Sunny Leone: సన్నీలియోన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అందానికి పెట్టింది పేరు సన్నీలియోన్.. ఈ భామ అ కి అందంతోపాటు మంచి మనసు ఉందని చాటుకుంది..!! 10,000 మంది ఢిల్లీ వలస కార్మికులకు ఆహారం ఇవ్వడానికి సన్నీలియోన్ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ అఫ్ యానిమల్స్ (పెటా) తో చేతులు కలిపింది..!!
మనందరం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము.. మహమ్మారి కరోనా కారణంగా ఎంతోమంది వలస కార్మికులు ఆహారం లేక చనిపోతున్నారు.. ఇటువంటి సమయంలో ఢిల్లీ లో వలస కార్మికులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాము.. పెటా ఇండియా తో మళ్లీ చేతులు కలపడం నాకు చాలా ఆనందంగా ఉంది.. ఈ సారి ప్రోటీన్ తో కూడిన శాకాహారి భోజనాన్ని వేలాది మందికి అవసరం అని సన్నీ లియోన్ అన్నారు.. ఈ భోజనంలో దాల్ ,రైస్ , కిచిడి, తరచుగా పండ్లు అందిస్తాము అని తెలిపారు.
సన్నీ లియోన్ 2016లో పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయింది. గతంలో శాఖాహారి ఫ్యాషన్, శాఖాహారం తినడం, కుక్క, పిల్లి దత్తత, స్టెరిలైజేషన్ కు మద్దతుగా సంస్థ ప్రచారం లో నటించింది. సన్నీలియోన్ పేటా, ఉదయ్ పౌండేషన్ ద్వారా ఆహారాన్ని వలస కార్మికులకు అందిస్తున్నారు. సన్నిలియోన్ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తన ఉదారమైన మనసును చాటుకున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!