Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి చేసిన చలివిడితిని అరవిందకు కడుపులో నొప్పి వస్తుంది. శ్రీమంతం జరిగే వేల ఇలా అయిందని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బాధపడతారు. అరవిందను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వస్తారు. అరవింద్ ను టెస్ట్ చేసిన డాక్టర్ ఆమె తిన్న ఫుడ్డులో పాయిజన్ కలిసింది అని చెప్తుంది.

ఈరోజు 444 వ ఎపిసోడ్ లో పద్మావతి వల్ల అలా జరిగిందని, కుచల పద్మావతిని హాస్పటల్లోనే కోప్పడుతూ ఉంటుంది. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న మీ వదినకి నువ్వు ఇలా చేస్తావా, ఏరోజైనా నిన్ను ఒక్క మాటైనా అన్నదా మేమంతా ఇంకా నిన్ను ఏదైనా అంటుంటే తను నీకు సపోర్ట్ గా నిలిచినందుకా ఇంత పని చేశావు దుర్మార్గురాలా అని తిడుతూ ఉంటుంది.శాంతాదేవి ఇప్పుడు ఎందుకు అవన్నీ అని అంటుంది కడుపు మండుతుంది అత్తయ్య నాకు ఇంకా ఇంతకన్నా ఎలా మాట్లాడమంటారు ఇప్పుడే కదా అందరి ముందు డాక్టర్ వచ్చి చెప్పింది ఆమె తిన్న ఫుడ్డులో విషయం కలిసిందని అరవింద్ కు చలివిడి పెట్టింది చేసింది ఎవరు అని అంటుంది కుచల. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు అని అంటుంది పద్మావతి. ఎందుకు నాటకాలు ఆడతావు నువ్వే కదా స్వయంగా చేసి తీసుకొచ్చావు అలాంటప్పుడు నాకేం తెలియదంటే ఎలా నమ్ముతాను అనుకున్నావు అంటుంది కుచల. అదంతా అక్కడే ఉన్న విక్కీ విని షట్ అప్ అని అరుస్తాడు. ఇది హాస్పటల్ అనుకున్నారా ఏమనుకుంటున్నారు ఒకపక్క బాగా లేక తన పరిస్థితి ఎలా ఉంటే ఇప్పుడు ఇదంతా అవసరమా ఇకనుంచి అందరూ వెళ్లిపోండి అని తిడతాడు. వెంటనే నారాయణ చెప్తున్నారు వినవు కదా నూరుపారేసుకుంటావు పదా ఇక్కడి నుంచి అని అంటాడు.

విక్కీ ప్రార్ధన..
ఇక విక్కీ బాధపడుతూ ఉంటే ఆర్య వచ్చి ఏం కాదులే నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు. లేదురా అక్కకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అక్కని ఇలా చూసి నేను భరించలేకపోతున్నాను ఎంతో సంతోషంతో శ్రీమంతం జరుగుతుంది అనుకుంటే ఇలా జరిగింది ఇప్పుడు అక్కకి ఏమన్నా అయితే నేను ఏమైపోవాలి అని బాధపడుతూ ఉంటాడు విక్కి. విక్కీ అన్న మాటలకు ఆర్యాకి కూడా ఏడుపు వస్తుంది వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతాడు. విక్కీ అక్కడే దగ్గరలో ఉన్న వినాయకుడి విగ్రహం ముందుకు వెళ్లి నించొని, దేవునికి దండం పెట్టుకుంటూ నేనే రోజు నిన్ను నమ్మలేదు నిన్ను మొక్క లేదు, ఏరోజైతే సంతోషంగా గడపాల్సిన మా అమ్మని నా నుండి దూరం చేసావో ఆ రోజు నుంచి నేను నీకు దండం పెట్టడం మానేశాను, కానీ మా కాలా కాదు ఎప్పుడూ పూజలు వ్రతాలు అని నిన్నే తలుచుకుంటూ ఉంటుంది అలాంటి మా అక్కకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.ఇప్పుడు ఆమె కోసం నేను నీ దగ్గరికి వచ్చాను తను ఎలాగైనా బతకాలి కడుపులో ఉన్న మా అమ్మ తిరిగి మా కళ్ళ ముందుకు రావాలి మా అక్క సంతోషంగా ఇంటికి రావాలి అని దండం పెట్టుకుంటూ ఉంటాడు. నేను ఈరోజు ఏ వరం కోరలేదు ఈరోజు ఈ వరం కోరుతున్నాను మా అక్కని తన కడుపులో ఉన్న మా అమ్మని నాకు క్షేమంగా అందివ్వు అని దండం పెట్టుకుంటూ ఉంటాడు.

