NewsOrbit
న్యూస్

రూ.501 క‌నీస మొత్తంతో ఎస్‌బీఐ ష‌గుణ్ ఇన్సూరెన్స్‌.. బోలెడు లాభాలు..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం ఇటీవ‌లే కొత్త‌గా ఎస్‌బీఐ ష‌గుణ్ పేరిట ఓ నూత‌న ఇన్సూరెన్స్ పాల‌సీని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ష‌గుణ్ – గిఫ్ట్ యాన్ ఇన్సూరెన‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్‌ను ఎవ‌రైనా స‌రే తమ కోసం తీసుకోవచ్చు. లేదా ఇంట్లోని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ఇలా ఎవ‌రికైనా ఈ పాల‌సీ తీసుకుని గిఫ్ట్‌గా ఇవ్వ‌వ‌చ్చు. అందుక‌నే దీన్ని ఎస్‌బీఐ గిఫ్ట్ ఇన్సూరెన్స్ పాల‌సీగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందులో క‌నీసం రూ.501 ప్రీమియంతో పాల‌సీ తీసుకోవ‌చ్చు. ఈ ఇన్సూరెన్స్ వ‌ల్ల ప‌ర్స‌న‌ల్ యాక్సిడెంట్ క‌వ‌రేజీ ల‌భిస్తుంది. అంటే ఇన్సూర్ చేసుకున్న వ్య‌క్తి యాక్సిడెంట్‌కు గురైనా, ప్ర‌మాదం వ‌ల్ల పూర్తిగా లేదా పాక్షికంగా అంగ వైక‌ల్యం బారిన ప‌డ్డా, చ‌నిపోయినా.. ఇన్సూర్ చేసిన మొత్తం వ‌స్తుంద‌న్న‌మాట‌.

sbi shagun insurance and its benefits

ఎస్‌బీఐ ష‌గుణ్ ఇన్సూరెన్స్ పాల‌సీకి క‌నీసం రూ.501 ప్రీమియం చెల్లించాలి. ఎక్కు‌వ క‌వ‌రేజీ కావాల‌నుకుంటే రూ.1001, రూ.2001 ఇలా ప్రీమియం చెల్లించ‌వ‌చ్చు. ఒక‌సారి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏడాది వ‌ర‌కు ప‌నిచేస్తుంది. త‌రువాత మ‌ళ్లీ రెన్యువ‌ల్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 65 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారు ఎవ‌రైనా ఈ ఇన్సూరెన్స్‌ను తీసుకోవ‌చ్చు. ఈ పాల‌సీ తీసుకుంటే కింద తెలిపిన ప‌లు లాభాలు క‌లుగుతాయి.

* ఇన్సూర్ అయిన వ్య‌క్తికి యాక్సిడెంట్ అయి గాయాల బారిన ప‌డితే ఆంబులెన్స్ ఖ‌ర్చుల నిమిత్తం ఇన్సూర్ అయిన మొత్తంలో 10 శాతం లేదా రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఇస్తారు.

* యాక్సిడెంట్ వ‌ల్ల వాహ‌నాల‌కు అయిన డ్యామేజీ ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డం కోసం ఇన్సూర్ చేసిన మొత్తంలో 1 శాతం లేదా రూ.25వేల వ‌ర‌కు ఇస్తారు.

* ఇన్సూర్ అయిన వ్య‌క్తి యాక్సిడెంట్ వ‌ల్ల పూర్తిగా అంగ‌వైక‌ల్యానికి లోనైతే ఇన్సూర్ చేసిన మొత్తం నుంచి కొంత శాతాన్ని చెల్లిస్తారు.

* ఇన్సూర్ అయిన వ్య‌క్తి ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణిస్తే వ్య‌క్తి నామినీకి ఇన్సూర్ చేసిన మొత్తాన్ని చెల్లిస్తారు.

* ఈ ఇన్సూరెన్స్ తీసుకునేవారు ఇన్సూర్ చేసిన మొత్తం నుంచి రూ.50వేల వ‌ర‌కు లేదా మొత్తం నుంచి 1 శాతం వ‌ర‌కు ఎడ్యుకేష‌న్ బెనిఫిట్ కింద పొంద‌వ‌చ్చు.

* ఇన్సూర్ అయిన వ్య‌క్తి ప్ర‌మాదంలో పాక్షికంగా అంగ‌వైకల్యం బారిన ప‌డితే ఇన్సూర్ చేసిన మొత్తం నుంచి కొంత శాతాన్ని చెల్లిస్తారు.

Related posts

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N