Nindu Noorella Saavasam October 20th Episode 59: ఈ ఇంట్లో నువ్వుంటే అందరు నిన్ను చూసి గుర్తు పడతారు కదా అని అరుంధతి అంటుంది.నువ్వు ఇచటనే ఉంటివి కదా బాలిక అందుకే నేను కూడా ఈ చెట్టునే ఉండేదను అయినను నా అంగూలీకము ఇవ్వుము బాలిక అని గుప్తా అంటాడు. అయినా నీ ఉంగరం నా దగ్గర ఎందుకు ఉంటుంది అని అరుంధతి అంటుంది.అయినను ఏడు రోజుల్లో నా అంగూలికము దొరకనిచో యమలోకము నుండి ఎవరో ఒకరు నన్ను వెతుక్కుంటూ వచ్చేదరు అని గుర్తు అంటాడు అయితే ఇంకా వారం సమయం ఉందన్నమాట అని సంతోషపడుతుంది అరుంధతి. కట్ చేస్తే అమరేంద్ర ఇంకా వారి తల్లిదండ్రులు భాగమతి మరియు అరుంధతి మధ్య ఒకే తీరుగా మాట్లాడడం గురించి ఆలోచిస్తారు ఏమైంది రా నాన్న అని అమరేంద్ర వాళ్ల తల్లి అడుగుతుంది

ఏం లేదమ్మా అని అమరేంద్ర అంటాడు నువ్వు ఎంత పెద్దవాడివైనా పెళ్లయిన పిల్లలు ఉన్న నాకెప్పుడూ బుల్లి అమరేంద్రవి నాన్న పైకి ఏం లేదన్నా నీ మనసులోని బాధ నీ కళ్ళలో కనబడుతుంది రా అని అమరేంద్ర తల్లి అంటుంది ఆ మిస్సమ్మ మాట్లాడిన మాటలు ఆరని గుర్తు చేశాయి ఆ అమ్మాయి అచ్చo ఆరు లాగానే మాట్లాడుతుంది కదా అమ్మ అని అమరేంద్ర అంటాడు అవును నాన్న అని తల్లి అంటుంది ముగ్గురం ఒకేలా ఆలోచిస్తున్నాం అని వారి తండ్రి అంటాడు. ఆరు నాతోనే ఉన్నట్టు అని పిస్తుంది అమ్మ అని అమరేంద్ర అంటాడు.ఎందుకే మను ఇంకా ఇంకా నా దృష్టిలో దిగజారిపోతున్నావు అసలు నువ్వు నా మనువ్వేనా ముందు నుంచి నువ్వు ఇలానే ఉన్నా నేను చూడలేకపోయానా నీ నుంచి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను అని అరుంధతి అనుకుంటుంది.అమరేంద్ర రెండో పెళ్లి గురించివారి తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు.

కట్ చేస్తే ఎలా ఉండేవాన్ని ఎలా అయిపోయాను మా లోకంలో యమపురివాసులు నన్ను చూసి గజగజ వనికేవారు కానీ ఇక్కడ భూలోక వాసులు పెట్టే బాధలకినేను గజగజ వణుకుతున్నాను అని గుప్తా అనుకుంటాడు. బాలిక అని గుప్త అంటాడు బాధలో ఉన్నాను గుప్తా ప్లీజ్ వెళ్ళిపోండి వెళ్లి మీ తోట పని చేసుకోండి అని అరుంధతి అంటుంది ఆ తోట పని నాకు బహుప్రీతి భూలోకం వచి తోట పని చేస్తున్నాను అని గుప్తా అంటాడు. అబ్బా కాసేపు సైలెంట్ గా ఉండండి గుప్తా బాధగా ఉంది నాకు అని అరుంధతి అంటుంది. చెబితే వింటివా మా లోకంలోకి త్వరగా వెళ్దామా బాలిక అంటే వినలేదు ఇక్కడనే ఉంటే బాధలు కష్టాలు ఉంటాయి మనము ముందే వెళ్ళమని చెప్పితిని కానీ ఏమి చేద్దాం సమయం చూసి నా అంగుళీకమును తస్కరించితిరి అని గుప్తా అంటాడు నేను ఇంత బాధలో ఉంటే నీ ఉంగరం గోలేటి అని అరుంధతి అంటుంది.

ఎవరి బాధలు వారివి సోకించకు బాలిక ఏమైందో చెప్పుము నీ బాధలు వినడానికి నేను మిస్సమ్మ కాకా ఇంకెవరున్నారు చెప్పు బాలిక అని గుప్తా అంటాడు.పెద్దకర్మ అయి రెండు రోజుల కాలేదు అప్పుడే ఏం తొందర వచ్చిది అరే అప్పుడే ఆలోచించాల్సిన అవసరం ఏమేమి వచ్చింది అరే ఆయనకే అంత తొందర లేనప్పుడు వీళ్ళకి ఎందుకు అంత తొందర అని అరుంధతి అంటుంది. బాలిక చెప్పినచో వివరముగా చెప్పుము లేనిచో వదిలేయము ఇప్పటినుండి అసలు విషయం చెప్పకుండా అటు ఇటు తిప్పుతున్న వూ అని గుప్తా అంటాడు. మా ఆయనకి మా అత్త మామలు రెండో పెళ్లి చేస్తారంట అయినా ఆయనకి ఇప్పుడే రెండో పెళ్లి చేయడం అవసరమంటావా గుప్తా గారు మర్చిపోయాడ మరి పిల్లలుని ఏం చేస్తాడు కొంపతీసి మనోహర్ని గాని చేసుకుంటాడా ఏంటి అసలు ఎవరితో పెళ్లి చేద్దామని మా అత్తమామలనుకుంటున్నారు అని అరుంధతి అంటుంది.

బాలిక నా ఉంగరం ఇచ్చినచో నేను నదికి పోవలెను ఇవ్వుము నా అంగుళయ్యకము అనే గుప్తా అంటాడు. అరే నేనేదో తీసినట్టు నన్ను అడుగుతారు ఏంటి గుప్తా గారు మీరు ఎక్కడో పడేసుకొని ఉంటారు వెళ్లి వెతకండి లేదంటే నదికి పోండి అయినా గుప్తా గారు మా ఆయన కి పెళ్లి చేసె అమ్మాయి ఎవరు మీకు తెలిసే ఉంటుంది కదా చెప్పొచ్చు కదా అని అరుంధతి. అంటుంది. బాలిక నిజమో తెలిచిన చెప్పరాదు ఎందుకని నా అంగూలీకము నా దగ్గర లేదు కాబట్టి నాకు నిజము తెలియదు తెలిసినచో దేవ రహస్యము చెప్పరాదు అని గుప్తా అంటాడు.అయితే మీరు ఇక్కడ ఎందుకు నదికి వెళ్ళండి అని అరుంధతి అంటుంది.

అరుంధతి అలా అనగానే గుప్తా గారు బయలుదేరుతాడు కానీ మళ్ళీ వెనకకు వచ్చి బాలిక మనోహరి గురించి నీకు నిజము తెలిసినచో ఆ బాలికను నువ్వు బయటికి వెళ్ళగొడతావని అనుకుంటిని కానీ తనను వెళ్ళగొట్టకుండా ఇక్కడే స్థిరంగా ఉండేటట్టు తను ప్లాన్ వేస్తుంది కానీ నువ్వు ఎందుకు ఇంకా ఉపేక్షించి చూస్తున్నావు తను నీ ఫ్రెండ్ అని జాలి పడుతున్నావా బాలిక అని గుప్తా అంటాడు. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు గుప్తా గారు అని అరుంధతి అంటుంది. మీ ఆయనకి పెళ్లి చేద్దామని మీ అత్తమామలనుకుంటున్నారు కానీ ఈ బాలికతో చేస్తే నీ పిల్లలు ఆగమైపోతారు నీ కుటుంబం ఆగమైపోతుంది త్వరపడు లేదంటే నీ ఆత్మ ఇంకా గోచిస్తుంది వాళ్ళ కష్టాలను చూసి అని గుప్తా గారు అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది