NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam January 11 2024 Episode 130:  డ్రైవర్ దొరికిపోయాడాని టెన్షన్ పడుతున్న మనోహరి, మీ ఓటు మా అక్కకు వేయొద్దు అంటున్న అంజలి..

Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights

Nindu Noorella Saavasam January 11 2024 Episode 130:  చెప్తా గుప్తా గారి సంగతి అని అరుంధతి కిందికి వెళ్ళిపోతుంది. ఆ బాలిక వెళ్ళగానే నా ఉంగరం నేను తీసుకొని మా యమలోకమునకు ఆ బాలికను తీసుకుపోవలెను అని గుప్తా ఆ చెట్ల దగ్గరికి పరిగెత్తుకొస్తాడు. ఇంతలో రాథోడ్ తోటమాలి అక్కడ ఏం చేస్తున్నావ్ అయ్యా చెట్లకు నీళ్లు పట్టుకో అని అంటాడు. ఇప్పుడే పట్టి వచ్చాను సార్ అని గుప్తా అంటాడు. అయితే కొత్త మొక్కలు వచ్చాయి అవి నాటుకో అని రాథోడ్ చెప్తాడు.  అరుంధతి కిందికి వెళ్లి గుప్తా గారు గుప్తా గారు అని పిలుస్తుంది కానీ అక్కడ  లేకపోవడంతో ఈయన ఎక్కడికి వెళ్లారు అని నిలబడి చూస్తూ ఉంటుంది. ఈ నిండుకుండ రత్తని తో గొడవ పెట్టుకునే కంటే వెళ్లి మొక్కలు నాటి తర్వాత వచ్చి నా అంగుళీకము తీసుకునేదను అని గుప్తా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఏంటి బ్రదర్స్ సిస్టర్స్ ఏమైనా ఐడియా కావాలా అని అంజలి అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights

నీ బోడి ఐడియా నాకేం అక్కర్లేదు అని అమృత వెళ్ళిపోతుంది. ఏంటే నిన్న కొట్టిందా నీకి ఇవాళ రివెంజ్ తీర్చుకుంటావా అని ఆకాష్ అంటాడు. నా ఐడియా వద్దంటే వెళ్లండి బ్రదర్ అని అంజలి వెళ్ళిపోతుంది. అలా వెళ్లి స్టూడెంట్స్ దగ్గర నిలబడి మా అక్కకు మీరు ఓటు వేయకండి అని అంజలి చెప్తుంది. ఏంటి నిన్నటిదాకా మా అక్కకు ఓటేయమని మళ్లీ ఇవాళ వేయొద్దని చెప్తున్నావు అని పిల్లలు అడుగుతారు. మీరందరూ ఎలాగో బంటికే ఓటేస్తారు అప్పుడు బంటి నే గెలుస్తాడు కదా అందుకే చెప్తున్నాను మా అక్కకు మీరు ఓటు వేయొద్దు ఎందుకంటే  మగపిల్లాడు కాబట్టి  అమ్మాయి కదా ఎలా పోటీ చేసి గెలవగలుగుతుంది గెలిసిన లీడర్ గా ఎలా ఉండగలుగుతుంది అమ్మాయి కదా ఒక అమ్మాయి లీడర్ గా ఉండడం ఏంటి అని అంజలి వాళ్లతో అంటుంది. ఇదేంటి ఆనంద్ ఇది ఇలా ట్రస్ట్ ఇచ్చింది పద అక్కకు చెబుదాం అని ఆకాష్ అంటాడు. కట్ చేస్తే, మళ్లీ పోలీసులు అమరేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. కరెక్ట్ సమయానికి వచ్చారండి నేను మా ఇంటికి దొంగోడు వచ్చాడండి వాడు దొరికాడా అని అరుంధతి అడుగుతుంది. ఏంటి పోలీసులు మళ్లీ వస్తున్నారు ఒకవేళ నైట్ రౌడీ వచ్చింది చూశారా ఏంటి అతను దొరికిపోయాడా నా పేరు చెప్పాడా అని టెన్షన్ పడుతుంది మనోహరి. పోలీసులు ఇంట్లోకి వస్తూ ఉండగా ఆగండి సార్ ఆ డ్రైవర్ గురించి ఏమైనా తెలిసిందా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అని అడుగుతుంది. సారీ మేడం నేను సార్ తో మాట్లాడాలి అని ఎస్ఐ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights

రండి ఆఫీసర్స్ వచ్చి కూర్చోండి అతని అడ్రస్ ఎక్కడ ఉందో తెలిసిందా అని అంటాడు అమరేంద్ర. నిన్న నైట్ నుంచి ఇంటిని అబ్జర్వేషన్ లో పెట్టాను సార్ అంతా సీసీ కెమెరాలు పెట్టాం అని ఎస్సై చెప్తాడు. సిసి కెమెరాలు పెట్టారా అంటే నైట్ వాడొచ్చింది రికార్డ్ అయి ఉంటుందా నిజం తెలిసిపోతే అమర్ నన్ను వెంటనే చంపేస్తాడు అమర్ తో నా ప్రేమ పెళ్లి అని అడియాశలైపోతాయి ఎలా అమర్ కు నిజం తెలియకూడదు ఏదో ఒకటి చేయాలి అని మనోహరి టెన్షన్ పడుతుంది.ఎస్ఐ ఆసిసి టీవీ ఫోటేజి తెప్పించి సార్ నిన్న దొంగ మీ ఇంటికి వచ్చాడు తను అన్ని గదులు తిరిగాడు కానీ ఒక్క గదిలో మాత్రం చాలాసేపు ఉండిపోయాడు అని ఎస్ఐ చెప్తాడు. ఆ గది మనోహరిది అని అందరూ తన వైపు చూస్తారు. ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు వాడు ఎందుకు వచ్చాడు నాకు అసలు తెలియదు అని మనుహరి అంటుంది. అవును సార్ అతను అన్ని గదిలోకి వెళ్ళాడు అతని చూస్తూ ఉంటే ఎందుకో ఆ గదిలో ఎవరికోసం వెళ్లి అంతసేపు ఉన్నాడు అనిపిస్తుంది అని భాగమతి అంటుంది. వెంటనే మనోహరి కోపంతో మిస్సమ్మ ఏం మాట్లాడుతున్నావ్ అతను ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చాడు అరుంధతి ని చంపిన వాడితో  ఇంట్లో వాళ్లకి ఏంటి పని వాడు దొరికితే చంపేయాలనుకుంటామే కానీ వాడితో మాట్లాడుతామ అని మనోహరి కోపంగా టెన్షన్ పడుతూ ఉంటుంది.

Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights

మనోహరి నువ్వు ఎందుకు అంత కంగారుపడుతూనవు  మాట్లాడుతున్నావ్ నిజంగానే ఆ దొంగ ఎందుకు వచ్చాడో తెలియదు ఎవరికోసం వచ్చినట్టున్నాడు చూద్దాం ఆగు అని అమరేంద్ర అంటాడు. సార్ నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అని ఎస్సై అంటాడు. ఓకే అని ఎస్ఐ అమరేంద్ర పక్కకు వెళ్తారు. ఈఎస్ఐ పక్కకు తీసుకువెళ్లి నా గురించి ఏమైనా చెప్తాడా అని భయపడుతుంది మనోహరి. కట్ చేస్తే మీ ఇంట్లో వాళ్లందర్నీ ఎంక్వయిరీ చేయొచ్చా సార్ అని ఎస్ఐ అంటాడు. ఎందుకలా అంటున్నారు అని అమరేంద్ర అంటాడు. ఆతను ఇంట్లో ఎవరినో  కలవడానికి వచ్చాడు సార్ ఆ గదిలో అంతసేపు ఎందుకు ఉన్నాడో ఎంక్వయిరీ చేస్తే కదా తెలిసేది అని ఎస్ఐ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights

మనోహరి అలా టెన్షన్ పడుతూ మాట్లాడినందుకు మీరు డౌట్ పడుతున్నారు కానీ తను అరుంధతికి క్లోజ్ ఫ్రెండ్ తను చనిపోయినప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది తన పద్ధతే అంత అని అమరేంద్ర అంటాడు. ఓకే సార్ కానీ నేను చెప్పింది కూడా ఒకసారి ఆలోచించండి అని ఎస్ఐ వెళ్ళిపోతాడు. అసలు ఎస్సై ఎందుకు మను మీద డౌట్ పడుతున్నాడు మను అలాంటిది కాదు మా ఆయన మీద ప్రేమ పెంచుకు0ది కానీ నన్ను చంపే అంతా పగదానికి లేదు అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, అక్క అంజలి స్కూల్లో అందరికీ నీకు ఓటు వేయొద్దని చెప్తుంది అని ఆకాష్ అంటాడు. అయిపోయిందిరా ఇయాల నా చేతులు అది అని అమృతం అంటుంది. అసలు అంజలి పాపా ఏమని చెప్పింది అని రామ్మూర్తి అడుగుతాడు.

Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 11 2024 Episode 130 Highlights

అంజలి స్టూడెంట్స్ తో మాట్లాడిందంతా ఆనంద్ చెప్తాడు. అయితే అంజలి చెప్పినట్టు విను అమృత నువ్వే గెలుస్తావు అని రామ్మూర్తి అంటాడు. అలాగే తాతయ్య అని పిల్లలు అంజలి దగ్గరికి వెళ్తారు. వెళ్లేసరికి అక్కడ కూడా అంజలి వాళ్లతో అదే చెబుతుంది. అంజలి వాళ్ళని చూసి ఇప్పుడు వెళ్లి నేను డ్రాప్ అయిపోతున్నాను పోటీ చేయట్లేదని చెప్పు ఓటు నీకే వేస్తారు అని అంజలి అంటుంది. అంజలి చెప్పినట్టుగానే అమృత వెళ్లి వాళ్ళతో అంటుంది. నువ్వేమి డ్రాప్ ఐపోవద్దు ఇన్నాళ్లుగా బాయ్స్ పోటీ చేస్తున్నారు నువ్వు ఒక్కదానివే అమ్మాయివి ధైర్యంగా పోటీ చేశావు మేమందరం నీకే ఓటేస్తాం నువ్వే గెలుస్తావ్ కానీ స్టూడెంట్స్ కి నువ్వేం చేస్తావో అది చెప్పు అని పిల్లలు అంటారు. థాంక్యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అని అమృత అంటుంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఆ మాట్లాడుకుందాం స్టూడెంట్స్ కి ఏం చేస్తావో అని పిల్లలు వెళ్ళిపోతారు. నువ్వు సూపర్ అంజలి నీ ప్లాన్ భలేగా వర్క్ అవుట్ అయింది అని పిల్లలు సంతోషిస్తారు.దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella