NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

విశాఖ ప్రమాదం చుట్టూ అనుమానాలెన్నో..!!

విశాఖ సాల్వెంట్స్ లో అగ్ని ప్రమాదం ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారింది. ఎల్జీ పాలిమర్స్ లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన, ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ, ఆ నివేదిక అన్నీ కొంత మేరకు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కూడా ఒక రకంగా మంచి పేరు వచ్చింది. కానీ ఈ విశాఖ సెలవెంట్స్ ప్రమాదంపై మాత్రం ప్రభుత్వం ఇరుకున పడేలా ఉంది. తాజాగా ఆ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందంటూ ఎన్నో అనుమానాలు ఉన్నాయంటూ సింటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థ లేవనెత్తింది. వారి అనుమానాలు అన్ని పేర్కొని విశాఖ కలెక్టర్ కు ఓ పెద్ద లేఖ రాసింది.

 

 

వారు రేకెత్తించిన అనుమానాల ప్రకారం…* ట్యాంక్ లో వ్యాక్యూమ్, 600-650 మిల్లీ మీటర్ల మెర్క్యురీ నుంచి 350మి.మీ మెర్క్యురీకి తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. దీని అర్ధం పీడనం, ఉష్ణోగ్రత పెరిగినట్లు. ఉష్ణోగ్రత 75-95 డిగ్రీలకు పెరిగినట్లు ఇచ్చారు. ఆలా అయితే రసాయన మిశ్రమాల మరిగే ఉష్ణోగ్రత తగ్గిందని ఎలా చెప్పారు?. దీన్ని బట్టి కమిటీ అధికారుల్లో అవగాహన లేదని తెలుస్తోంది. * ఫ్లాష్ పాయింట్ మీద అధికారుల్లో కనీస అవగాహన లేదు. ఈ పాయింట్ దగ్గర చిన్న మంట గుప్పుమని వెలిగి వెంటనే ఆరిపోతుంది. ఈ ఫ్లాష్ పాయింట్ క్రమంగా తగ్గిందని నివేదికలో చెప్పినప్పుడు, మరి ప్రమాదం జరిగిందో అధికారులు ఆలోచించలేదు. * రసాయన మిశ్రమాల మరిగే ఉష్ణోగ్రత తగ్గటం వల్లే ఫ్లాష్ పాయింట్ కి చేరి ట్యాంకు తేపేలి ఉంటుందన పేలి ఉంటుందని చెప్పడం ఊహాజనితం. ఫ్లాష్ పాయింట్ దగ్గర ఆవిరి దానంతట అదే ఉండదు. అలా జరగాలంటే నిప్పు ఉండాలి. అది ఎక్కడ నుండి వచ్చిందో అధికారులు చెప్పాలి. * ప్రమాద సమయంలో పరిశ్రమ నిర్వాహకులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు రాశారు. ఆ సమయంలో అగ్నిమాపక అధికారులే దూరంగా ఉండి మంటలు ఆర్పారు. అలాంటప్పుడు పరిశ్రమ వారు లోపల ఎలా రెస్క్యూ ఆపరేషన్లు చేశారు?. ఇలా పలు అంశాలను లేవనెత్తుతూ..నివేదిక చూస్తుంటే పరిశ్రమ యాజమాన్యాన్ని కాపాడడానికి ఇచ్చినట్లుగా ఉన్నది. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదు. నివేదికలో వాడిన పదాలు కూడా అవగాహన లేనట్లుగా ఉన్నాయని సంస్థ లేఖలో పేర్కొన్నది.

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం విషయంలో సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ సంస్థలోని డైరెక్టర్, సీఈఓ సహా కీలక అధికారులందరిని అరెస్టు చేయించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా విశాఖ సాల్వెంట్స్ విషయంలో కూడా నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో గుర్తించి చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి అదే రకమైన పేరు నిలబడుతుంది. లేకుంటే విశాఖలో రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు సహజంగా మారుతూ వాటిపై ప్రభుత్వం కూడా తప్పటడుగులు వేస్తే ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది.

Related posts

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N