NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హైదరాబాదులో ఉన్న సమస్యలేంటి…. మీరు మాట్లాడేదేంటి? విద్వేషమే అజెండా నా?

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో వేడి రోజురోజుకీ ముదురుతోంది. ఎక్కడెక్కడినుండో నేతలు వస్తున్నారు ఏవేవో మాట్లాడుతున్నారు. ఇక జిహెచ్ఎంసి ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల స్థాయిని తలపిస్తోంది. అందరూ భావోద్వేగాలకు లోనై ఒకరిపై ఒకరు భారీ స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచి ఊపు మీద ఉన్న బిజెపి, తమ ఆధిపత్యం నిరూపించుకోవాలని టిఆర్ఎస్ మళ్ళీ ట్రాక్ పైకి వచ్చేందుకు కాంగ్రెస్ ఒకరితో ఒకరు పోటీ పడి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

 

కేసీఆర్ మొదలుకొని….

బిజెపి ఎంఐఎం పై తన దృష్టిని కేంద్రీకరించింది. ప్రచారానికి వారు చేస్తున్న ఆరోపణలు మాత్రం మితిమీరిపోతున్నాయి. ఆ వ్యాఖ్యలు కొన్ని అయితే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయి అన్న వాదనలు వస్తున్నాయి. కేసీఆర్ చూస్తేనేమో బీజేపీ గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం ఉండదు అన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం టిఆర్ఎస్ వస్తేనే మీకు అభివృద్ధి జరుగుతుంది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో కలిసి హైదరాబాదులో అభివృద్ధి కష్టమే అన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు అని అంటున్నారు.

ముస్లింల వాదన ఎందుకు?

ఇక బీజేపీ వారేమో రోహింగ్యా ముస్లింలను జాతీయ భద్రత కి ముప్పు గా పరిగణిస్తున్నారు. ఇక జిహెచ్ఎంసి మేయర్ ఎన్నికకు దీనికి వారి ముడిపెట్టడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం మత విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సంబంధం లేకుండా ముస్లింలను అనవసరంగా జిహెచ్ఎంసి మేయర్ ఎన్నికల విషయంలో కలుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అసలు వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయడం ఏమిటన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

ఇవి కనపడవా?

జాతీయ స్థాయిలో తమకు గుర్తింపు రావాలనేమో కేవలం మతాన్ని ఆధారంగా చేసుకొని బిజెపి ప్రచారం చేస్తోందన్నారు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే సిటీలలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. రోడ్లు బాగోలేవు, త్రాగు నీరు అద్వానంగా ఉంది, పరిశుభ్రత లేదు, క్వాలిటీ సిటిజెన్ సర్వీసెస్ కొరవ, ట్రాఫిక్ ఇబ్బందులు , పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సమస్యలు, నిరుద్యోగం, వైద్యం, విద్య ఇలాంటి ఎన్నో ప్రధానమైన అంశాలను పక్కన పెట్టి ఇలాంతి విద్వేష పూరిత అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శలు పెరిగిపోయాయి. మరి ఎవరు చెబితే వారు మారుతారో వారే సరైన తీర్పు ఇవ్వాలి…!

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?