NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తుమ్మ‌ల‌, పొంగులేటి దెబ్బ‌కు పువ్వాడ అజ‌య్ షాకింగ్ డెసిష‌న్‌…!

తెలంగాణ‌లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో గ‌త ఐదేళ్ల‌లో తిరుగులేని విధంగా చ‌క్రం తిప్పారు మాజీ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక ఖ‌మ్మం టౌన్లో అంద‌రిని రాజ‌కీయంగా తొక్కేస్తూ తిరుగులేని కింగ్‌గా ఎదిగారు పువ్వాడ అజ‌య్‌కుమార్‌. క‌ట్ చేస్తే ఇప్పుడు ఆయ‌న బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు చేతిలో ఓడిపోయారు.

పువ్వాడ 2014లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపై, 2019లో నామా నాగేశ్వ‌ర‌రావుపై విజ‌యం సాధించి జెయింట్ కిల్ల‌ర్ అనిపించుకున్నారు. అస‌లు సొంత పార్టీలోనే కాకుండా.. ప్ర‌తిప‌క్ష పార్టీల్లోనూ త‌న‌కు పోటీ వ‌చ్చే నేత‌లే లేకుండా రాజ‌కీయం చేస్తూ వ‌చ్చారు. అయితే బీఆర్ఎస్‌లో పువ్వాడ చ‌ర్య‌ల‌తో అణ‌గ‌దొక్క ప‌డ్డ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతో పాటు మ‌రో మంత్రిగా ఉన్న పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్ద‌రూ కూడా కాంగ్రెస్‌లో చేరి ఇద్ద‌రూ ఖ‌మ్మం, పాలేరు నుంచి పోటీ చేసి విజ‌యం సాధించ‌డంతో పాటు ఇద్ద‌రూ మంత్రులు అయ్యారు.

ఇప్పుడు ఈ ఇద్ద‌రు మంత్రుల ఉమ్మ‌డి టార్గెట్ పువ్వాడ అజ‌య్‌కుమార్ కావ‌డం విశేషం. గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత పాలేరులో పొంగులేటి చేతిలో ఓడిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేంద‌ర్ రెడ్డి అప్పుడే రాజ‌కీయంగా యాక్టివ్ అయిపోయారు. అయితే పువ్వాడ మాత్రం ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం మారి 3 నెలలైనా పువ్వాడ బయటకు రావ‌డం లేదు. దీంతో ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ నైరాశ్యం ఏర్ప‌డింది. వ‌రుస కేసులు వెంటాడుతున్నాయి. చాలా మంది బీఆర్ఎస్ వాళ్లు పార్టీలు మారిపోతున్నారు.

ఇక ఎన్నిక‌ల‌కు ముందే ఖ‌మ్మం కార్పోరేట‌ర్లు కొంత మంది బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్ప‌గా.. ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రి కొంద‌రు బీఆర్ఎస్ కార్పోరేట‌ర్లు పార్టీలు మారిపోయారు. త‌మ‌కు భ‌రోసా ఇచ్చే లీడ‌ర్ లేక‌పోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్‌లో ప‌లువురు లీడ‌ర్లు, కార్పోరేట‌ర్లు, కీల‌క నేత‌లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎంతోమందిని నానా ర‌కాలుగా పువ్వాడ ఇబ్బంది పెట్టారు.

ఇప్పుడు పువ్వాడ చేసిన ప‌నికి అంతే స్థాయిలో రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కాల‌న్న భావ‌న కాంగ్రెస్ నాయ‌కులు, కేడ‌ర్‌లో ఉంది. అందుకే పువ్వాడ కూడా ఈ రాజ‌కీయ దాడి నుంచి త‌ప్పించుకునేందుకు బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని.. ఆయ‌న బీఆర్ఎస్‌ను వీడి ఏ బీజేపీలోకి వెళ్లిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న ప్ర‌చారం అయితే ఖ‌మ్మం రాజ‌కీయాల్లో గ‌ట్టిగా వినిపిస్తోంది.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju