NewsOrbit
దైవం

కార్తీకంలో ఏరోజు ఏం దానం చేయాలి ?

కార్తీకం అంటేనే పవిత్రమైన మాసం. శివకేశవుల ఆరాధనకు అత్యంత ప్రధానమైన మాసం. ఈ మాసంలో స్నానం, దీపం, ఉపవాసం, దానం, ధర్మం,ధ్యానం చాలా ప్రధానమైనవి. ప్రస్తుతం ఈ మాసంలో ఏరోజు ఏం దానం చేస్తే ఏం ఫలితమో తెలుసుకుందాం….

కార్తీక మాసం మొదటి రోజు: నెయ్యి, బంగారాన్ని దానం చేయాలి.
రెండవ రోజు: కలువ పూలు, నూనె, ఉప్పు ఇతరులకు దానం చెయ్యాలి.
మూడవరోజు: కార్తీక మాసం మూడో రోజు పార్వతి దేవిని పూజిస్తారు.ఈ రోజు ఉప్పును ఇతరులకు దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
నాలుగో రోజు: కార్తీక మాసంలో 4వ ఈ రోజైన చతుర్దశి రోజు నాగుల చవితి గా జరుపుకుంటారు.అలాగే వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
కార్తీక మాసం నాలుగవ రోజు పెసరపప్పును దానం చేయాలి.
ఐదవ రోజు: కార్తీక మాసంలో వచ్చే 5వ రోజున జ్ఞాన పంచమి.ఈరోజు ఆ ఆదిశేషుని పూజించి, పాలను దానం చేయాలి.
ఆరవ రోజు: ఈ రోజున సంతానంలేనివారు ఎర్రటి వస్త్రాలు, టవల్‌, లుంగీ వంటివాటిని బ్రహ్మచారికి దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.
ఏడవ రోజు: కార్తీక మాసంలో 7వ రోజు దుర్గా దేవిని పూజించాలి. ఎర్రటి వస్త్రములో కొద్దిగా గోధుమలను మూటకట్టి ఇతరులకు దానం చేయడం ద్వారా ఆయష్షు పెరుగుతుంది.
ఎనిమిదవ రోజు: ఈరోజు గోపూజ నిర్వహించి, ఇతరులకు బియ్యాన్ని దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
తొమ్మిదవ రోజు: కార్తీకమాసంలో ఈ రోజున ఆ విష్ణు భగవానుని పూజించి, ఎర్రటి కంది పప్పును దానం చేయాలి.
పదవరోజు: కార్తీకమాసంలో పదవరోజు నూనెను, దానం చేయటం వల్ల ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
పదకొండవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు శివుని ప్రత్యేకమైన పూజలతో పూజిస్తారు.ఈ రోజున పండ్లను దానం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
పన్నెండవ రోజు: కార్తీక మాసంలోఈ రోజు ఉసిరి, తులసి చెట్టు వద్ద ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.ఈరోజు పాల పదార్థాలను దానం చేయడం ఎంతో మంచిది.
పదమూడవ రోజు: కార్తీక మాసంలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో వనభోజనాలకు వెళ్లి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.ఇటువంటి రోజున బియ్యాన్ని దానం చేయడం ఎంతో శ్రేయస్కరం.
పధ్నాలుగోవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు యమధర్మరాజును పూజించి దున్నపోతు లేదా గేదెను దానంగా ఇస్తారు.
పదిహేనవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు ఎంతో ముఖ్యమైనది.కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నదీస్నానమాచరించి, దీపాలు వెలిగించడం ద్వారా సర్వపాపాలు తొలగిపోతాయి.
ఇలా ఎవరి చేతనైనంతా వారు దానం, ధర్మం చేయాలి. దానం చేసిన విషయం అందరికీ ఎవరికీ చెప్పకూడదు. భక్తితో, శ్రద్ధతో దానాలు చేయాలి. దాన ధర్మాలు చేయడానికి వీలు లేకుంటే మనస్సులో భగవత్ ప్రార్థన చేయాలి.

 

Related posts

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju