NewsOrbit
రాజ‌కీయాలు

కేసీఆర్ కారులో అసదుద్దీన్ కు స్టీరింగ్..!! గ్రేటర్ లో జరిగేది ఏమిటి!?

kcr and asaduddin eyeing on hyderabad mayor

జీహెచ్ఎంసీ ఎన్నికల సమరం ముగిసింది. ఊహించినదే కాస్త అటూ ఇటుగా అయింది. 2016లో 99 సీట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్ సెంచరీ కొట్టదని.. బీజేపీ టఫ్ ఫైట్ ఇవ్వబోతోందని అందరూ దాదాపు అంచనాకు వచ్చారు. కానీ.. టీఆర్ఎస్ కు 2020 ఎన్నికలు ఇంకా గట్టి దెబ్బే కొట్టాయి. కేవలం బీజేపీ కంటే 7 సీట్లు ఎక్కవ వచ్చాయి. అయితే.. ఇప్పుడు చర్చంతా మేయర్ ఎవరనేది. రాజకీయాలు ఎలా ఉంటాయో మరోసారి తెలిపే సందర్భం వచ్చింది. కింగ్ కాదు రాజకీయాల్లో కింగ్ మేకర్ లా ఉండేవాళ్లు ఎంత కీలకమో తెలీబోతోంది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లు వచ్చిన బీజేపీ, 78 సీట్లు గెలిచిన కాంగ్రెస్ కాకుండా 37 సీట్లు వచ్చిన జేడీఎస్ నుంచి కుమారస్వామి సీఎం అయిపోయారు. ఇదే కింగ్ మేకర్..!

kcr and asaduddin eyeing on hyderabad mayor
kcr and asaduddin eyeing on hyderabad mayor

టీఆర్ఎస్-ఎంఐఎం భాయి.. భాయీ..

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంతగా తిట్టుకున్నా.. ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకున్నా టీఆర్ఎస్, ఎంఐఎం స్నేహితులే అనే విషయం తెలిసిందే. ఎంఐఎం అవసరం మాకు లేదు.. వాళ్లతో పొత్తు ఉండదు అని బహిరంగంగానే ప్రకటించారు టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ ను అధికారం నుంచి దించేస్తాం.. అని ఎంఐఎం నాయకులు అన్నారు. ఏకగ్రీవం అయినా కూడా వీరిద్దరి మధ్య శత్రుత్వం ఉండే అవకాశాలు తక్కువే. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తెలిసేలా మళ్లీ ఈ రెండు పార్టీలు స్నేహం చేయబోతున్నాయి. ఇందుకు అసదుద్దీన్ ఫలితాలు వచ్చిన సాయంత్రమే చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణ. బీజేపీని ఢీ కొట్టే సత్తా కేసీఆర్ కే ఉంది ప్రకటన ఇచ్చేయడం.

చెరో రెండున్నరేళ్లా..?

కింగ్ మేకర్ అయిన ఎంఐఎం బీజేపీతో కలవదు కాబట్టి టీఆర్ఎస్ తో కలిసే మేయర్ పదవికి వెళ్తారు. అయితే.. మద్దతిస్తుందా, డిప్యూటీ మేయర్ అడుగుతారా.. లేదంటే వచ్చిన అవకాశం కాబట్టి బెట్టు చేసి మేయర్ స్థానమే అడుగుతారో చూడాలి. అదే జరిగితే చెరో రెండున్నరేళ్లు అంశం తెర మీదకు వస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో ఎంఐఎంకు డిమాండ్ చేసే స్థాయి వచ్చింది. దీనికి టీఆర్ఎస్ ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. విచిత్రమైన విషయం ఏమిటంటే 2016లో ఎంఐఎంకు ఎన్ని సీట్లు వచ్చాయో.. 2020లో కూడా అన్నే సీట్లు వచ్చాయి.. 44. తమ ఆధిపత్యం నిలబెట్టుకున్న ఎంఐఎంకు ఆమాత్రం డిమాండ్ చేసే అధికారం ఉంది.

 

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju