NewsOrbit
న్యూస్

అమరావతి ఉద్యమం వైపు జగన్ కన్నెత్తి కూడా చూడకుండా ఉండడానికి కారణం ఇదన్నమాట !

AP High Court: Capital Issue to NOvember

అమ‌రావ‌తి ఉద్య‌మం గ‌త 200 రోజులుగా వైభ‌వంగా కొన‌సాగుతోంది. భేష్‌.. రాజ‌ధానిని త‌ర‌లించాల్సిన ప‌నిలేద‌ని, దాన్ని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాల‌ని ఉద్య‌మం చేస్తున్నారు. అందుకు ప్ర‌తిప‌క్ష పార్టీలు వంత‌ప‌డుతున్నాయి. అందులో భాగంగానే ఆందోళ‌న‌లు, దీక్ష‌లు, ధ‌ర్నాలు చేప‌ట్టారు. ఇక ఉద్య‌మంలో భాగంగా అనేక మంది లాక్‌డౌన్ లాంటి క్లిష్ట‌మైన స‌మ‌యంలోనూ పోరాటం కొన‌సాగించారు. ఆ వార్త‌ల‌ను ప‌లు మీడియా సంస్థ‌లు, చాన‌ళ్లు ప్ర‌చురించాయి.. ప్ర‌సారం చేశాయి. కేవ‌లం రెండు తెలుగు దిన‌ప‌త్రిక‌లు, వాటికి సంబంధించిన చానళ్ల‌లోనే ఈ వార్త‌లు మ‌న‌కు ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి. అయితే ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. అస‌లు ఆ ఆందోళ‌న‌లు ఎక్కువ‌గా రాజ‌ధాని గ్రామాల్లో, మ‌రీ ముఖ్యంగా కోర్ క్యాపిట‌ల్ ఉన్న గ్రామాల్లో జ‌రుగుతుండ‌డం నిజంగా ఒక్క‌సారి గ‌మ‌నించాల్సిన విష‌య‌మే.

amaravathi secret will be known if we know the truth behind land pooling

29 గ్రామాల‌కు చెందిన వారు 34 వేల ఎక‌రాల భూమిని త్యాగం చేశారు క‌నుక రాజ‌ధానిని అదే ప్రాంతంలో ఉంచాల‌ని స‌ద‌రు మీడియా సంస్థ‌ల్లో వార్త‌ల‌ను వండి వ‌డ్డిస్తున్నారు.. అయితే… నిజంగా ఆ ప‌త్రిక‌లు, టీవీ చాన‌ళ్ల‌కు స‌ద‌రు ఉద్య‌మాలు, ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల మీద ఉన్న ఆస‌క్తి సామాజిక ప్రయోజ‌నం కోస‌మా ? లేదా సామాజిక వ‌ర్గ ప్ర‌యోజ‌నం కోస‌మా ? అనే సందేహాల‌ను రేకెత్తిస్తోంది. రాజ‌ధాని త‌ర‌లింపు వ‌ల్ల అక్క‌డ భూములిచ్చిన రైతులు న‌ష్ట‌పోతార‌న్న‌ది నిజ‌మే. వారితోపాటు అక్క‌డ నిర్మాణ రంగంలో పెట్టుబ‌డులు పెట్టిన వారు కూడా న‌ష్ట‌పోతార‌ని వాదిస్తున్నారు. కానీ ఆ న‌ష్టానికి ప్ర‌భుత్వం జ‌వాబుదారీగా ఎలా ఉంటుంద‌నేది ప్ర‌శ్న‌.

మీడియా సంస్థ‌లు త‌లుచుకుంటే నిజంగా తిమ్మిని బ‌మ్మిని చేయ‌గ‌ల‌వు. బ‌మ్మిని తిమ్మి చేయ‌గ‌ల‌వు. 200 రోజుల నుంచి అలుపెర‌గ‌కుండా రాజ‌ధాని ఉద్య‌మాన్ని నిరంతరాంగా న‌డిపిస్తున్న‌ది మీడియా సంస్థ‌లే. రాజ‌ధాని నిర్మాణం కోసం అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ భూముల‌ను ఇచ్చారు. వారి త్యాగాలు, క‌న్నీళ్లు నిత్యం మ‌న‌కు క‌నిపిస్తాయి. అయితే రాజ‌ధానిని త‌ర‌లిస్తే న‌ష్ట‌పోయే వారిలో ద‌ళితులు ఎక్కువ‌గా ఉన్నార‌ని వాదిస్తున్నారు. అది కొంత వ‌ర‌కు నిజ‌మే అయినా.. రాజ‌ధాని ప్ర‌క‌ట‌న చేయ‌క‌ముందు వ‌ర‌కు ఒక‌లా, చేశాక ఒక‌లా అన్న చందంగా మారింది. 2014 డిసెంబ‌ర్‌లో రాజ‌ధానిపై ప్ర‌క‌ట‌న చేయ‌క ముందు వ‌ర‌కు భూములు అగ్ర‌వ‌ర్ణాల‌కు ఉంటే నిమ్న‌జాతికి చెందిన వారు ఉపాధి కింద ఆ భూముల్లో వ్యవ‌సాయ ప‌నులు చేసేవారు. ఇక రాజ‌ధాని నిర్మాణం ప్ర‌క‌ట‌న‌తో రైతులు త‌మ‌కున్న అర ఎక‌రా, పావు ఎక‌రా భూముల‌ను కూడా ఇష్టం లేకున్నా, బల‌వంతంగా, బెదిరింపుల‌కు ఇచ్చేయాల్సి వ‌చ్చింది.

ఇక రాజ‌ధాని నిర్మాణం కోసం అనేక మంది ఇచ్చిన భూములు అప్ప‌టికే చేతులు మారాయి. మొత్తం 34వేల ఎక‌రాల భూముల‌ను రాజ‌ధానికి ఇవ్వ‌గా.. అందులో ద‌ళితులు ఎంద‌రు, రైతులు ఎంద‌రు, ఇత‌ర వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన వారు ఎంద‌రు, వారు ఎంత భూమి ఇచ్చారు, ఎంత ప‌రిహారం పొందారు.. అన్న వివ‌రాల‌ను ఇప్ప‌టికీ ఎవ‌రూ వెల్ల‌డించ‌లేదు. ఆ ర‌హ‌స్యం వెనుక చిక్కుముడుల‌ను విప్పితే గానీ అస‌లు బండారం బ‌య‌ట ప‌డ‌దు. ఈ క్ర‌మంలో రాజ‌ధాని ఉద్య‌మ వార్త‌ల‌ను నెత్తికి ఎత్తుకున్న‌ మీడియా సంస్థ‌లు, వాటిని న‌డిపిస్తున్న పెద్ద‌ల ఆంత‌ర్యం ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. ఉద్య‌మ వార్త‌లు, ఉద్య‌మాలు, ఆందోళ‌న‌లు పేరిట చేస్తున్న కుట్ర‌లు, ఆ క‌థ‌నాల వెనుక ఉద్దేశాలు.. ఎవ‌రి కోస‌మో.. ఎవ‌రి స్వ‌ప్ర‌యోజనాలు, ఏ సామాజిక వ‌ర్గ ప్రయోజ‌నాల కోస‌మో.. బ‌య‌ట ప‌డుతుంది.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju