కృష్ణ మెడలో తాళి కట్టాడు. అసలు మురారి నిలదీయాలి అని అనుకుంటూ అందర్నీ అడుగుతుంది మురారి అక్కడికి వెళ్లారు మురారి అక్కడికి వెళ్ళాడు అనిభవానీ దేవి.ఎవరూమాకు తెలియదని చెప్తారు.అప్పుడే అక్కడికి ప్రభాకర్ వస్తాడు కిట్టమ్మా ఎక్కడున్నావు అని అంటాడు.ప్రభాకర్ రాగానే ముకుంద కూడా అక్కడికి వస్తుంది.మాకు ఇట్టమ్మ ఎక్కడుందండి అని అడుగుతాడు కానీ ఇంట్లో ఎవరు సమాధానం చెప్పరు అప్పుడే ముకుంద ప్రభాకర్ తో గట్టిగా అరుస్తుంది. సారీ మీరు మీ కృష్ణ గురించి అడుగుతుంటే ఇంట్లో లేని వాళ్ళ గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియక అరిచాను అని అంటుంది. ఇంట్లో లేని వాళ్ళు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు ప్రభాకర్. ఏంటండీ మీ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్తుంటే మీరేం మాట్లాడరు అని అంటాడు ప్రభాకర్. భవానీ దేవి రేవతి ఇద్దరు సైలెంట్ గా ఉంటారు వెంటనే రేవతి మీకు నా దండం పెట్టి చెప్తున్నాను ఇకనుంచి వెళ్ళండి మీరు అవమానపడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. ప్రభాకర్ కి ఏమీ అర్థం కాదు వెంటనే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు ముకుంద ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ల గురించి ఇలానే మాట్లాడతారు అని అంటుంది.ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటండీ అని అంటాడు.వెంటనే భవానీ దేవి మీ కూతురు చేసిన పనికి ఇంట్లో నుంచి గెంటేసాము అని అంటుంది.నా కూతురే ఏం చేసిందండి కిట్టమ్మా చాలా మంచిది తను అందరు మంచి కోరుకునేది, తను ఎవరికి కష్టం వచ్చినా కానీ వెంటనే స్పందిస్తుంది అలాంటి కిట మనీ ఇంట్లో నుంచి బయటికి నెట్టేసారా, అని ప్రభాకర్ అంటే భవానీ దేవి అవును మీ అమ్మాయి మంచిదైతే అయ్యుండొచ్చు కానీ తప్పు చేస్తే క్షమించమని అంటుంది.
రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి తో పాటు కారులో వెళ్తూ ఏసీబీ సార్ ఇప్పటిదాకా మన బంధం ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఇప్పుడు నేను మీకు నా మనసులో ఉన్న మాటని చెప్తాను అని ఐ లవ్ యు అని చెప్తుంది ఆ మాట పూర్తిగా ఒక ముందే వెనుక నుంచి లారీ వచ్చి కృష్ణ మురారి ఉన్న కార్ని బలంగా గుద్దుతుంది. వెంటనే ఆక్సిడెంట్ అవుతుంది కృష్ణ మురారి కారులో నుంచి బయటికి పడిపోతారు. అప్పుడే అంబులెన్స్ లో నుంచి ఒక వ్యక్తి కిందకు దిగుతాడు. చూడాలి రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారిలకు ఏమైందో..