NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సతీమణి ఆమె. అలాగే ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు అమ్మాయి కానప్పటికీ ఇక్కడి ప్రేక్షకులకు అభిమాన హీరోయిన్ గా మారింది. వివాహం అనంతరం వెండితెరకు దూరమైంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు అమల అక్కినేని. ప్రస్తుతం అమ‌ల త్రోబ్యాక్ ఫోటో ఒక‌టి నెట్టింట‌ చెక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే అమల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమ‌ల పూర్తి పేరు అమలా ముఖర్జీ. 1967 సెప్టెంబ‌ర్ 12న కోల్‌కతాలో ఆమె జ‌న్మించింది. అమ‌ల తండ్రి బెంగాలీ ఇండియన్ నేవీ అధికారి కాగా.. ఐర్లాండ్ దేశస్థురాలైన తల్లి హైస్ వైఫ్‌. అమ‌ల మ‌ద్రాసులో పెరిగింది. మద్రాసులోని కళాక్షేత్ర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుండి భరతనాట్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ అందుకు అమ‌ల‌.. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చింది. 1986లో మైథిలి ఎన్నై కథలి అనే త‌మిళ సినిమాతో అమ‌ల సినీ రంగ ప్ర‌వేశం చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజ‌య‌వంతం కావ‌డంతో అమ‌ల‌కు సినిమా ఛాన్సులు క్యూ క‌ట్టాయి.

మైథిలి ఎన్నై కథలి త‌ర్వాత త‌మిళంలో అమ‌ల ఇర‌వైకి పైగా చిత్రాల్లో న‌టించింది. తెలుగులో ఆమె తొలి చిత్రం కిరాయి దాదా. 1987లో రిలీజ్ అయిన ఈ సినిమాలో నాగార్జ‌న‌, అమ‌ల జంట‌గా న‌టించారు. ఆపై వీరిద్ద‌రూ చిన‌బాబు, శివ‌, ప్రేమ యుద్ధం, నిర్ణయం వంటి సినిమాల్లో జ‌త‌క‌ట్టారు. ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ శివతో అమ‌ల భారీ స్టార్డ‌మ్ ద‌క్కింది. చిరంజీవి, వెంకటేష్‌, రాజ‌శేఖ‌ర్ వంటి అగ్ర హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవ‌కాశాలు అందుకుంది.

అలాగే హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ అమ‌ల సినిమాలు చేసింది. ప‌లు సీరియ‌ల్స్ లో యాక్ట్ చేసింది. 1992 జూన్ 11న టాలీవుడ్ కింగ్ నాగార్జున‌తో అమ‌ల ఏడ‌డుగులు వేసింది. కిరాయి దాదా మూవీ స‌మ‌యంలో నాగార్జున‌, అమ‌ల మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఫైన‌ల్ గా ఇద్ద‌రూ మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. ఈ దంప‌తుల‌కు అఖిల్ జ‌న్మించాడు. అమ‌ల కంటే ముందు వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మిని నాగార్జున వివాహం చేసుకున్నారు. అయితే నాగ చైత‌న్య జ‌న్మించిన త‌ర్వాత వీరి బంధం విడాకుల‌తో ముగిసింది.

అక్కినేని ఇంటికి కోడ‌లు అయ్యాక వెండితెర‌కు దూరంగా ఉన్న అమ‌ల‌.. దాదాపు ఇర‌వై ఏళ్లకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో న‌టిగా రీఎంట్రీ ఇచ్చారు. 2012లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఆపై 2014లో మ‌నం, 2022లో ఓకే ఒక జీవితం చిత్రాల్లో అమ‌ల క‌నిపించింది. ప్ర‌స్తుతం భారతదేశంలోని జంతు సంక్షేమం మరియు జంతు హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ కు అమ‌ల సహ వ్యవస్థాపకురాలుగా ప‌ని చేస్తున్నారు.

https://www.instagram.com/akkineniamala/?hl=en

Related posts

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju