NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tirupathi By Election : తిరుపతిలో ఈ ఓట్లు వస్తే టీడీపీ / బీజేపీ నిలిచినట్టే..!! “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!!

TDP : Tirupathi By Elections Party Future..?

Tirupathi By Election : రాష్ట్రంలో అధికార పార్టీకి తిరుగులేదు. ఎక్కడ, ఏ ఎన్నిక జరుగుతున్నా వైసీపీకి భారీగా ఓట్లు పడుతున్నాయి. భయమో, అభిమానమో.. కారణం ఏమైనా కానీ వైసీపీకి గెలుపు మాత్రం లాంఛనంగా దక్కుతుంది. సో.. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి అంటే.., తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నికలో కూడా వైసిపికి గెలుపు ఈజీ టాస్క్. కాకపోతే మెజారిటీ ఎంత..? అనేది లెక్కించుకోవాలి. టీడీపీ ఎంత పోరాడినా.., బీజేపీ ఎంతగా ప్రయత్నించినా వారి ఉనికి, భవిష్యత్తు కోసమే తప్ప, ఇప్పుడు గెలుపు కోసం అనే విషయం వారికీ అంతర్లీనంగా తెలుసు. ఇంతకూ టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తే రాజకీయంగా గిట్టుబాటు అయినట్టు.., బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తే రాజకీయంగా గిట్టుబాటు అయినట్టు అనేది కొంచెం లోతుగా చూద్దాం..!!

Tirupathi By Election : TDP - BJP Votes Special Analysis
Tirupathi By Election : TDP – BJP Votes Special Analysis

Tirupathi By Election : టీడీపీకి బలం అలా ఉంటే చాలు..!!

తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో మొత్తం 14 లక్షల ఓట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి 7 .22 లక్షల ఓట్లు.., టీడీపీ అభ్యర్థికి 4 . 94 లక్షల ఓట్లు వచ్చాయి. జనసేన, బీజేపీకి కలిపి 37 వేల ఓలు వచ్చాయి. ఆ ఎన్నికలు ముగిసినప్పటి నుండి టీడీపీ మరింత బలహీన పడుతుంది. పార్టీలో కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. నాయకత్వం నీరసిస్తుంది. వరుస ఓటములు, నాయకుల్లో నిలకడలేమి ఆ పార్టీని వేధిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ తిరుపతి ఉప ఎన్నికలో గెలిస్తే పెద్ద సంచలనమే. అందుకే కనీసం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు నిలబెట్టుకుంటే టీడీపీ నైతికంగా గెలిచినట్టే. బలం నిలుపుకున్నట్టే. టీడీపీ రాజకీయంగా గిట్టుబాటు చేసుకున్నట్టే. అంటే ఆ పార్టీ టార్గెట్ 5 లక్షల ఓట్లు. తమ సొంత సామాజికవర్గం, చంద్రబాబు సొంత బలగం, పార్టీ క్యాడర్ ద్వారా ఈజీగా మూడు లక్షల ఓట్లు వస్తాయి. మిగిలిన రెండు లక్షల ఓట్లు వస్తే టీడీపీ గట్టెక్కినట్టే. ఏ మాత్రం దిగులు చెందకుండా ఆ పార్టీ నిశ్చింతగా ఉండవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి 5 లక్షల ఓట్లు రావడం కూడా కష్టమే. ఆ పార్టీ ప్రయత్నాలు, ప్రచారాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూద్దాం..!

Tirupathi By Election : TDP - BJP Votes Special Analysis
Tirupathi By Election : TDP – BJP Votes Special Analysis

బీజేపీ – జనసేన బలం/ బలుపు/ వాపుకి పరీక్ష..!!

బీజేపీ ఏపీ నేతలు ఈ మధ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తమ పార్టీకి ఏపీలో బీభత్సంగా ఓటు బ్యాంకు పెరిగినట్టు.., ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 30 శాతం ఓట్లు వచ్చేస్తాయి అన్నట్టు తెగ మాట్లాడుతున్నారు. వారికి జనసేన తోడైతే ప్రభుత్వమే ఏర్పాటు చేసేస్తాం అంటున్నారు. సో… ఆ బలం ఏమిటో.. అది బలుపా/ వాపా అనేది తేలిపోనుంది. అభ్యర్థి ఎంపిక ద్వారా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయినట్టు సంకేతాలు ఇచ్చింది. సరైన అభ్యర్థిని రంగంలోకి దించింది. జనసేన, బీజేపీ కి ఉన్న ఓటు బ్యాంకు చూసుకుంటే 50 వేలు ఓట్లు వరకు ఢోకా లేదు. కానీ ఆ పార్టీలు బలం పెరిగింది.., మాకు తిరుగులేదు అంటున్నాయి కాబట్టి కనీసం లక్ష ఓట్లు తెచ్చుకుంటే ఆ పార్టీలకు తిరుగులేనట్టే. ఏపీలో రాజకీయ భవిష్యత్తుపై ఆ పార్టీలు ఆశలు పెట్టుకోవచ్చు..! అంటే టీడీపీకి 5 లక్షలు, బీజేపీకి లక్ష ఓట్లు వస్తే ఆ ఎన్నిక త్రిముఖ పోరు ప్రకారం జరిగినట్టే, వైసిపికి గట్టి పోటీ ఎదురైనట్టే చెప్పుకోవచ్చు..!!

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju