NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఈసీతో పెట్టుకుంటే ఏమవుద్ది..!? వైఎస్, చంద్రబాబు ఏమయ్యారు..!?

Election Commission Nimmagadda Ramesh Kumar రాష్ట్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారు. Andhra Pradesh ప్రధాన కార్యదర్శి.., DGP Goutham Sawang డీజీపీలను శాసిస్తున్నారు.., కలెక్టర్, ఎస్పీలను బదిలీ చేసేస్తున్నారు..! అసలు ఈ ఈసీ ఏంటి..? ఎన్నికల కమీషన్ కి అంత పవర్ ఉంటుందా..? ఎవరినయినా బదిలీ చేసేయొచ్చా..? ఎవరిపై అయినా చర్యలు తీసుకోవచ్చా..!? గతంలో ఏం జరిగింది..? ఈ రానున్న రెండు రోజుల్లో ఏం జరగనుంది..? అనేది ఓ సారి చూద్దాం..!!

గతం ఓ సారి పరిశీలిస్తే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఇప్పటి YS Jagan సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి YS Rajasekhar Reddy సహా ప్రతిపక్ష నేత చంద్రబాబు Nara Chandrababu Naidu కూడా ఎన్నికల సంఘంతో దెబ్బలు తిని తిని రాటు దేలిన వారే. వైఎస్ రెండుసార్లు ఎదురుదెబ్బలు తింటే.., చంద్రబాబు గట్టిగా రాజకీయంగా చావుదెబ్బ తిన్నారు. వాటితో పోల్చుకుంటే ఇప్పుడు జగన్ తింటున్న దెబ్బలు పెద్ద లెక్కలోకి రావు.

Poll On Ys jagan vs nimmagadda local body election In ap
Poll On Ys jagan vs nimmagadda local body election In ap

* ముందుగా చంద్రబాబు దెబ్బలు చూద్దాం..!

ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. 2019 ఎన్నికల సంగతి ఓ సారి గుర్తు చేసుకుంటే చాలు. అప్పటికి ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠా ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే శ్రీకాకుళం కలెక్టర్ సహా ఇద్దరు ఎస్పీలను ప్రభుత్వం ఈసీ బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ని కూడా బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించలేదు. ఇంటెలీజెన్స్ కి ఎన్నికల విధులతో సంబంధం ఉండదు అంటూ వాదించింది. సాక్షాత్తూ అప్పటి సీఎస్ అనిల్ చంద్ర కేంద్ర ఎన్నికల సంఘానికి నోట్ పంపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సీఎస్ ని ఢిల్లీ పిలిపించి మందలించింది. ఇదే సమయంలో హైకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. దీంతో ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావు బదిలీ అయ్యారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రని కూడా బదిలీ చేసేసింది. ఆ స్థానంలో ఎల్వి సుబ్రహ్మణ్యం వచ్చారు. అప్పట్లో ఎల్వి సుబ్రహ్మణ్యం విషయంలో చంద్రబాబు ఎన్ని ఆరోపణలు చేసినా ఉపయోగం లేదు. ఇది చంద్రబాబుకి తగిలిన అతి పెద్ద దెబ్బ.

is chandrababu defaming tdp himself
is chandrababu defaming tdp himself

* ఇక అప్పటి వరకు ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఉన్న సిసోడియాపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఓటర్లు జాబితాలో తప్పులను సవరించలేకపోయారు అంటూ ఆయన్ను బదిలీ చేసి, గోపాల కృష్ణ ద్వివేదిని నియమించింది. ఈయనపై చంద్రబాబు బృందం ఎన్ని ఆరోపణలు చేసిందో అందరికీ తెలిసిందే. ఇలా మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబు బృందానికి చుక్కలు కనిపించాయి, చెమటలు పట్టాయి.

వైఎస్ హయాంలో రెండు సార్లు..!!

ఇక దివంగత వైఎస్ హయాంలో రెండు సార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. 2006 లో విశాఖ ఉప ఎన్నికల సందర్భంగా.., 2008 లో వికారాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ (రెండు సార్లు రెండు జిల్లాల్లోనూ ఆయనే ఉన్నారు) ఎన్నికల అధికారిగా వ్యవహరించాల్సి వచ్చింది. ఈయన వైఎస్ కి సన్నిహితంగా ఉండేవారు. దీంతో టీడీపీ ఈయనపై ఈసీకి పిర్యాదులు చేసింది. కొందరు అధికారుల బదిలీల్లో కలెక్టర్ సరిగా వ్యవహరించడం లేదని గమనించిన ఈసీ ప్రవీణ్ ప్రకాష్ ని బదిలీ చేయాలని ఆదేశించింది. కానీ వైఎస్ అంగీకరించలేదు. అప్పటి ప్రధాన కార్యదర్శి వైఎస్ కి నచ్చచెప్పి.., ఈసీ ఆదేశాల విధాన్ని వివరించి బదిలీ చేశారు. ఇక్కడ వైఎస్ సీఎం.., కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆయన గట్టిగా అనుకుంటే తన మాట నెగ్గించుకోగలరు. కానీ ఎన్నికల కమీషన్ తో కయ్యం ఎందుకులే అనుకుని వదిలేశారు.

ysr

ఇప్పుడు జగన్ వంతు..!?

ఇక ప్రస్తుత వ్యవహారాన్ని చూస్తే ఎన్నికల కమీషన్ .. రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. సీఎం జగన్ ఏ మాత్రం ఈసీని లెక్క చేయడం లేదు. జగన్ అండతో రాష్ట్రంలోని అధికారులు, ఉద్యోగ సంఘాలు కూడా ఈసీని ఖాతరు చేయడం లేదు. ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమి ఉండకపోవచ్చు. రాష్ట్ర ఈసీ ఏమి చేయలేకపోవచ్చు. కానీ.., ఉద్యోగ సంఘాల మాటలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు.. ప్రభుత్వ వ్యవహార శైలి.. ఈ అస్మాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి, గవర్నర్ కి పిర్యాదు ఇస్తే.., రాజ్యాంగ సూత్రాలను గుర్తు చేస్తే మాత్రం పెద్ద రిస్కులో పడతారు. అయితే ఈ రిస్కు కూడా పిర్యాదు చేసిన వెంటనే వచ్చేయదు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఫిర్యాదుపై గవర్నర్ కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ సీరియస్ గా రియాక్ట్ అయితే, వెంటనే స్పందిస్తే మాత్రం ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు, అధికారులకు చిక్కులు వస్తాయి. అసాధారణ రీతిలో చాలా తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశమూ ఉంది.

 

 

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?