Trinayani October 20th Episode 1063: అత్తయ్య బయటికి అయితే వెళ్లలేదు ఫోన్ కూడా మాట్లాడలేదు నేను ఇక్కడే హాల్లోనే ఉన్నాను బావగారు అని సుమన అంటుంది. మీరెవరు కంగారు పడకండి నేను అమ్మకి ఫోన్ చేస్తాను అని విక్రాంత్ ఫోన్ చేస్తే హాల్లోనే మోగుతూ ఉంటుంది వెతకండి అని అంటాడు. అందరూ ఎక్కడ ఉందనే హాలంతా వెతుకుతారు కానీ తిలోత్తమ కనిపించలేదు. ఇదిగో ఇక్కడ ఒక మూట కనపడుతుంది చూడండి ఇందులో ఉందేమో అని దూరOదరు అంటుంది.మా అమ్మ ఏమైనా పిచ్చిదా మూట కట్టడానికి అని వల్లబా అంటాడు. సరే చూస్తే తెలుస్తుంది కదా అని తీసి చూస్తే తిలోత్తమ స్పృహ కోల్పోయి ఉంటుంది. అమ్మ నీకేమైంది అని విశాల్ అంటాడు. పోయిందా త్వరగా వెళ్లి రెండు దండలు తీసుకురండి ఒకటి అత్తయ్య మెడలో వేద్దాం ఒకటి ఫోటో మీద వేద్దామని హాసిని అంటుంది.

అంటే మా అమ్మ స్వర్గానికి అప్పుడే పోయిందంటావా అని వల్లభ అంటాడు. మీ అమ్మ ఏమైనా అమీర్పేట షాపింగ్ మాల్ కి వెళ్ళింది అనుకుంటున్నారా అంత ఈజీగా పోయిందని అంటున్నవ్ పాపాత్ములకి సూది మోపి నoత స్థలం కూడా ఉండదు అంట స్వర్గంలో అని హాసిని అంటుంది. వదిన నువ్వు టెన్షన్ పెట్టకు అని విక్రాంత్ అంటాడు. నువ్వు వెళ్లి నీళ్లు తీసుకురా వదిన అని విశాల్ అంటాడు. హాసిని నీళ్లు తెచ్చి మొహం మీద చల్లండి అని ఇస్తుంది. మొహం మీద నీళ్లు చల్లి అమ్మ అమ్మ అని ముగ్గురు కొడుకులు పిలిచిన అరిచిన ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటుంది. గురూజీ ఎంత లేపిన అమ్మ లేవట్లేదు ఏం చేయాలో చెప్పండి అని విశాల్ అంటాడు. ఏముంది విశాల గాయత్రీ పాదం తీసి తిలోత్తమ నుదుటి మీద ఉంచండి తనకి మేలుకు వస్తుంది అని స్వామీజీ అంటాడు.

ఇది విడ్డూరం కాకపోతే గాయత్రీ తో అత్తయ్యని తన్నిస్తే ట్రీట్మెంట్ ఎలా అవుతుంది తను ఎలా లేచి కూర్చుంటుంది అని సుమన అంటుంది. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా నువ్వేంటి చెల్లి అలా అంటావ్ అని హాసిని అంటుంది.తను అలాగే అంటుంది కానీ నువ్వు గాయత్రి పాదం తిలోత్తమ వదిన నుదిటి మీద ఉంచు నైని అని దూరందర అంటుంది.అలాగే పిన్ని అని గాయత్రి ని తీసుకువచ్చి త్రిలోత్తమ నుదుటిమీద గాయత్రి పాదం పెడుతుంది. అలా రెండు నిమిషాలు ఉంచేసరికి స్పృహ వస్తుంది కళ్ళు తెరిచిన తిలోత్తమ ఏంటి నైని గాయత్రీ తో నన్ను తన్నిస్తున్నావు తీ అనే పాదం పట్టుకుని కిందికి లాగుతూ ఉండగా గొంతు మీద కాలేసి గాయత్రీ తొక్కుతుంది.

నై ని అమ్మ గొంతు మీద కాలు గట్టిగా పెట్టింది పాప లాగు అని విశాల్ అంటాడు. నేను లాగుతున్నాను బాబు గారు రావట్లేదు అని నైని అంటుంది. గట్టిగా లాగండి అమ్మ చనిపోతుంది అని వల్లభా అంటాడు. అందరూ పాపని తిలోత్తమని గట్టిగా పట్టుకొని లాగుతారు కానీ ఎంత ప్రయత్నించినా గాయత్రి పాదం తిలోతమ గొంతు మీద నుంచి తీయలేక పోతారు. ఇదే సమయం అనుకొని గాయత్రి తిలోతమని చంపే ప్రయత్నం చేస్తుంది అని స్వామీజీ తన మనసులో అనుకుంటాడు. చిన్నపిల్లని కూడా లాగలేకపోతున్నాం చూశారా మనం ఎంత వీక్ గా ఉన్నామో అని హాసిని అంటుంది. ఓసి నీ మొహం మండ ఈ టైంలో జోకులు ఏంటే అని దూరందర హాసిని ని తిడుతుంది.గొంతు మీద కాలు ఉండేసరికి తిలోత్తమ కి ఊపిరి ఆడక ప్రాణం పోయినంత పని అవుతుంది.వల్లభ లేచి గాయత్రీ ని గట్టిగా పట్టుకొని లాగేస్తాడు. అప్పుడు అందరూ కింద పడిపోతారు.

ఏవండీ నేను పైన ఉన్నాను మీకు కాఫీలు టిఫిన్లు ఏమైనా కావాలా అని కుల్లు జోకులు వేస్తుంది హాసిని. ముందు నువ్వు లేవవే పైకి బరువేస్తుంది అని దురంధర అంటుంది. ఓ అవును కదా సారీ అని హాసిని పైకి లేస్తుంది.మమ్మీ ఈరోజు నువ్వే కాదు నేను కూడా చచ్చి బ్రతికాను అని వల్లభ అంటాడు. పాప గొంతు మీద కాలు పెట్టి గట్టిగా నొక్కేసరికి ఊపిరి ఆడలేదు రా ప్రాణం పోయినంత పని అయ్యింది అని తిలోత్తమా అంటుది. అమ్మ పాప పాదం తీయాలని నువ్వు పక్కకు జరిపేసరికి అనుకోకుండా గొంతు మీద పడింది అంతే అని విశాల్ అంటాడు. పాప కాదు విశాల్ గాయత్రి అని స్వామీజీ అంటాడు. పేరు మాకు తెలుసులే స్వామి ఆని తిలోతమ అంటుంది. అత్తయ్య నువ్వేమి పిల్లల కోసం ప్రాణత్యాగం చేయక్కర్లేదు పిల్లలే నీ ప్రాణం తీసేలా ఉన్నారు అని సుమన అంటుంది. ఏదైతేనేం గొంతుకు మందు రాసుకుంటే గాని ఏమీ మాట్లాడలేను అని తిలోత్తమ అంటుంది. అన్నయ్య అమ్మ ను లోపలికి తీసుకువెళ్ళు అని విక్రాంత్ అంటాడు. దెబ్బలకి మందు రాసుకుందాం అని వల్లభా అమ్మని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే మమ్మీ గాయత్రి పాపని అందరం పట్టిన లాగలేకపోయాం కారణం ఏమై ఉంటుంది అని వల్లభా అంటాడు. ఏమో నాకేం తెలుస్తుంది రా నొప్పిగా ఉంది అని కిలోత్తమ అంటుంది. ఇంతలో హాసిని వచ్చి అత్తయ్య మీకు ఆయిల్ తో మసాజ్ చేస్తాను నొప్పి తగ్గిపోతుంది అని ఆయిల్ తీసి మెడకు రాస్తూ కిందికి పైకి ఊపుతూ మెడను గట్టిగా నొక్కుతూ మర్దన చేస్తూ ఉంటుంది. రేయ్ ఇది చంపేసేలా ఉంది ఇలాగే రా దీన్ని అని తిలోత్తమ అంటుంది. వదలవే మా అమ్మని అని వల్లభా అంటాడు. హాసిని ఎంతకు వదిలిపెట్టక పోయేసరికి తిలోత్తమ లేసి ఉండవే నిన్ను చంపేస్తా నేను అని అంటుంది. హాసిని తిలోత్తమ కి దొరకకుండా పరిగెడుతుంది. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది పిల్లలకు పాలు పట్టలేక పోతున్నాం నవరాత్రులు మొదలయ్యాయి ఒక్క పూట పాలు తాగకపోతే అల్లాడిపోతారు రోజంతా ఎలా ఉంటారు అని నైని అంటుంది. స్వామీజీ విశాలాక్షి చెప్పిన రోజు మొదటి రోజే అవుతుందని నేను ఊహించలేదు అని విశాల్ అంటాడు.

వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా తినోత్తమ పిల్లలకు పాలు పడితే కక్కేలా చేశాను కదా అని తిలోత్తమ తన మనసులో అనుకుంటుంది. నైని ఉలోచికి నీ పాలు పట్టు అని హాసిని అంటుంది. నాకు తుర్కి ఎవరూ పాలు పట్టణ అవసరం లేదు ఒక్క పూట కాదు రోజంతా ఇలానే ఉంటుంది అని సుమన అంటుంది. నువ్వైతే ట్యాంక్ మెక్కుతావు కదా మరి పిల్ల గురించి ఏమీ ఆలోచించవేంటి అని విక్రత్ అంటాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మీమాలోచిస్తుంటే మధ్యలో మీ గొడవ ఏంటి అని నైని అంటుంది. అంతా మంచికే జరుగుతుంది నైని అని స్వామీజీ అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది