ట్రెండింగ్ న్యూస్

Jabardasth : రోజా, సంగీతకు పడదా? హైపర్ ఆది స్కిట్ లో సంగీతపై చిర్రుబుర్రులాడిన రోజా?

jabardasth roja comments on sangeetha on jabardasth stage
Share

జబర్దస్త్ స్టేజీ అంటేనే ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన స్టేజీ. ఇప్పుడు రోజాకు కూడా పాపులారిటీ పెరిగిందంటే దానికి ఒక కారణం జబర్దస్త్. ఆమెకు బుల్లితెర మీద ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది. కానీ.. అన్ని షోలకు వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే.. తను పొలిటిషియన్ కూడా. ఎమ్మెల్యే కావడంతో బిజీగా ఉన్న సమయంలో తను రాలేకపోతే.. వేరే ఆర్టిస్టులను పెట్టి షోలను నడిపిస్తున్నారు.

jabardasth roja comments on sangeetha on jabardasth stage
jabardasth roja comments on sangeetha on jabardasth stage

అలాగే.. ఈటీవీలో వచ్చిన దీపావళి ఈవెంట్ అక్కా ఎవరే అతగాడులో సీనియర్ నటి సంగీతను తీసుకున్నారు. అయితే.. ఆ ఈవెంట్ కు రోజా ఎందుకు వెళ్లలేదో తెలియదు కానీ.. సంగీత ఆ ఈవెంట్ కు వెళ్లడం రోజాకు నచ్చలేదు అనే విషయం హైపర్ ఆది స్కిట్ లో స్పష్టంగా తెలిసింది.

హైపర్ ఆది… అక్కా ఎవరే అతగాడు ఈవెంట్ ను స్కిట్ గా చేశాడు. ఆ షోకు హోస్ట్ చేసిన సంగీత స్థానంలో తన కంటెస్టెంట్ ను తీసుకొచ్చాడు. అయితే.. సంగీత క్యారెక్టర్ లో ఉన్న కంటెస్టెంట్ స్టేజ్ మీదికి రాగానే రోజా ఆ కంటెస్టెంట్ పై చిర్రుబుర్రులాడింది. నువ్వొస్తే నేను ఉండను.. అన్నట్టుగా చైర్ లోంచి లేవబోయింది. వెంటనే అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. తర్వాత కూల్ అయి కుర్చీలో కూర్చుంది రోజా.

సంగీత క్యారెక్టర్ లో ఉన్న కంటెస్టెంట్ హాయ్ అనగానే.. రోజా అక్కడి నుంచి నేను మీ రోజా.. బాయ్ అంటూ వెటకారం ఆడటం.. నువ్వు సంగీత అన్నప్పుడే తెగ నవ్వుకున్నామనడం.. సంగీత పేరెత్తితే చాలు.. చిర్రుబుర్రులాడుతూ.. ఇన్ డైరెక్ట్ గా సంగీతపై తనకున్న కోపాన్ని రోజా ఇలా తీర్చుకుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం హైపర్ ఆది చేసిన ఈ స్కిట్ గురించే చర్చ. మీరు కూడా ఆ స్కిట్ చూసేయండి మరి..


Share

Related posts

Intinti Gruhalakshmi: అంకిత అభిల వార్ చూసిన తులసి ఏం నిర్ణయం తీసుకుంది.. ప్రేమ్ లవ్ లెటర్ కి శృతి హెల్ప్..!

bharani jella

తాను చేసిన అతిపెద్ద తప్పు అదే అని కుమిలిపోతున్న శ్రీదేవి కూతురు ?

GRK

అంతర్వేది ఘటన ! చంద్రబాబు హస్తం ఉందని రుజువు చేయబోతున్న సీబీఐ ?

Yandamuri