zee telugu kutumbam awards 2023:ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో జీ తెలుగు ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిందని చెప్పవచ్చు. ఏపీ మరియు తెలంగాణలో అందరికీ మంచి మంచి సీరియల్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తున్న ఛానల్ జీ తెలుగు. ఇటీవలే జీ తెలుగు ప్రతిష్టాత్మకంగా కుటుంబం అవార్డ్స్ 2023ను నిర్వహించింది. పార్ట్ వన్ చాలా గ్రాండ్ గా జరగా ఎంటర్టైన్మెంట్ లో ఎవరికి వారు బాగా సందడి చేశారు. రవి శ్యామల యాంకర్స్ గా చేసిన పార్ట్ వన్ లో అతిరథ మహారధులు అందరూ సభని అలంకరించి పార్ట్ వన్ చాలా నిండుగా చాలామందికి అవార్డ్స్ అందించింది. పుట్టింటి వెలుగు, ఆత్మీయ పురస్కారం, బెస్ట్ కపుల్ ఉత్తమ కొడుకు ఉత్తమ కోడలు ఇలా చాలా అవార్డులను పార్ట్ వన్ లో అందించారు.జయప్రద, అనసూయ రేష్మి ఇలా చాలామంది డాన్స్ తో ప్రేక్షకులను అలరించారని చెప్పవచ్చు. పార్ట్ వన్ తర్వాత ఇప్పుడు పార్ట్ 2 కూడా నవంబర్ 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారమైంది. పార్ట్ వన్ కంటే పాటు టూలో ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని చెప్పొచ్చు.

కుటుంబం అవార్డ్స్ పార్ట్ 2 లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నాచురల్ స్టార్ నాని, బుల్లితెర హోస్ట్ సుమ, రాజీవ్ గౌతమి సంయుక్త మీనన్ సుహాస్ పాయల్ రాజ్ పుత్ తరుణ్ భాస్కర్, ఇలా బుల్లితెర నటులతో పాటు, వెండితెర నటులు కూడా సందడి చేశారు. రాంగోపాల్ వర్మ కు జీ తెలుగు టాలెంట్ షో నటీనటులందరూ ఘనంగా స్వాగతం పలికారు. రాంగోపాల్ వర్మ జీతెలుగు, చానల్ ను ప్రశంసించి, అందరినీ ఆకట్టుకునే విధంగా, రాంగోపాల్ వర్మ మాట్లాడారు. తండ్రి కొడుకుల మధ్య ఘాడమైన బంధాన్ని ప్రతిపాదించేలాగా, హృదయానికి అడ్డుకునే ఆకర్షణీయమైన నాటకాన్ని ప్రదర్శించారు.దీని నానికి అంకితం చేస్తున్నట్టు చెప్పారు.

బుల్లితెర, యాంకర్స్ మహారాణి అయిన సుమా రాజు వారి 25వ వార్షికోత్సవ వేడుకను జీతెలుగు కుటుంబం అవార్డ్స్ లో జరుపుకున్నారు. పార్ట్ 2 లో ఇది ప్రత్యేకమైనది,అని చెప్పవచ్చు. రాజీవ్ సుమకి అందరి ముందు మరోసారి తాళి కడతాడు. అక్కడ సుమా వేసే పంచులు రాజీవ్ నవ్వులు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. పాయల్ రాజ్ పుత్ రష్మీ ఇలా కొంతమంది సెలెక్టెడ్ సాంగ్స్ కి డాన్స్ వేసి ప్రేక్షకులను అలరించారు.