NewsOrbit
Featured రాజ‌కీయాలు

రాజు గారిపై వేటు పడుతుందా…? పడదా..?

వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజుపై వేటు పడుతుందా.., పడదా..? ఇప్పుడు సర్వత్రా అదే చర్చ…! జగన్ ని పొగుడుతున్నట్టే విమర్శిస్తూ… వైసీపీపై అభిమానం అంటూనే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ… ఎమ్మెల్యేలకు సవాళ్లు విసురుతూ… వ్యతిరేక మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ… పార్టీతో పిల్లి మొగ్గలు వేస్తున్న నరసాపురం ఎంపీ రఘుపై అనర్హత వేటు పడుతుందా..? పడదా..? అనేది రాష్ట్రంలో అత్యంత చర్చకు దారి తీస్తుంది. సింపుల్ గా ఆ అవకాశాలను చూద్దాం..!!

గోదావరి జిల్లాల్లో పందాలు…!

కోడి పందాలకు బాగా ప్రాచుర్యం ఉన్న జిల్లాలు గోదావరి జిల్లాలు. అందులోకి రాజుగారు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం, భీమవరం అంటే కోడి పందాలకు దేశాన ఖ్యాతి గాంచాయి. ఇప్పుడు అక్కడ కోడి పందాలకు మించి రఘు గారి విషయంపై పందాలు కాస్తున్నారు. వేటు పడుతుంది అంటూ కొందరు, పడదు అని ఇంకొందరు పందాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ గారి అనుచరులే వేటు పడదు అంటూ రెట్టింపు పందాలకు దిగుతుండడం జిల్లాలో తీవ్రంగా చర్చనీయాంశం అయింది. అంటే ఆయన, ఆయన వర్గం ఎంత ధీమాగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు భీమవరం, తాడేపల్లిగూడెంలో మాత్రం ఆయన వ్యతిరేకులు పార్టీ పెద్దలకు సమాచారం ఇస్తూ కచ్చితంగా వేటు పడుతుంది అని చెప్పగలరా..? మీరు భరోసా ఇస్తే పందెం వేస్తాం అంటూ కబురు పెడుతున్నారట.

 

ఏదైనా బిజెపి చేతిలోనే ఉంటుంది…!

రఘు రామకృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు రాష్ట్రం పరిధిలో లేదు. కేంద్రానికి చేరింది. వైసీపీ చేతిలో లేదు. బీజేపీ చేతుల్లోకి వెళ్ళింది. ఇన్నాళ్లకు వైసీపీ చేతిలో ఉన్నన్నాళ్ళు షోకాజ్ ఇవ్వడం, ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం.., కొంత మేరకు నచ్చచెప్పడం ప్రయత్నాలు చేసారు. కానీ వ్యూహాత్మకంగా, అతి తెలివిగా రాజుగారు మరింతగా రెచ్చిపోవడంతో ఇక పిర్యాదు తప్పలేదు. ఆ పిర్యాదు కూడా వైసీపీ చాలా సీరియస్ అంశాలతో చేసింది. “పార్టీ నుండి, అదే సమయంలో పార్లెమెంట్ నుండి కూడా రఘుపై వేటు పడాలి” అనే తీవ్ర నిర్ణయం తీసుకుని ఫిర్యాదులో బలమైన అంశాలు చేర్చారు. ఇక న్యాయ సూత్రాలు, చట్టాలు, ఆర్టికల్లు చూసుకుని స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ న్యాయ సూత్రాలయినా.., చట్టాలయిన.., ఆర్టికల్లు అయినా బిజెపినే రాస్తుంది. బిజెపినే నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇది బీజేపీ తీసుకోవాల్సిన నిర్ణయం. తమకు వైసీపీ అవసరం అనుకుంటే రాజుపై వేటు వేస్తుంది. రాజు తో పని ఉంటుంది అనుకుంటే.., అలాగే ఉంచుతుంది, పిటిషన్ కొట్టేస్తుంది. ఏదయినా బీజేపీ రాజకీయం ముందుగా ఊహించలేం. సో… వేటు విషయమై బీజేపీ నిర్ణయానికి చూడడమే మనపని. ఇదే సమయంలో రాజుగారు మరి కొన్ని అడుగులు ముందుకేసి కోర్టులో పిటిషన్లు వేస్తూనే.., జగన్ గారికి లేఖలు రాస్తూనే ఉంటారు.

author avatar
Srinivas Manem

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!