NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

Rk Sagar: నటుడు సాగర్ అంటే గుర్తుకు రావడం కష్టమే. కానీ ఆర్కే నాయుడు అంటే మాత్రం తెలుగువారి మ‌దిలో అతని రూపం టక్కున మెదులుతుంది. తెలుగు బుల్లితెరపై ట్రెండ్ సెట్ చేసిన సీరియల్స్ లిస్ట్ తీస్తే మొగలిరేకులు అగ్రస్థానంలో ఉంటుంది. జెమినీ టీవీలో మెగా హిట్ అయిన ఈ సీరియల్ కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా యూత్ ను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే సామాన్యలతో పాటు సెలబ్రిటీలు సైతం అప్పట్లో ఈ సీరియల్ కి అభిమానులుగా మారారు. 2008 నుంచి 2013 వరకు ప్రసారమైన ఈ సీరియల్ బుల్లితెరపై పెను సంచలనం రేపింది.

అలాగే ఈ సీరియల్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడుగా నటించిన సాగర్ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయ్యాడు. సినిమా హీరోలతో సమానంగా స్టార్డమ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. అటువంటి సాగర మొగలిరేకులు ముగిసిన తర్వాత మరో సీరియల్ చేయ‌లేదు. సీరియల్స్ కు శాశ్వతంగా స్వస్తి పలికాడు. వెండితెరపై రెండు మూడు సినిమాల్లో నటించాడు. కానీ ఆ చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

ఇక చాలాకాలం నుంచి వెండితెరకు సైతం దూరంగా ఉన్న సాగర్ మళ్లీ 100 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సాగర్ పోలీస్‌ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మిషా నారంగ్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ధన్య బాలకృష్ణ ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. క్రియా ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

100 సినిమా ఫస్ట్ లుక్ ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుద‌ల చేయ‌గా.. టీజ‌ర్ ను రీసెంట్ గా మెగా మదర్ శ్రీమతి కొణిదెల అంజనా దేవి లాంచ్ చేశారు. టీజ‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే 100 సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాగర్‌.. మొగలిరేకులు తర్వాత సీరియస్ మానేయడానికి కారణం ఏంటో వివరించాడు.

`స్మాల్ స్క్రీన్ పై మొగలిరేకులు అత్యంత విజ‌య‌వంత‌మైన సీరియల్. అంద‌రికీ ఆ సీరియ‌ల్ న‌చ్చింది. అందులో నేను పోషించిన ఆర్కే నాయుడు పాత్ర బాగా క్లిక్ అయింది. నార్మ‌ల్ గా సీరియ‌ల్స్ ఫిమేల్ సెంట్రిక్ గా సాగుతాయి. కానీ మొగ‌లిరేకులు స్టోరీ మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. ఆర్కే నాయుడు పాత్రకు ఇచ్చిన రేంజ్ తర్వాత అదే రేంజ్ లో సక్సెస్ అయ్యే పాత్రలు చేయాలనుకున్నాను. మొగ‌లిరేకులు అనంత‌రం ఎన్నో సీరియ‌ల్ ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. అయితే ఆర్కే నాయుడు పాత్రను మించిన క్యారెక్ట‌ర్ మాత్రం రాలేదు. అందుకే సీరియ‌ల్స్ చేయ‌లేద`ని సాగ‌ర్ తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో సాగ‌ర్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N