పద్మావతి మీద విక్కీ కోపం..
విక్కీ అలా దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటే పద్మావతి వచ్చి భుజం మీద చేయి వేస్తుంది. ఏం కాదులేండి వదిన క్షేమంగానే ఉంటుంది తన కడుపులో బిడ్డకు కూడా ఏమీ కాదు అని అంటుంది. వెంటనే విక్కీకి శ్రీమంతంలో జరిగినవన్నీ గుర్తుకు వస్తాయి పద్మావతి మీకోసమే నేను దగ్గరుండి స్పెషల్గా చలివిడి చేసి తీసుకొచ్చాను వదిన మీ కడుపులో బిడ్డకి ఇది తింటే శ్రీరామరక్ష అని చెప్పి కావాలని పద్మావతి చలివిడి అరవింద నోట్లో పెట్టడం అందరూ చలివిడి తినిపించడం వెంటనే అరవింద కడుపులో నొప్పి రావడం హాస్పిటల్ కి తీసుకురావడం అన్ని వికీ కళ్ళ ముందు అలా కదులుతాయి.అవన్నీ గుర్తు చేసుకొని విక్కీ ఒక్కసారిగా కోపంగా పైకి లేచి చేయి విదిలిస్తాడు పద్మావతి ది. పద్మావతి షాక్ అవుతుంది. చేయాల్సిందంతా చేసి ఏం కాదని ఎలా నటిస్తున్నావు. నీకు మంచి మానవత్వం అసలు లేవు కదా అని అంటాడు. నీ ముఖం కూడా నాకు చూడాలని లేదు అవతలికి వెళ్ళు అని అంటాడు. నీకే చెప్పేది ఇక్కడ నుంచి వెళ్ళు అని పద్మావతిని పక్కకు తోసేస్తాడు. సారు అంత మాట అనకండి నేనే తప్పు చేయలేదు అని అంటుంది ఏ తప్పు చేయలేదని నువ్వు అబద్దం చెప్తున్నావు నువ్వు చేసిన చలివిడితిని మా అక్కకి ఇలా అయింది ఇంకా నా ముందు నాటకాలు ఆడుతున్నావా అని అంటాడు. విషం చిమ్మె నాగుపాము కి ప్రేమతో ఎన్ని పాలు పోసిన అది చివరికి విషయమే కక్కుతుంది నువ్వు కూడా అంతే అని అంటాడు. మా అక్క నీ మీద ఎంత ప్రేమ చూపించిన నువ్వు తనకి చెడే చేయాలని చూసావు అని అంటాడు. లేదు సార్ నేను ఏ తప్పు చేయలేదు కావాలంటే దేవుడు మీద ప్రమాణం చేస్తాను అని అంటుంది నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు చెబుతూ ఉంటావు.ఇది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది మా అక్కకి గానీ ఏమన్నా జరిగితే నీ అంత చూస్తాను అని పద్మావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. నేను మంచి కోరి ఇలా చేస్తే అందరూ నన్నే అంటున్నారు. నిజమైన నీకు తెలుసు కదా స్వామి ఎలాగైనా అరవింద అని ఆమె బిడ్డని కాపాడు అని దండం పెట్టుకుంటుంది.

బిడ్డకు ప్రమాదం అని చెప్పిన డాక్టర్..
ఇక అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ని విక్కీ ఎలా ఉంది మా అక్కకు అని అడుగుతాడు. ఆమె ఏమీ చెప్పకుండా అలానే నించొని ఉంటుంది డాక్టర్ మిమ్మల్ని అడిగేది మా అక్కకు ఎలా ఉంది అని అంటాడు. ఫుడ్ పాయిజన్ అవడం వల్ల ఆమె కడుపులో బిడ్డకు మేము నమ్మకం చెప్పలేము అని అంటుంది. ఆమె పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది అని అంటుంది. ఆ మాటకు విక్కీ షాక్ అవుతాడు పద్మావతి అందరూ బాధపడుతూ ఉంటారు. అయ్యో ఇప్పుడు ఎలాగో అని శాంతాదేవి బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అందరూ ఏడుస్తున్నారు నేను నటించకపోతే ఇప్పుడు నా మీద అనుమానం వస్తుంది అని కృష్ణ కూడా నటించడం మొదలుపెడతాడు. డాక్టర్ గారు మీరు ఎలాగైనా మీరు ఏదైనా చేసి నా భార్యని తన కడుపులో బిడ్డని కాపాడండి. మేము ఆ బిడ్డ కోసమే మా ప్రాణం పెట్టుకుని ఎదురు చూస్తున్నాము కావాలంటే నా ప్రాణం తీసుకొని నా అరవింద ప్రాణం కాపాడండి అని అంటాడు. కృష్ణ నిజంగానే ఏడుస్తున్నాడు అనుకోని శాంతాదేవి ఊరు ఏమీ కాదు అని అంటుంది. డాక్టర్ మేం చేతనైనంత వడికి చేస్తామండి బిడ్డకు మాత్రం మేము నమ్మకం చెప్పలేము ఏదైనా మిరాకిల్ జరిగితే గాని తల్లి బిడ్డ బతుకరుఅని చెప్తుంది. అప్పుడే నర్స్ వచ్చి అరవింద్ కి పల్స్ పడిపోతుంది డాక్టర్ అని అంటుంది వెంటనే డాక్టర్ గారి లోపలికి వెళ్తారు. విక్కీ ఏడుస్తూ ఉంటాడు.

ఆర్య బాధ
ఈ కార్య డాక్టర్ గారు చెప్పిన మాటని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన అనుతో మా అక్క ఇలా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని అనుని పట్టుకొని ఏడుస్తాడు. వదినకి ఏమీ కాదండి మీరు ధైర్యంగా ఉండండి అంటుంది అను, నీకు తెలియదు అను అక్క నన్ను ఒకలాగా విక్కీని ఒకలాగా ఏ రోజు చూడలేదు నేను సంత తమ్ముడిని కాకపోయినా విక్కీ కన్నా నన్నే ప్రేమగా చూసుకునేది. నాకు కావాల్సినవన్నీ ముందుగానే అందించేది నా కంట్లో నీరు రాకుండా నన్ను జాగ్రత్తగా చూసుకుంది. అలాంటిది ఇప్పుడు అక్కకి ఏమన్నా అవుతే నా పరిస్థితి ఏమిటి? నేను తట్టుకోలేను. మా అక్క కడుపులో బిడ్డకు ప్రమాదం అని డాక్టర్ అంటున్నారు ఆ విషయం అక్కకు తెలిస్తే అక్క అసలు తట్టుకోలేదు విన్న నాకే ఇంత బాధగా ఉంటే మా అక్క ఎలా తట్టుకుంటుంది తనకి ఏమన్నా అయితే నేనేం అయిపోవాలి విక్కి ఏమైపోవాలి అని బాధపడుతూ ఉంటాడు. అను ఆర్య కి ధైర్యం చెబుతూ ఉంటుంది అవును పద్మావతి ఎక్కడికి వెళ్ళింది మా అమ్మ మాటలకి పద్మావతి ఎంత బాధ పడిందో, అని ఆర్య అంటాడు వెంటనే అవునండి నేను కూడా పద్మావతి ఎక్కడికి వెళ్లిందా అని ఆలోచిస్తున్నాను తను ప్రేమతో చేసిన చలివిడితిని ఇలా అయింది అని అందరూ నానా మాటలు అంటే తను ఎలా తట్టుకుంటుంది తనకి ఎంత బాధగా ఉందో ఏంటో అని అంటుంది.
Nuvvu Nenu Prema: అపాయంలో అరవింద.. పద్మావతి మీద నింద.. పద్మావతి ఏం చేయనుంది?

పద్మావతి ప్రార్ధన..
ఇక దేవుడి గుడికి వచ్చి పద్మావతి అమ్మవారి ముందు నుంచొని ఆ అరవింద కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. దయచేసి నా కోరికను మన్నించి ఇద్దరు క్షేమంగా ఉండేలా చూడమ్మా, అరవింద అరవింద గారి బిడ్డ ఇద్దరు బతకాలి. నన్ను ఏ రోజు ఒక్క మాట కూడా అనకుండా ఎంతో ప్రేమగా చూసుకుంది మా వదిన అరవింద తనకు నా వల్ల ఇలా జరిగింది అని అందరూ అంటే నేనుపడే బాధ నీకు తెలుసు.దయచేసి వాళ్ళిద్దరినీ కాపాడు అని దండం పెట్టుకుంటూ ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో పద్మావతి అరవింద కోసం మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ కర్పూరం చేతిలో వెలిగించుకొని నీ తల్లి ప్రేమతో ఆ తల్లి బిడ్డల్ని కాపాడమ్మా అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడి గుడిలో పూజ చేయించి కుంకుమ తీసుకుని అరవింద ఇవ్వాలని హాస్పిటల్ కి వస్తుంది. కానీ విక్కీ అరవిందకు ఆ కుంకం ఇవ్వకుండా అడ్డుపడతాడు. నీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు మా అక్క నీడని కూడా నువ్వు తాకడానికి వీల్లేదు ఇకనుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. చూడాలి రేపటి ఎపిసోడ్లో పద్మావతి కుంకుమ అరవిందా కు చేరిందా, లేదా?