Escape Room 2 Review: సైకలాజికల్ అండ్ సర్వైవల్, మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఆ సినిమా పేరు ఎస్కేప్ రూమ్. 2019 సంవత్సరంలో వచ్చిన మంచి ఆదరణ పొందిన ఈ సినిమాకు 2011లో సీక్వెల్ తెరకెక్కింది. అడమ్ రబిటెల్ దర్శకత్వం వహించిన ఈ ఎస్కేప్ రూమ్ మూవీ ఇటీవల నెట్ఫ్లిక్స్ ఓటిటిలో తెలుగులో విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే ఓటీటీలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఎస్కేప్ రూమ్ 2. ఇక ఇందులో రస్సెల్, లోగన్, ఇసాబెల్లె, డెబోర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఒక డెత్ గేమ్ ట్రాప్ లో పడిన ఆరుగురు వ్యక్తుల చుట్టూ ఈ మూవీ కథ తిరిగింది.
ఎస్కేప్ రూమ్ 2 కథాంశం:
ఎస్కేప్ రూమ్లో జరిగిన కథ చెబుతూ ఎస్కేప్ రూమ్ 2 స్టార్ట్ అవుతుంది. డెత్ గేమ్ నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ జోయీ డేవి డేవిస్( టెలర్ రస్సెల్) , బెన్ మిల్లర్ (లోగన్ మిల్లర్) ప్రాణాలతో బయటపడతారు. ఈ గేమ్ లో ఉన్న స్నేహితులు చనిపోవడాన్ని తలుచుకుని బాధపడతారు. దీనంతటికీ కారణమైన మినోస్ అనే సంస్థ లేదా వ్యక్తిని పట్టుకోవాలని వీరు ప్రయత్నిస్తారు. ఈ గేమ్ ఆడేందుకు ఉపయోగించే కొన్ని కోడ్స్ సహాయంతో మెక్సి కోలో నీ ఓ ప్రాంతానికి వెళ్తారు. ఎస్కేప్ రూమ్ సినిమాలో జరిగిన కథ చెబుతూ ఎస్కేప్ రూమ్ 2 స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక అక్కడ అనుకోకుండా ఒక మెట్రో స్టేషన్ లో చిక్కుకుంటారు. కానీ అది మినోస్ వేసిన ట్రాప్ అని తెలుసుకుంటారు. ఆ ట్రైన్ లో వారితో పాటు ఇదివరకు డెత్ గేమ్ ఆడి ప్రాణాలతో బయటపడిన మరో నలుగురు ఉండడంతో షాక్ అవుతారు. ఆ నలుగురు మరోసారి ప్రాణాలు కాపాడుకునేందుకు పజిల్స్ సాలు చేయడంతో సినిమా కథలోకి వెళ్తారు. మరి ఈసారి డెత్ గేమ్ నుంచి ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు? ఆ ఆరుగురికి ఉన్న గతం ఏంటి? డెత్ గేమ్ వాళ్ళ వారు ఎలాంటి మానసిక స్థితికి లోనయ్యారు? అసలు మినోస్ ఎవరో తెలిసిందా? హనీ కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది.
విశ్లేషణ:
ముందుగా చెప్పినట్లు మొదటి పార్ట్ ఎస్కేప్ రూమ్ లో ఏం జరిగింది.. జోయీ, బెన్ ఎలా బయటపడ్డారని విషయాలతో రెండో పార్ట్ ప్రారంభం అవుతుంది. తరువాత వారి మెంటల్ కండిషన్ స్థిమితంగా చేసుకోవడం.. తమ స్నేహితులను బలి చేసుకున్న వారిపై రివెంజ్ తీసుకునేందుకు ఇద్దరు మెక్సికోకు వెళ్లడంతో సినిమా కథలోకి వెళ్తాం.
ప్రేక్షకుల ఒపీనియన్:
ఇక ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వినిపిస్తుంది. కొత్త కథాంశంతో వచ్చారని పలువురు ట్వీట్స్ కూడా చేస్తున్నారు. గతంలో లేని విధంగా ఈ మూవీ యొక్క ట్విస్టులు ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. మంచి కథనంతో వచ్చినవారికి ఎప్పుడూ విజయాలే దక్కుతాయని ఈ సినిమాతో ప్రూవ్ అయింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ మూవీ సూపర్ హిట్ అంటూ ట్వీట్ లు పెడుతున్నారు.