AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులపై బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల అనంతపురం ఎస్పీ అన్బురాజన్ ను బదిలీ చేసిన ఈసీ .. తాజాగా డీఐజీపైనా బదిలీ వేటు వేసింది. డీఐజీ అమ్మిరెడ్డి తక్షణం విధుల నుండి రిలీవ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆయనను ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ఈసీ పేర్కొంది. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై విచారణ జరిపిన ఈసీ .. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
అలానే వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అనంతపురం ఎస్పీ అన్బురాజన్ పై ఇటీవల ఈసీ బదిలీ వేటు వేసింది ఆయన స్థానంలో అమిత్ బర్దన్ ను నియమించింది. అలానే అనంతపురం అర్బన్ డీఎస్పీగా ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా