Paluke Bangaramayenaa January 26 2024 Episode 135: స్వరని కిడ్నాప్ చేస్తావో మాయ చేసావో మత్లబ్ చేస్తావో నీ ఇష్టం కానీ కీర్తికి మాత్రం ఏం అవ్వకూడదు అని అంటుంది వైజయంతి. నేను అలాంటి వాణ్ని కాదు అత్తయ్య నేను స్వరను తప్ప వేరే ఒక అమ్మాయిని చూడను నేను క్యారెక్టర్ ఉన్న వాడిని అని అంటాడు విశాల్. పెళ్లి చేసుకొని తీసుకొస్తావా తీసుకొచ్చాక పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు రంగరాజు. స్వరని తీసుకొచ్చి వైజయంతి గారికి అప్పజెప్తాను అప్పుడు వైజయంతి గారు ఏది చెప్తే అది చేస్తాను అని అంటాడు విశాల్. విశాల్ పని పూర్తి చేసుకొని వస్తానని వెళ్ళిపోతాడు. అభిని కంట్రోల్ చేస్తే తప్ప స్వరని మనం కిడ్నాప్ చేయలేం అని అంటాడు రంగరాజు.
విశాల్ నమ్మకం చూస్తుంటే తీసుకొస్తాడు అని నాకు అనిపిస్తుంది అని అంటుంది వైజయంతి. నేను విశాల్ ని నమ్మను కానీ మీ నమ్మకాన్ని నమ్ముతాను అని అంటాడు రంగరాజు. కట్ చేస్తే, కీర్తి స్వర సూపర్ మార్కెట్ కి వెళ్తారు. అభి డబ్బులు తీసుకొని అక్కడికి వస్తాడు.ఇలాంటిది ఏమైనా ఉంటే ముందే చెప్పొచ్చు కదా కీర్తి సమయానికి నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది అని అంటాడు అభి. కీర్తి డబ్బులు కట్టేస్తుంది. కీర్తి తన ఫ్రెండ్ ని చూసి తన దగ్గరికి వెళ్లి మనిద్దరం ప్రాజెక్టుకు సంబంధించిన మెటీరియల్ తీసుకుందాము అని అంటుంది. సరే అని తన ఫ్రెండ్ అంటుంది. అన్నయ్య మీరు వెళ్లిపోండి నేను మా ఫ్రెండ్ తో మెటీరియల్ తీసుకొని వస్తాను అని అంటుంది కీర్తి. కీర్తి మన ముగ్గురం కలిసి వెళ్దాం అని అంటాడు అభి.
నా మాట విను అన్నయ్య నేను నా ఫ్రెండ్ తో వచ్చేస్తాను తను నాకోసం ఎదురు చూస్తుంది అని వెళ్ళిపోతుంది కీర్తి. విశాల్ సూపర్ మార్కెట్ కి వచ్చి చూస్తే అభి ఉంటాడు. అత్తయ్యకీర్తి స్వర ఇద్దరు మాత్రమే ఉంటారని చెప్పింది కానీ అభి ఉన్నాడని కారులో కూర్చుంటాడు. అభి స్వర సూపర్ మార్కెట్ బయటికి వస్తారు. నన్ను కొంచెం ఇంటిదగ్గర డ్రాప్ చేయండి అని అంటుంది స్వర. సరే బండి ఎక్కు అని అంటాడు అభి. ఇద్దరు కలిసి బండి మీద వెళ్తారు ఏంటి అంటే కలిసిపోయారా అని అనుకుంటాడు విశాల్.
అభి స్వర వెళ్తుంటే వాళ్ళని ఫాలో అవుతాడు విశాల్. స్వర కొబ్బరి బొండం చూసి అభి సార్ తో జ్యూస్ తాగితే బాగుంటుంది అని బండి ఆపమంటుంది. దాహంగ ఉంది వెళ్లి కొబ్బరి బోండం తీసుకురండి అని అంటుంది స్వర. నాకు చాలా నీరసంగా ఉంది వెళ్లి తీసుకురండి ప్లీజ్ అని అడుగుతుంది స్వర. దారిని వెళ్లే ఎవరో ఒక అమ్మాయి అనుకొని సాయం చేయండి అని అంటుంది స్వర. అభి వెళ్లి రెండు బోండాలు తీసుకొని వస్తాడు. ఇద్దరు తాగుతారు. అది చూసి కారులో ఉన్న విశాల్ కోపంతో రగిలిపోతాడు. ఇక లాభం లేదు వీరిద్దరూ కలిసిపోయారు ఈ విషయం వైజయంతి అత్తయ్యకి చెప్పాలని విషయాలు వెళ్లిపోతాడు. స్వర అక్కడ ఒక పోలీస్ బొమ్మను చూసి అది కొనుక్కోవాలి అనుకోని అభిని తీసుకొని వెళుతుంది. ఈ బొమ్మ మీలాగే అందంగా ఉంది కదా అని అంటుంది స్వర. ఆ బొమ్మను అభిని కొనివ్వమని అడుగుతుంది. అభి ఆ బొమ్మకి కొంటాడు. ఇద్దరూ వెళ్ళిపోతారు.కట్ చేస్తే, వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది.
దేని గురించి కంగారు పడుతున్నావు వైజయంతి అని అడుగుతాడు రంగరాజు. అంతా తెలిసి కూడా ఎందుకిలా మాట్లాడుతున్నారు అని అంటుంది వైజయంతి. నాకేమీ తెలియదు అమ్మ అని అంటాడు రంగరాజు. మన ముగ్గురికి ఉన్న ప్రాబ్లం తెలుసు కదా అని అంటుంది వైజయంతి. నాకేమీ సమస్య లేదమ్మ అని అంటాడు రంగరాజు. నీకు విశాల్ కి సమస్య స్వర.తను ఎక్కడ అభితో నిజం చెబుతుందో అని మీరు భయపడుతున్నారు స్వర చెప్పకుండ ఉండడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు దానికి నాకే సంబంధం లేదు అని అంటాడు రంగరాజు. మీరు భలేగా మాట్లాడుతున్నారు రంగరాజు అని అంటుంది వైజయంతి. నేనేమి తప్పుగా మాట్లాడానమ్మ అని అంటాడు రంగరాజు.
మన ముగ్గురం కలిసి ఒక టీం అనుకున్నాం కదా ఇప్పుడు మీరు వేరే అని అంటారు ఎందుకు అని అంటుంది వైజయంతి. నేను నా మంచి కోసం చూస్తాను కానీ నేను సమస్యలు ఇరకాలని అనుకోను కదా అమ్మ అని అంటాడు రంగరాజు. మీకు మంచి జరుగితే నాకు మంచి జరుగుతుంది అని అంటాడు రంగరాజు.ఇంతలో విశాల్ వస్తాడు. వీడేంటివి రంగరాజు గారు వెళ్లేటప్పుడు వీరుడిలా వెళ్లాడు అని అంటుంది వైజయంతి. ఏమైంది విశాల్ ఏదో పొడి చేస్తాను అని అన్నావు ఇప్పుడు ఏమైంది అని అంటాడు విశాల్. స్వర కీర్తితో బయటికి వెళ్లిందని చెప్పారు కదా స్వర బయటికి వెళ్లి నిజమే కానీ తను అభితో వెళ్ళింది అని చెప్తాడు విశాల్. అది విన్న వైజయంతి రంగరాజు షాక్ అయిపోతారు.
Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!