NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

30 ఏళ్లుగా సాధించలేనిది కరోనా కారణంతో ఇప్పుడు సాధించాడు..!ఎవరా వ్యకి? ఏమిటా కధ..??

కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతాన్ని గుప్పెట్లో పెట్టుకొని గిజగిజ లాడిస్తోంది. తెలుగు రాష్ట్రాలను చిటారు కొమ్మల ఆకులు వణికినట్లు వణికిస్తోంది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పేదలు, ధనికులు, కులం, మతం, వర్గం, జాతి తేడా లేకుండా అందరికి సోకుతోంది. కొందరిని తనతో పాటు తీసుకెళుతోంది. ఇంతటి మహమ్మారి కొంత మందిలో తీర్చలేని సంతోషాన్ని కూడా ఇచ్చింది. ఊహించని పరిణామాన్ని మిగిల్చింది. ఎన్నడూ అందుకోలేని గెలుపును కూడా రుచి చూపించింది. అటువంటిదే ఈ కథ. పాపం ఒ వ్యక్తి మూడు దశాబ్దాలకు పైగా సాధించలేని ఘనతను కరోనా కారణంగా ఈ ఏడాది సాధించాడు. ఆ ఆసక్తి కధ ఏంటో చూడండి.

అది హైదరాబాద్ లోని బోలాక్ పూర్. అక్కడ పాఠశాల. అందులో నైట్ వాచ్ మెన్ గా పని చేస్తున్న వ్యక్తి నూరుద్దీన్. పాపం పదో తరగతి పాస్ అవ్వాలనేది అతని కల. 1987 నుంచి గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్లు రాస్తూనే ఉన్నాడు. ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. అన్ని భాషలు వస్తున్నా ఇంగ్లీష్ మాత్రం ఆయనకు అక్షరం ముక్క రాదు. తల కెక్కడం లేదు. అందుకే 34 సంవత్సరాల నుంచి రాయడం, ఫెయిల్ అవ్వడం, రాయడం, ఫెయిల్ అవ్వడం అతని వృత్తి గా మారింది. ఈ సారి కూడా ఫెయిల్ అవుతానని అతను సన్నిహితులకు చెప్పుకున్నాడట. కానీ కరోనా వచ్చి కాలం మార్చేసినట్లే అతని తల రాతను, అతని పరీక్ష రాతను మార్చేసింది. ఫలితాన్ని తిరగరాసింది. అతనికి తిరుగులేని విజయాన్ని ఇచ్చింది. స్కూల్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్న నూరుద్దీన్ పదవ తరగతి పాస్ అయితే పోస్ట్ పర్మినెంట్ కావడమో, ప్రమోషన్ రావడమో జరుగుతుందట. ఆ ఆశ తోనే పదవ తరగతి ఇంగ్లిష్ పరీక్ష పేపర్ రాస్తూ ఉన్నాడుట. ఈ సారి పరీక్షలు రద్దు అయి అందరినీ పాస్ చేయడంతో అయన చాలా అనందంతో ఉన్నాడట. అతని మాదిరిగానే అనేక మంది పదవ తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు రాసే వారు ఈ ఏడాది తమ పంట పండిందని భావిస్తున్నారు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju