NewsOrbit
జాతీయం న్యూస్

Corona Death: కరోనాతో ఆ కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

Corona Death: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా వేల సంఖ్యలో మరణాలు సంభివిస్తున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే,. కొంత మంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలను కరోనా కబళించింది. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్పీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్  (82) కరోనాతో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా కుటుంబ సభ్యులు గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Corona Death: ex union minister ajit singh passed away
Corona Death: ex union minister ajit singh passed away

మాజీ ప్రధాన మంత్రి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ రాజ్యసభ, లోక్ సభ సభ్యుడిగా పని చేశారు. యుపీఏ హయాంలో పౌరవిమానయాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అజిత్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతుల ప్రయోజనాల కోసం ఆయన నిబద్ధతతో పని చేశారని మోడీ ట్వీట్ చేశారు. గతంలో కేంద్ర మంత్రిగా తనకు ఇచ్చిన బాధ్యతలను అజిత్ సింగ్ సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆయన మరణ వార్త తనను కలచివేసిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపి ప్రతి పక్ష నేత చంద్రబాబు తదితరులు ట్విట్టర్ వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

Related posts

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N