NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Sherin Shringar: ఒక‌ప్పుడు హీరోయిన్ గా స‌త్తా చాటిన షెరిన్ శృంగార్ ఇప్పుడు అవ‌కాశాలు లేక ఎలాంటి స్థితిలో ఉందో తెలుసా?

Sherin Shringar: సినిమా పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హిట్స్ ఉన్నప్పుడే అవకాశాలు వస్తాయి. ఒక్కసారి వరుస ఫ్లాపుల్లో కూరుకున్నారంటే.. ఐరన్ లెగ్ అనే ట్యాగ్‌ వేసి ఆ హీరోయిన్లను పక్కన పెట్టేస్తుంటారు. షెరిన్ శృంగార్‌ కూడా ఆ కోవకే చెందుతుంది. ఒకప్పుడు హీరోయిన్ గా సత్తా చాటిన షరీన్ కు ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు క‌రువ‌య్యాయి. షెరిన్ బెంగ‌ళూరులో పుట్టి పెరిగింది.

చిన్న‌త‌నం నుంచి న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తితో ఆమె ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేసింది. 2002లో వ‌చ్చిన క‌న్న‌డ మూవీ పోలీస్ డాగ్ ద్వారా షెరిన్ త‌న సినీ ప్ర‌యాణాన్ని ప్రారంభించింది. అదే ఏడాది ధృవ మూవీలో ద‌ర్శ‌న్ తో క‌లిసి న‌టించింది. అలాగే తుళ్లువదో ఇలామై చిత్రంతో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. కస్తూరి రాజా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ధ‌నుష్‌, షెరిన్ జంట‌గా న‌టించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించింది.

ఈ మూవీతో షెరిన్ అత్యంత ప్ర‌జాద‌ర‌ణ సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాత కొన్నాళ్లు ఆమె వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. జ‌య‌, స్టూడెంట్ నెం.1, విజిల్, కోవిల్‌పట్టి వీరలక్ష్మి, మూన్నామథోరల్, భూప‌తి, భీమా, పూవా తాళయ్య.. ఇలా త‌మిళ్, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప‌లు విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించింది. తెలుగులో కూడా రెండు సినిమాలు చేసింది. అల్లరి న‌రేష్ తో జూనియ‌ర్స్‌, డేంజ‌ర్ వంటి చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే 2009 నుంచి ఆమెకు వ‌రుస ప‌రాజ‌యాలు ప్రారంభం అయ్యాయి.

దాంతో మెల్ల‌మెల్ల‌గా షెరిన్‌కు అవ‌కాశాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. 2015 త‌ర్వాత సినిమాల్లేక ఆమె వెండితెర‌కు పూర్తిగా దూర‌మైంది. దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని త‌మిళ్ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. త‌న‌దైన ఆట‌తీరుతో ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరిన షెరిన్‌.. ర‌న్న‌ర్‌గా నిలిచింది. బిగ్‌బాస్ త‌ర్వాత కోలీవుడ్ లో అడ‌పా త‌డ‌పా టీవీ షోస్‌లో కనిపిస్తూ అల‌రిస్తోంది. గ‌త ఏడాది ర‌జ‌నీ అనే మూవీని ప్ర‌క‌టించింది. విజ‌య్ స‌త్య ఇందులో హీరో కాగా.. ఇంత‌వ‌ర‌కు ఈ చిత్రం విడుద‌ల‌కు నోచుకోలేదు.

Related posts

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri